ETV Bharat / state

ఏ పువ్వు కావాలన్నా వేడుక ఏదైనా - ఈ మార్కెట్​కు రావాల్సిందే

కొనుగోలుదారులతో కళకళలాడుతున్న పూల మార్కెట్​ - బెంగుళూరు నుంచి పూలు దిగుమతి - రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ఇక్కడినుంచే ఎగుమతి

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

Vijayawada_Flower_Market
Vijayawada Flower Market (ETV Bharat)

Vijayawada Flower Market: విజయవాడలోని ఈ పూల మార్కెట్​లో దొరకని పువ్వంటూ ఉండదు. వేడుక ఏదైనా పూల కొనుగోలుదారులు ఈ మార్కెట్​కి రావాల్సిందే. పండగలు, ఉత్సవాలు అయితే వేలాది రూపాయల పూలు ఈ మార్కెట్ నుంచి కొనుగోలు చేసి తీసుకెళ్తుంటారు. ఈ మార్కెట్ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాలకు పూలు ఎగుమతి చేస్తుంటారు. ఈ మార్కెట్​కి పూలు బెంగళూరుతో పాటు రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటుంటారు. ఉత్సవాల సమయంలోనే కాదు సాధారణ రోజుల్లో సైతం వేలాది మంది వచ్చి వారికి కావాల్సిన పూలను కొనుగోలు చేసుకుని తీసుకెళ్తారు. విజయదశమి కావడంతో ఈ పూల మార్కెట్ కొలుగోలుదారులతో కళకళలాడుతోంది.

విజయవాడలో వీఎంసీ కార్యాలయం పక్కనే ఉన్న పూల మార్కెట్ కొనుగోలుదారులతో కళకళ లాడుతోంది. ఈ పూల మార్కెట్లో ప్రజలకు కావాల్సిన అన్ని రకాల పూలు దొరకడంతో నిత్యం వేలాది మంది వచ్చి వారికి కావాల్సిన పూలు కొనుగోలు చేస్తుంటారు. అయితే ఈ ఇటీవల నగరంలో కురిసిన వర్షాలు, బుడమేరు వరదల కారణంగా ప్రజలు వినాయక చవితి గొప్పగా జరుపుకోలేకపోయారు. ఇళ్లు, వ్యాపార సముదాయాలు మునిగి తీవ్ర అవస్థలు పడ్డారు. ప్రస్తుతం వరద ప్రభావం తగ్గి పూర్తి స్థాయిలో తేరుకున్నారు.

దీంతో ఈ దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారు. పూల మార్కెట్​లో ప్రస్తుతం పండగల సీజన్ కావడంతో పూల ధరలు అధికంగా ఉన్నాయి. మల్లెపువ్వులు 16 వందల రూపాయలకు అమ్ముతున్నారు. మిగతా పువ్వులన్నీ వంద రూపాయల నుంచి 5 వందల రూపాయల వరకూ అమ్ముడుపోతున్నాయి. పూల ధరలు అధికంగా ఉండటంతో సామాన్యులు తక్కువ పూలనే కొనుగోలు చేసి వెనుదిరుగుతున్నారు. సాధారణ రోజుల కంటే రెట్టింపు ధరలకు పూలు అమ్ముతున్నట్లు కొనుగోలుదారులు చెబుతున్నారు.

విజయవాడ పూల మార్కెట్​కు అధిక శాతం బెంగళూరు నుంచి దిగుమతి అవుతుంటాయి. మల్లెపూలు, సన్నజాజులు వంటివి మైలవరం ప్రాంతం నుంచి విజయవాడ పూల మార్కెట్​కు వస్తుంటాయి. అయితే ఈ మార్కెట్ నుంచే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు పూలను ఎగుమతి చేస్తుంటారు. ప్రధానంగా విశాఖపట్నం, తుని, రాజమండ్రి, మచిలీపట్నం, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు పూలు ఎగుమతి చేస్తుంటారు. ప్రస్తుతం ఈ పూల మార్కెట్లో 81 షాపులు ఉన్నాయి.

"రేట్లు ఎక్కువగానే ఉన్నాయి. అన్ని రకాలు పూలు హోల్ సేల్​గా దొరుకుతాయి. బాగానే ఉంటాయి పూలు. విడిపూలు అరకేజీ 200 రూపాయలకి కొన్నాను. చామంతి పూలు అరకేజీ 250 తీసుకున్నారు. చామంతి పూల దండ అయితే 700 తీసుకున్నారు. గులాబీల దండ చిన్నది 500 రూపాయలు". - కొనుగోలుదారులు

"మామూలు రోజుల్లో కిలో 20 రూపాయలకి అమ్మినాము. ప్రస్తుతం కర్ణాటక నుంచే 60 రూపాయలకి కొంటున్నాము. కాబట్టి ఇక్కడ 80 రూపాయలకి అమ్ముతున్నాము. ఇందులో ట్రావెలింగ్ ఛార్జీ కిలోకి 12 రూపాయలు ఉంటుంది. వరదల కారణంగా వినాయక చవితి సరిగ్గా జరుపుకోలేదు. కానీ ప్రస్తుతం ప్రభుత్వం వారికి డబ్బులు ఇచ్చింది. దీని వలన అందరి దగ్గరా డబ్బులు ఉన్నాయి. పండగని మంచిగా చేసుకుంటున్నారు". - వ్యాపారులు

ఇవన్నీ విజయవాడ నగర పాలక సంస్థకు చెందినవే. గతంలో పంజాబ్ సెంటర్​లో ఉండే మార్కెట్​ని కొన్నేళ్ల క్రితం వీఎంసీ కార్యాలయం పక్కకు మార్చారు. ఇక్కడ శాశ్వత షాపులు నిర్మించి వ్యాపారులకు ఇచ్చారు. ఈ మార్కెట్లో అన్ని రకాల పూలు లభించడంతో ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో కొనుగోలుదారులు వచ్చి వారికి కావాల్సిన పూలను కొనుగోలు చేసి వెళ్తుంటారు. ఇది హోల్​సేల్ మార్కెట్ కావడంతో వ్యాపారులు సైతం ఇక్కడికే వచ్చి కొనుగోలు చేస్తుంటారు.

అద్భుతం - ఒకే చెట్టుకు విరబూసిన 20 బ్రహ్మ కమలాలు - 20 Brahma Kamalam Flowers at a Time

ఇంట్లో గన్నేరు పూల మొక్కలను పెంచుకోవచ్చా? వాస్తు నిపుణులు సమాధానమిదే! - Oleander Flower At Home

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.