ETV Bharat / state

గుండెపోటుతో తెలంగాణ విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ మృతి - సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి - Rajeev Ratan Dead in Heart Attack - RAJEEV RATAN DEAD IN HEART ATTACK

Vigilance DG Rajeev Ratan Died of Heart Attack : సీనియర్ ఐపీఎస్​, విజిలెన్స్​, ఎన్​ఫోర్స్​మెంట్​ డీజీ రాజీవ్​ రతన్​ మంగళవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. ఆయన మృతిపై తెలంగాణ సీఎం రేవంత్​ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

Vigilance DG Rajeev Ratan Died of Heart Attack

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 9, 2024, 2:02 PM IST

Updated : Apr 9, 2024, 3:10 PM IST

Vigilance DG Rajeev Ratan Died of Heart Attack : సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ హఠాన్మరణం చెందారు. ఉదయం ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మంగళవారం ఉదయం ఆయన మృతి చెందారు. ప్రస్తుతం ఆయన విజిలెన్స్‌ డీజీ గా విధులు నిర్వర్తిస్తున్నారు. రాజీవ్‌ రతన్‌ మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ జనరల్​గా పని చేస్తున్నారు.

1991 ఐపీఎస్​ బ్యాచ్​కు చెందిన రాజీవ్​ రతన్​ సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఇటీవల మేడిగడ్డ ప్రాజెక్టుపై ప్రభుత్వం నియమించిన విజిలెన్స్​ అండ్​ ఎన్​ఫోర్స్​మెంట్​ విచారణకు ఆయనే సారథ్యం వహించారు. గతంలో కూడా ఆయన కరీంనగర్​ ఎస్పీగా, ఫైర్​ సర్వీసెస్​ డీజీగా, ఆపరేషన్​ ఐజీగా పని చేశారు. హైదరాబాద్​ రీజియన్​ ఐజీగా, పోలీస్​ హౌసింగ్​ కార్పొరేషన్​ ఎండీగా వివిధ హోదాల్లో విధులు నిర్వహించారు.

ఎన్నికల ఏర్పాట్లపై సీఈసీ నిఘా- రాష్ట్రంలో పరిస్థితులపై ప్రత్యేక పరిశీలకులు - EC Appointed Special Police

గవర్నర్​ సంతాపం : విజిలెన్స్​ డీజీ రాజీవ్​ రతన్​ మృతికి రాష్ట్ర ఇంఛార్జి గవర్నర్​ రాధాకృష్ణన్​ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

తెలంగాణ సీఎం రేవంత్​ తీవ్ర దిగ్భ్రాంతి : సుదీర్ఘ కాలంగా రాష్ట్రంలో పోలీసు విభాగానికి ఆయన అందించిన విశిష్టమైన సేవలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సమర్థంగా, నిజాయతీగా విధులు నిర్వహించిన అధికారులను తెలంగాణ సమాజం ఎప్పటికీ మరిచిపోదని రేవంత్​ రెడ్డి అన్నారు. రాజీవ్​ రతన్​ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఆసుపత్రిలో కుటుంబ సభ్యులను పరామర్శించిన ఉన్నతాధికారులు : గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో విజిలెన్స్​ డీజీ రాజీవ్​ రతన్​ పార్థివదేహం ఉంది. ఆసుపత్రికి వచ్చి కుటుంబ సభ్యులను ఉన్నతాధికారులు పరామర్శిస్తున్నారు. ఇందులో డీజీపీ రవిగుప్తా, ఏసీబీ డీజీ ఆనంద్​, సైబరాబాద్​ సీపీ మహంతి ఉన్నారు.

రూ.1,600 ఇవ్వలేదని కాల్పులు.. 33 ఏళ్లుగా ట్రీట్​మెంట్​.. పోలీస్ మృతి

Last Updated : Apr 9, 2024, 3:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.