Vijayawada PSCMR College Students Inventions: యువతలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీస్తే వినూత్నమైన ఆవిష్కరణలను తయారు చేస్తారనడానికి ఈ విద్యార్థులే నిదర్శనం. వారికి వచ్చిన ఆలోచనలను ఆచరణలో పెట్టి అద్భుతమైన ప్రాజెక్టులను రూపొందించారు. హాక్‌థాన్ 1.0 ఎడ్యునో సైన్స్ ప్రదర్శనలో భాగంగా వివిధ రకాల ప్రాజెక్టులను తయారు చేసి సందర్శకుల ప్రశంసలందుకుంటున్నారు.
విజయవాడలోని పొట్టి శ్రీరాములు చలువాది మల్లిఖార్జునరావు ఇంజినీరింగ్ కళాశాలలో హాకథాన్ 1.0 ఎడ్యునో రోబోట్స్ పేరుతో సైన్స్ ప్రదర్శన నిర్వహించారు. అందులో భాగంగా కాలేజీ విద్యార్థులు సమాజంలోని సమస్యలనే ఆధారంగా చేసుకుని స్మార్ట్ గ్లౌజ్, ఫ్లేమ్ డిటెక్షన్, బ్రిడ్జ్ ఓవర్‌ఫ్లో అలెర్టింగ్ సిస్ట్‌మ్ వంటి ఆవిష్కరణలను రూపొందించారు.
దివ్యాంగులకు ఉపయోగపడేలా స్మార్ట్‌గ్లౌజ్‌ను తయారు చేసిందో యువతి. దీనిని చేతికి ధరిస్తే ఎదుటి వారికి చెప్పాలనుకునేది సులభంగా అర్థమౌతుందని వివరించింది. భారీ వర్షాలకు రోడ్లపై ఉండే వంతెనలు కూలీ చాలా మంది ప్రాణాలు కోల్పోతుంటారు. అలాంటి ప్రమాదాలను అరికట్టేందుకు బ్రిడ్జ్ ఓవర్‌ప్లో అలెర్టింగ్ సిస్ట్‌మ్‌ను తయారు చేశామంటోంది మరో యువతి.
పండ్ల వ్యర్థాలతో భూమిని సారవంతం- విద్యార్థుల వినూత్న ప్రయోగం - Making Fruit Peels as Fertilizers
వీటితోపాటు హ్యూమనాయిడ్ రోబోను తయారు చేశారీ ఆవిష్కర్తలు. అలెక్సా ఆధారంగా మనం చెప్పిన పనిని ఈ రోబో చేస్తుందని చెబుతున్నారు. ఫ్లేమ్ డిటెక్షన్ ద్వారా అపార్ట్‌మెంట్లలో జరిగే అగ్నిప్రమాదాలను అరికట్టవచ్చని ఈ ఔత్సాహికులు అంటున్నారు. దాని పనితీరునూ వివరించారు.
తాము చేసిన ప్రాజెక్టు ద్వారా వర్షం పడుతున్నా మైదానాల్లో ఆటలు అడుకోవచ్చని అంటున్నారు. అందుకోసం స్మార్ట్ రూఫింగ్ సిస్టమ్‌ను తయారు చేశామంటున్నారు. పారిశుద్ద్య కార్మికులకు మేలు చేసే ప్రాజెక్టులు తయారు చేశారీ విద్యార్థులు. దీనిని ఐఆర్ సెన్సార్, వాటర్ లెవల్ ఇండికేటర్, స్మోక్ సెన్సార్‌లో తయారు చేసినట్లు చెబుతున్నారు. ఇవే కాకుండా చంద్రయాన్-3, యాప్ ద్వారా మొక్కలకు నీరు పోసే మిషన్ వంటి ప్రాజెక్టులను తయారు చేశారు. వాటన్నింటికీ సాంకేతికతను జోడించి మరింత అప్‌గ్రేడ్ చేస్తామని అంటున్నారు.
"సమాజంలోని సమస్యలనే ఆధారంగా చేసుకుని వినూత్న ఆవిష్కరణలు చేశాం. తక్కువ ఖర్చుతో పర్యావరణ రహితమైన స్మార్ట్ గ్లౌజ్, ఫ్లేమ్ డిటెక్షన్, బ్రిడ్జ్ ఓవర్‌ఫ్లో అలెర్టింగ్ సిస్ట్‌మ్ వంటి ప్రాజెక్టులను రూపొందించాం. వీటన్నింటికీ సాంకేతికతను జోడించి మరింత అప్‌గ్రేడ్ చేస్తాం." - విద్యార్థులు