ETV Bharat / state

యుద్ధప్రాతిపదికన ట్రాక్‌ల పునరుద్ధరణ - పూర్తికాగానే రైళ్లు పట్టాలెక్కిస్తాం : విజయవాడ డీఆర్‌ఎం - Railway Tracks Restoring

Railway Tracks will Rehabilitation : భారీ వరదలతో దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌ల పునరుద్ధరణ యుద్ధప్రాతిపదికన జరుగుతోందని విజయవాడ డీఆర్ఏం నరేంద్ర ఏ పాటిల్‌ తెలిపారు. ట్రాక్‌ పనులు పూర్తి కాగానే హైదరాబాద్‌-విజయవాడకు రైలు సర్వీసులు పునరుద్ధరిస్తామని వెల్లడించారు. అలాగే కాజీపేట, మహబూబాబాద్‌ వద్ద ట్రాక్‌ నిర్మాణం పూర్తికాగానే రైళ్లు పట్టాలెక్కిస్తామన్నారు.

Railway Tracks will Rehabilitation
Railway Tracks will Rehabilitation (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 4, 2024, 10:55 AM IST

Railway Tracks will Rehabilitation : భారీ వరదలతో దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌ల పునరుద్ధరణ యుద్ధప్రాతిపదికన జరుగుతోందని విజయవాడ డీఆర్​ఏం నరేంద్ర ఏ పాటిల్‌ తెలిపారు. ట్రాక్‌ పనులు పూర్తి కాగానే హైదరాబాద్‌-విజయవాడకు రైలు సర్వీసులు పునరుద్ధరిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం నీట మునిగిన రాయనపాడు రైల్వే స్టేషన్‌లో రెండు ట్రాక్‌లు బయటపడ్డాయని వాటి పటిష్ఠతపై భద్రత, సిగ్నలింగ్‌ అధికారులు తనిఖీలు చేస్తున్నట్టు తెలిపారు. మూడో ట్రాక్‌ కూడా తేలగానే పునరుద్ధరించనున్నట్టు తెలిపారు.

రైల్వే ట్రాక్‌ కింద వరద : కాజీపేట, మహబూబాబాద్‌ వద్ద ట్రాక్‌ నిర్మాణం పూర్తికాగానే రైళ్లు పట్టాలెక్కిస్తామన్నారు. వరద వల్ల ట్రాక్‌లు కొట్టుకుపోవడంతో విజయవాడ డివిజన్‌లోనే మూడు రోజుల్లో 323 రైళ్లు రద్దు చేసినట్టు తెలిపారు. 173 రైళ్లు దారి మళ్లించి నడిపామని, 120 రైళ్లు పాక్షికంగా రద్దు చేసినట్టు వెల్లడించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద గతంలో ఎన్నడూ లేని రీతిలో వరద ప్రవహించడంతో కృష్ణానదిపై నిర్మించిన రైల్వే ట్రాక్‌కి వరద తాకిందన్నారు. ఆ మార్గంలో ట్రాక్‌ను పరిశీలించామని పటిష్టంగా ఉందని పాటిల్‌ తెలిపారు. వరదల వల్ల 3 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రాయనపాడు స్టేషన్లో నీటిలో నిలిచిపోగా 4500మంది ప్రయాణికులను ఎన్డీఆర్ఎఫ్‌ సిబ్బంది సహకారంతో రెస్క్యూ ఆపరేషన్‌ చేసి బస్సుల్లో తరలించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చినట్లు తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు- 481 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే - SCR CANCELLED TRAINS

భారీగా రైళ్లు రద్దు : అయితే రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు దారులన్నీ ఏరులయ్యాయి. రైల్వే స్టేషన్​, ఆర్టీసీ బస్​ డిపోల్లోకి భారీగా వరద నీరు చేరుకుంది. దీంతో భారీగా రైళ్లు రద్దు, బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దూరప్రాంతాలకు వెళ్లే వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరదల కారణంగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. భారీగా రైళ్లు రద్దు కావడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. కృష్ణా నది, మున్నేరు, బుడమేరు పొంగి వరదనీరు రైల్వే ట్రాక్‌లు, హైవేలపై ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

తీవ్ర ఇబ్బందులు : దక్షిణ మధ్య రైల్వే పరిధిలో భారీగా రైళ్లను రద్దు చేశారు. అనేక రైళ్లను దారిమళ్లించారు. విజయవాడ సమీపంలోని రాయనపాడు స్టేషన్‌ను వరద ముంచెత్తింది. ఉత్తరాది నుంచి దక్షిణాది రాష్ట్రాలకు వెళ్లే కీలక రైల్వేలైన్‌ కావడంతో ఈ ప్రభావం తీవ్రంగా కనిపించింది. వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

వరద ధాటికి సొంతూళ్లకు పయనం - బస్సుల్లేక బస్టాండ్‌లో బాధితుల తిప్పలు - PEOPLE FACE TO TRANSPORT PROBLEM

ప్రయాణికులకు వరద కష్టాలు - దూరప్రాంతాలకు వెళ్లాలంటే అంతులేని నిరీక్షణ - transport Systrm Blocked in AP

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.