ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వంగవీటి జయంతి వేడుకలు - Vangaveeti 77th birth celebrations

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 4, 2024, 8:13 PM IST

Updated : Jul 4, 2024, 10:13 PM IST

Vangaveeti Mohana Ranga 77th Birth Anniversary Celebrations : వంగవీటి మోహన రంగా జయంతి వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేక్​లను కట్ చేసి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్బంగా రంగా సేవలను గుర్తుచేసుకున్నారు.

Vangaveeti Mohana Ranga 77th Birth Anniversary Celebration
Vangaveeti Mohana Ranga 77th Birth Anniversary Celebration (ETV Bharat)

Vangaveeti Mohana Ranga 77th Birth Anniversary Celebrations : వంగవీటి మోహన రంగా 77వ జయంతి వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. విజయవాడలో రంగాకు ఆయన కుమారుడు రాధాకృష్ణ నివాళులర్పించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో జరిగిన రంగా జయంతి వేడుకల్లో రాధాకృష్ణ, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. అలాగే జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల గాంధీ, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ నూతులపాటి బాల, బొప్పన భవ కుమార్​లు రంగా విగ్రహానికి నివాళులర్పించారు. రాబోయే రోజుల్లో రాధా వద్దకు పదవులు నడుచుకుంటూ వస్తాయని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కొనియాడారు. పదవుల కంటే రంగా తనయుడిగా ప్రజల గుండెల్లో స్థానమే తనకి గొప్పదని రాధా అన్నారు. కూటమి విజయంలో రంగా అభిమానుల పాత్ర కీలకమని నేతలు వ్యాఖ్యానించారు. అదేవిధంగా కృష్ణా జిల్లా దివిసీమ, మర్రిపాలెం, టీ కొత్తపాలెం, నాగాయలంక ఒంగోలు, అనంతపురంలో రంగా జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ - పలు అంశాలపై సుమారు 30 నిమిషాలు పాటు చర్చలు

అనంతపురంలో బలిజ సంఘం ఆధ్వర్యంలో వంగవీటి మోహన రంగా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరపాలక కార్యాలయం ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశంలో వంగవీటి మోహన రంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంగవీటి మోహన రంగా చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని వంగవీటి మోహన్ రంగ 77వ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హాజరయ్యారు. అనంతరం వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తరువాత కేక్​ను కట్ చేసి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మోహన్ రంగా అప్పటి రోజుల్లో కాపు సంఘాల కోసం, ప్రజల కోసం అనేక సేవలు చేశారని కొనియాడారు. గత 76 సంవత్సరాలుగా మోహన్ రంగా జన్మదిన కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా ఎప్పుడు జరుగుతునే ఉన్నాయని గుర్తుచేశారు. రంగా కుమారుడు రాధాకృష్ణ కూడా తెలుగుదేశం పార్టీలో ఉంటూ చంద్రబాబు అడగుజాడల్లో నడుస్తున్నారని తెలియజేశారు. ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడైనా చేసేందుకు తన వంతు సాయం చేస్తానని ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ చెప్పారు.

పిన్నెల్లిని అన్యాయంగా అరెస్టు చేశారు - జగన్ ఆవేదన - jagan met pinnelli ramakrishna

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో వంగవీటి రంగా జయంతి వేడుకలను టీడీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. అక్కడి వెంకటేశ్వర థియేటర్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన సేవలను గుర్తుచేసుకున్నరు. విజయవాడలో టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో వంగవీటి రంగ జయంతి కార్యక్రమం జరిపారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా విజయవాడ తూర్పు నియోజక వర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు పాల్గొని ప్రసంగించారు. పేద ప్రజల హక్కుల కోసం వంగవీటి మోహన్ రంగ చివరి శ్వాస వరకు కృషి చేశారని వక్తలు కొనియాడారు. ఆయన మరణించి 35ఏళ్లు అవుతున్నా నేటికి ప్రజల గుండెల్లో సజీవంగా ఉన్నారన్నారు.

పీసీబీ దస్త్రాల దహనంపై పవన్ కల్యాణ్​ ఆరా - కీలక ఆదేశాలు - pawan kalyan on pcb documents issue

Last Updated : Jul 4, 2024, 10:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.