ETV Bharat / state

విజ్ఞాన్‌ విశ్వవిద్యాలయంలో సహజసిద్ధంగా నీటిశుద్ధి రూపకల్పన - గ్రామాల్లో ప్లాంట్లను ఏర్పాటుకు సిద్ధం! - water purification in ap - WATER PURIFICATION IN AP

Vignan University Focus on Water Purification: రోజురోజుకూ పెరుగుతున్న జనాభా అదే సమయంలో తగ్గిపోతున్న నీటి వనరులు ఈ రెండింటిని సమతూకం చేసి ప్రజల అవసరాలు తీర్చాలంటే నీటి పునర్వినియోగం ఒక్కటే మార్గం. ఈ క్రమంలోనే డ్రైనేజి నీటిని రీసైక్లింగ్ చేయటంపై ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాలు సాగుతున్నాయి. ఐతే ఖర్చు ఎక్కువ కావటంతో రీసైక్లింగ్ ప్లాంట్ల ఏర్పాటు విషయంలో అనేకమంది వెనకడుగు వేస్తున్నారు. గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ విశ్వవిద్యాలయం మాత్రం ఈ విషయంలో ముందడుగు వేసింది. సహజసిద్ధంగా నీటిని శుద్ధి చేసే ప్రాజెక్టును విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ నిపుణులు రూపొందించారు.

Vignan University Focus on Water Purification
Vignan University Focus on Water Purification (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 29, 2024, 9:11 AM IST

విజ్ఞాన్‌ విశ్వవిద్యాలయంలో సహజసిద్ధంగా నీటిశుద్ధి రూపకల్పన - గ్రామాల్లో ప్లాంట్లను ఏర్పాటుకు సిద్ధం! (ETV Bharat)

Vignan University Focus on Water Purification : ప్రపంచ వ్యాప్తంగా తగ్గిపోతున్న నీటి వనరులు మానవాళి మనుగడకు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. ఈ తరుణంలో నీటిని పొదుపుగా వాడటంతో పాటు రీ సైక్లింగ్ పైనా ప్రయోగాలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో నీటి అవసరాలు గుర్తించిన వారు ఇలాంటి నీటిశుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు.

గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ విశ్వవిద్యాలయం కూడా ఇదే ఆలోచనతో మురుగునీటి శుద్ధి ప్లాంటు నిర్మించింది. వర్సిటీ సివిల్ ఇంజినీరింగ్ విభాగం నిపుణుల ఆధ్వర్యంలో ఈ ప్లాంటు ఏర్పాటు చేశారు. తక్కువ ఖర్చుతో నిర్మాణం, అతి తక్కువ నిర్వహణ వ్యయం ఉండేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. యూనివర్సిటీలో నిత్యం 7లక్షల లీటర్ల నీటిని వినియోగిస్తుంటారు. ఒకప్పుడు అదంతా మురుగునీరుగా వెళ్లిపోయేది.

ప్రస్తుతం రీసైక్లింగ్‌ ప్లాంట్‌ ద్వారా మూడు అంచెల్లో మురుగునీటిని స్వచ్ఛంగా మారుస్తున్నారు. క్యాంపస్‌లోని మురుగునీరంతా ముందుగా ట్యాంకుల్లోకి చేరుతుంది. లక్ష లీటర్ల సామర్థ్యంతో ఏడు ట్యాంకులు ఇక్కడ ఉన్నాయి. నీటిలో కలిసిన మలినాల్నిశుద్ధి చేసేందుకు కూడా సహజసిద్ధమైన విధానాన్ని పాటిస్తున్నారు. ట్యాంకుల్లోని నీటిని పైపుల ద్వారా పక్కనే ఉన్న తడి నేలల్లోకి పంపిస్తారు. ఇక్కడ నేలపై దాదాపు 4 అడుగుల మేర కంకరతో నింపారు. అందులో వేర్ల ద్వారా వివిధ రకాల రసాయనాల్ని పీల్చుకునే స్వభావం కలిగిన మొక్కలు నాటారు. ఈ మొక్కల ద్వారానే నీరు శుద్ధి జరిగి ఓపెన్ ట్యాంకులోకి చేరుతుంది. దానిని ఓజేనేషన్ ప్రక్రియ ద్వారా పూర్తి స్థాయిలో సురక్షితమైన నీటిగా మారుస్తున్నారు.

మత్స్యపురిలో మంచినీటి శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్​

గతంలో ఉన్న మురుగునీటి శుద్ధి ప్లాంట్లకు భిన్నంగా విజ్ఞాన్‌ వర్సిటీలో గ్రీన్ టెక్నాలజీ ఆలోచనతో రీసైక్లింగ్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. అతి తక్కువగా విద్యుత్ వాడకంతో పాటు బురద అనేది లేకుండా ఈ ప్లాంటు నిర్మించారు. మేలురకం బ్యాక్టీరియా వల్ల మురుగుశుద్ధి ప్లాంటులో బురద లేకుండా పోతుంది. దీనివల్ల ప్లాంటు నుంచి ఎలాంటి దుర్వాసనా వెలువడదు. మొక్కల ద్వారా నీటి శుద్ధి జరగటం వల్ల ఎలాంటి రసాయనాలు, యంత్రాలతో పని లేకుండా పోయింది.

మొక్కలు నీటిని శుద్ధి చేసే ప్రక్రియలో అవాంతరాలు లేకుండా ఏరియేషన్ నిర్వహిస్తారు. ఈ ప్రక్రియతో నీటిలోని హానికరమైన నైట్రేట్స్, సల్ఫేట్స్, లెడ్ వంటి హానికర పదార్థాలు తొలగిపోతాయి. మొక్కల ద్వారా శుద్ది అయిన నీటిని మూడోదశ శుద్ధిలో భాగంగా ఓజోనేషన్ చేయటం ద్వారా పూర్తిస్థాయిలో స్వచ్ఛంగా మారిపోతుంది. రీ యూజ్, రీ సైక్లింగ్, రెడ్యూజ్ అనే మూడు లక్ష్యాలతో ఈ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు యూనివర్సిటీ ప్రతినిధులు తెలిపారు.

ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాల్లో ఇది అత్యుత్తమమైనదిగా నిపుణులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక విభాగం కూడా ఈ తరహా పరిజ్ఞానాన్ని ఆమోదించింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటయ్యే మురుగునీటి శుద్ది ప్లాంట్లను ఈ తరహా పరిజ్ఞానంతో ఏర్పాటు చేస్తామని చెప్పింది. పల్నాడు జిల్లాలోని కొన్ని గ్రామాల్లో ఈ తరహా ప్లాంట్లను డీఎస్​టీ నిధులతో ఏర్పాటు చేసేందుకు పనులు జరుగుతున్నాయి.

వాననీటి బొట్టు- ఒడిసిపట్టు- నీటి కొరతకు చెక్​ పెట్టు - How to Enhance Ground Level Water

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.