ETV Bharat / state

'మేం పోలీసులకు భయపడం - డబ్బులు ఇవ్వం, అరెస్ట్ చేస్తారా చేయండి' - CALLS FROM FAKE POLICE

పోలీసులమంటూ బెదిరింపు కాల్స్ - సైబర్ క్రైంకు సమాచారం ఇవ్వడంతో ఉడాయింపు

Threats From Digital Arrest in Vijayawada
Threats From Digital Arrest in Vijayawada (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 10, 2024, 9:39 AM IST

Threats From Digital Arrest in Vijayawada : 'మీ ఆధార్‌ కార్డు నకిలీది. మీ మీద కేసు నమోదు అయింది. మిమ్మలను అరెస్ట్ చేస్తున్నాం. విజయవాడలోని మొగల్రాజపురానికి చెందిన ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ (29)ను సుమారు 2 గంటల సేపు మాటల్లో పెట్టారు. రకరకాలుగా బెదిరించారు. అవసరం అయితే మీ ఏరియా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లండంటూ భయపెట్టారు'. నిజంగానే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సైబర్‌ క్రైం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లినట్లు గుర్తించి కాల్‌ కట్‌ చేశారు. సోమవారం ఈ ఘటన జరిగింది.

'మీ కుమార్తె లండన్‌లో డాక్టర్‌ చదువుతోంది. ఆమెపై కేసు నమోదు అయింది. ఆమెను అరెస్టు చేస్తున్నాం' విజయవాడలోని అంటూ కృష్ణలంకకు చెందిన ఓ వ్యాపారి (62)కి ఈ నెల 2న వచ్చిన బెదిరింపు కాల్‌. సీబీఐ అధికారిని అంటూ వీడియో కాల్‌ చేసి బెదిరింపులకు దిగారు. రూ.15 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీంతో ఆ వ్యాపారి కాల్‌ కట్‌ చేశారు. తాజాగా సోమవారం సైబర్ క్రైం పోలీసులుకు సమాచారం అందించారు.

డిజిటల్‌ అరెస్ట్ అంటూ కాల్ - అలర్ట్ కావడంతో డబ్బు సేఫ్

'మీరు ఇంటర్నెట్​లో అసభ్యకరమైన చిత్రాలు చూస్తున్నారు. మీ మీద కేసు నమోదు అయింది. మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాం' అంటూ ఓ వ్యవసాయశాఖ విశ్రాంత అధికారి (65)కి వచ్చిన ఫోన్ కాల్‌ ఇది. కంగారు పడిన ఆయన కాల్‌ కట్‌ చేశారు. ఈ నెల 6న సైబర్‌ నేరగాళ్లు ఫోన్‌ చేయగా ఆయన సైబర్‌ క్రైం పోలీసులకు సోమవారం వచ్చి జరిగిన సంఘటనను తెలిపారు.

పోలీసు దుస్తుల్లో వీడియో కాల్‌ : ఈ నెల 2న కృష్ణలంకకు చెందిన వ్యాపారికి వచ్చిన వీడియో కాల్‌లో వ్యక్తి సీబీఐ అధికారి అంటూ పరిచయం చేసుకున్నాడు. ఖాకీ దుస్తుల్లో చొక్కాపై పోలీసు లోగోలు ధరించి ఉన్నాడు. అతను చేసిన ఫోన్​ కాల్‌ వివరాలు పరిశీలిస్తే పాకిస్థాన్‌ అని వచ్చింది. పాకిస్థాన్‌ నుంచి సైబర్‌ నేరగాడు సీబీఐ అంటూ ఫోన్‌ చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మిగిలిన 2 కేసుల్లోనూ వీడియో కాల్‌లో పోలీసు దుస్తుల్లో కనిపించారు.

నకిలీ పోలీసులకు భయపడలేదు : డిజిటల్‌ అరెస్టు పేరుతో వచ్చే బెదిరింపు ఫోన్​ కాల్స్‌కు ప్రజలు స్పందించటం లేదు. విజయవాడలో వారం రోజుల వ్యవధిలో ఆరుగురు డిజిటల్‌ అరెస్టు పేరుతో బెదిరిస్తున్న నకిలీ పోలీసులకు ఏ మాత్రం భయపడలేదు. ధైర్యంగా వారి వివరాలను, ఫొటోలు వీడియోలు రికార్డు చేశారు. అనంతరం సైబర్‌ క్రైం పోలీసులకు అందిస్తున్నారు. ప్రజల్లో అవగాహన పెరుగుతుండటంతో పోలీసులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎవరికైనా బెదిరింపు కాల్స్‌ వస్తే వెంటనే సదరు కాల్స్‌ కట్‌ చేయాలని పోలీసులు సూచనలు చేస్తున్నారు.

జాగ్రత్త - ఈ నంబర్ల నుంచి కాల్స్ వస్తున్నాయా - లిఫ్ట్ చేయొద్దు

విశ్రాంత ఉద్యోగిని బెదిరించి రూ.1.4 కోట్లు కాజేశారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.