ETV Bharat / state

సూర్యాపేట మీదగా హైదరాబాద్​ టూ విజయవాడ రోడ్​ క్లోజ్​! - ప్రయాణం వాయిదా బెస్ట్ - Hyd to Vijayawada highway closed

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 1, 2024, 10:04 PM IST

Updated : Sep 1, 2024, 10:30 PM IST

Hyderabad to Vijayawada traffic stopped : సూర్యాపేట మీదగా హైదరాబాద్​ టూ విజయవాడ రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి. పాలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో జాతీయ రహదారిపై వరద నీరు చేరింది. దీంతో ఖమ్మం, విజయవాడ వెళ్లే ప్రజలు ప్రయాణం వాయిదా వేసుకోవాలని సూర్యాపేట ఎస్పీ సన్​ప్రీత్​ సింగ్​ అన్నారు.

Hyderabad to Vijayawada traffic stopped
Hyderabad to Vijayawada traffic stopped (ETV Bharat)

Hyderabad to Vijayawada Traffic Stopped : రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం వద్ద పాలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పాలేరు వాగు ప్రవాహానికి జాతీయ రహదారిపై నీరు చేరింది. దీంతో హైదరాబాద్​-విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో సూర్యాపేట ఎస్పీ సన్​ప్రీత్​ సింగ్​ సూర్యాపేట మీదగా ఖమ్మం, విజయవాడ వెళ్లే ప్రజలు ప్రయాణం వాయిదా వేసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో సూర్యాపేట నుంచి ఖమ్మం వెళ్లే మార్గంలో నాయకినిగూడెం వద్ద పాలేరువాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోందని తెలిపారు. రక్షణ చర్యల్లో భాగంగా ఈ మార్గంలో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిపివేసినట్లు ఎస్పీ చెప్పారు.

హైదరాబాద్​ పోలీసులు సూచనలు : తెలుగు రాష్ట్రాల్లో వరదల దృష్ట్యా నగర ప్రజలకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పలు సూచనలు చేశారు. చిల్లకల్లు, నందిగామలో జాతీయ రహదారి 65పై వరద, ఏపీ-తెలంగాణ సరిహద్దు రామాపురం క్రాస్ వద్ద వంతెన కూలిపోయిన ఘటన, సూర్యాపేట ఖమ్మం రహదారిపై పాలేరు పొంగటం వంటి ఘటనల దృష్ట్యా సూచనల నగర ప్రజలు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితిల్లో వెళ్లాలనుకుంటే విజయవాడ వెళ్లేవారు చౌటుప్పల్, నార్కెట్​పల్లి, నల్గొండ, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా వెళ్లాలని సూచించారు.

ఖమ్మం వెళ్లే వారు చౌటుప్పల్, నార్కెట్​పల్లి, అర్వపల్లి, తుంగతుర్తి, మరిపెడ బంగ్లా మీదుగా వెళ్లాలని సూచిస్తున్నారు. ప్రయాణ సమయంలో అత్యవసర పరిస్థితి ఎదురైతే 9010203626 అనే నెంబర్​కు ఫోన్ చేయాలని తెలిపారు. సూర్యాపేట ఎస్పీ, ఖమ్మం కమిషనర్​ల నుంచి వచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ సూచనలు జారీచేశారు.

కోదాడలో భారీ వర్షం : సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి మండలం సంగెం-తిమ్మాపురం మధ్య వాగు ప్రవహించడంతో ఇళ్లు మునిగిపోయాయి. రాకపోకలకు అంతరాయం కలిగింది. మద్దిరాల మండలం గోరంట్ల గ్రామంలో నల్లకుంట చెరువు అలుగు పోయడంతో వరి పొలాలు కొట్టుకుపోయాయి. తెలంగాణ రెండవ భద్రాద్రిగా పేరు గాంచిన శ్రీ సీతారామాలయంలోకి వరద నీరు చేరింది. కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఎర్రకుంట చెరువు నిండటంతో ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది.

భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటిమట్టం - పరీవాహక ప్రాంత వాసుల్లో టెన్షన్​, టెన్షన్ - Godavari River Water Level Rises

రెయిన్‌ ఎఫెక్ట్ : విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించిన రాష్ట్రప్రభుత్వం - HOLIDAY FOR SCHOOLS

Last Updated : Sep 1, 2024, 10:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.