Varla Ramaiah Demands Arrest of YCP Leaders who Involved in Violence: దొంగే దొంగా దొంగా అనట్లుగా సీఎం జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (TDP politburo member Varla Ramaiah) విమర్శించారు. రాష్ట్రంలో రక్త చరిత్రను సృష్టించి ఎలక్షన్ కమిషన్‌పై బురద చల్లేందుకు కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం పంపిన ప్రతిపాదనల నుంచే అధికారులను ఎలక్షన్ కమిషన్ నియమించినదని గుర్తు చేసారు. డీజీపీనే ఆ అధికారులు సరిగ్గా పనిచేయడంలేదని వారిపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారని తెలిపారు.
అనంతపురంలో వజ్రాల వేట షురూ - ఎవరి అదృష్టం ఎలా ఉందో ఈసారీ! - Diamonds in Anantapur District
డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇంటిలిజెన్స్ అడిషనల్ డీజీ ఆంజనేయులు, కొల్లి రఘురామరెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డిలు పోలింగ్ రోజున ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. అందరూ కలిసి జగన్ గెలుపుకు కుట్ర పన్నింది నిజం కాదా అని నిలదీశారు. రాష్ట్రంలో కుట్రలు చేసింది వీరే అని వీరి కాల్ డేటా బయటకు తీస్తే అంతా తెలుస్తుందని అన్నారు. మాచర్లలో నరమేధానికి కారకులైన ఎమ్మెల్యే రామకృష్ణ ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డిలను వెంటనే అరెస్ట్ చేయాలని వర్ల రామయ్య డిమాండ్ చేసారు.
పిన్నెల్లి సోదరులను వెంటనే అరెస్టు చేయాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. కర్రలు, కత్తులు, పెట్రో బాంబులు పెట్టుకోవడమేంటని అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రగిరిలో పులివర్తి నానిపై హత్యాయత్నం జరిగిందని అన్నారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆయన కుమారుణ్ని కూడా అరెస్టు చేయాలని పోలీసు డిపార్టమెంట్ను కోరారు. రాష్ట్రంలో పోలింగ్ శాతం అధికంగా పెరిగేసరికి జగన్‌కు ఓటమి భయం పట్టుకుందని వర్ల మండిపడ్డారు. ఓటమి ఖాయమని తెలిశాకే హింసకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ అరాచకాలకు గుణపాఠం తప్పదని వర్ల రామయ్య హెచ్చరించారు.
అరాచకాలకు పాల్పడిన వైఎస్సార్సీపీ నేతలను వెంటనే అరెస్టు చేయాలి. అంతే కాకుండా వీటికి కారణమైన పిన్నెల్లి సోదరులను కూడా వెంటనే అరెస్టు చేయాలి. కర్రలు, కత్తులు, పెట్రో బాంబులు పెట్టుకోవడమేంటి అసలు మనం అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోంది. చంద్రగిరిలో పులివర్తి నానిపై హత్యాయత్నం జరిగింది దానికి కారకులైన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆయన కుమారుణ్ని కూడా అరెస్టు చేయాలి.- వర్ల రామయ్య, టీడీపీ సీనియర్ నేత