ETV Bharat / state

ప్రతిభతో ఆర్థిక అవరోధాలు జయించి - అమెరికాలో విద్యనభ్యసించేందుకు అర్హత సాధించిన విద్యార్థి - US Youth Exchange Selected Girl - US YOUTH EXCHANGE SELECTED GIRL

US Youth Exchange Programme Selected Girl: ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపించింది జంగారెడ్డిగూడెంకు చెందిన విద్యార్థి. అమెరికాలో నిర్వహించే కెనడీ లూగర్‌ యూత్‌ ఎక్స్‌ఛేంజ్‌ కార్యక్రమానికి ఆమె అర్హత సాధించింది. ఆర్థిక కష్టాల మధ్య నలిగిపోతున్న భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుకోవాలనే కలకు పునాదులు వేసుకుని ప్రశంసలు అందుకుంటోంది ఆ యువతి. ఈ ప్రోగ్రాంకు ఏ విధంగా అర్హత సాధించిందో వివరించింది.

US Youth Exchange Programme Selected Girl Story
US Youth Exchange Programme Selected Girl Story (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 21, 2024, 5:26 PM IST

ప్రతిభతో ఆర్థిక అవరోధాలు జయించి - అమెరికాలో విద్యనభ్యసించేందుకు అర్హత సాధించిన విద్యార్థి (ETV Bharat)

US Youth Exchange Programme Selected Girl: స్పష్టమైన లక్ష్యం సాధించాలనే తపనకు నిత్యసాధన తోడైతే పేదరికం గమ్యానికి అడ్డుకాదని నిరూపిస్తోంది ఆ అమ్మాయి. ఒంటరిగా కుటుంబాన్ని పోషిస్తున్న తల్లికి బాసటగా నిలవాలంటే చదువే ఏకైక మార్గమని నమ్మింది. వేల మందితో పోటీపడి అమెరికాలో యూత్ ఎక్స్చేంజి ప్రోగ్రాంకు ఎంపికై సీఎం నుంచి ప్రశంసలు అందుకుంది. ఆర్థిక అవరోధాలు ప్రతిభతో జయించి బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకుంటున్న పేదింటి విద్యాకుసుమం గురించి తెలుసుకుందాం.

పేదరికమనే చీకట్లు జయించే ఆయుధం చదువొక్కటే అని నమ్మింది ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన బందెల సూర్య తేజశ్రీ. చిన్నప్పటి నుంచే చదువుల్లో ముందంజలో ఉంటూ మెరిట్ విద్యార్థినిగా పేరు తెచ్చుకుంది. అధ్యాపకుల సహకారంతో అమెరికాలో యూత్ ఎక్స్‌ఛేంజి ప్రోగ్రాంకు ఎంపికై సంవత్సరం పాటు ఉచితంగా చదివే అవకాశం దక్కించుకుంది. ఆర్థిక కష్టాల మధ్య నలిగిపోతున్న భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుకోవాలనే కలకు పునాదులు వేసుకుని ప్రశంసలు అందుకుంటోంది.

అమెరికా 'యూత్‌ ఎక్స్‌ఛేంజ్‌' కార్యక్రమానికి రాష్ట్ర విద్యార్థిని - సాయం చేసిన చంద్రబాబు - CBN And Lokesh Help For Girl

కృష్ణా జిల్లా ఈడ్పుగల్లులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల ఐఐటీ, మెడికల్ అకాడమీలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. అభివృద్ధి చెందిన దేశాల్లో సంస్కృతి, సాంప్రదాయాలపై అమెరికాలో ఏడాదిపాటు స్టడీ టూర్ నిర్వహిస్తుంటారు. అమెరికా ఫీల్డ్‌ సర్వీసు సంస్థ ఈ పరీక్ష పెడుతుంటుంది. ఉపాధ్యాయుల ద్వారా కెన్నడి లూగర్‌ యూత్‌ ఎక్స్ఛేంజి ప్రోగ్రాం గురించి తెలుసుకుంది తేజశ్రీ. ఎలాగైనా ఎంపికవ్వాలని కష్టపడి చదివింది.

అమెరికాలో ఏడాది పాటు అందించే కోర్సుల్లో నచ్చినది అభ్యసించే అవకాశం ఉంటుంది. కెనడీ లూగన్​ యూత్ ఎక్స్చేంజ్ అండ్​ స్టడీ ప్రోగ్రాంను అభ్యసిస్తాను. ఈ ప్రోగ్రాంలో ఎంపిక కావడానికి 12 దశలు ఉంటాయి. అన్ని దశల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచిన వారిని ఎంపిక చేస్తారు. ఇందులో విద్యార్థి కమ్యూనికేషన్ నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం, వ్రాత నైపుణ్యాలు వంటివి పరీక్షిస్తారు. ఈ ప్రోగ్రాం అంబేడ్కర్ గురుకుల వర్సిటీ ద్వారా తెలిసింది. రాష్ట్రం నుంచి ఇద్దరు మాత్రమే అర్హత సాధించాం. అక్కడికి వెళ్లాక రాష్ట్ర సంస్కృతి, సాంప్రదాయాలను చాటి చెబుతాం.-సూర్యతేజశ్రీ, విద్యార్థిని.

దేశవ్యాప్తంగా వేలమంది పోటీపడగా 30 మందే మిచిగాన్ స్టేట్ హోప్కిన్స్ యూత్ ఎక్స్చేంజి ప్రోగ్రాంకు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరమ్మాయిలకే అవకాశం దక్కింది. అందులో ఒకరిగా నిలిచింది తేజశ్రీ. ఇందుకు ఎలా చదివింది. పరీక్షలు దాటి ఈ అవకాశం సంపాదించిందో వివరించింది. ఇంత ప్రతిష్ఠాత్మక ప్రోగ్రాంకు వెళ్లే అవకాశం లభించడం ఆనందంగా ఉందంటోంది తేజశ్రీ. ఈ విషయం తెలిసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్​ తనను అభినందించడం మరిపోలేనని చెబుతోంది. అమెరికాలో ఏడాదిపాటు నచ్చిన కోర్సు అభ్యసించే అవకాశం దక్కిందని సంబరపడుతోంది.

నా కుమార్తె చదువు విషయం ప్రజా దర్బార్‌లో మంత్రి లోకేశ్‌కు విన్నవించాను. దీంతో ఆయన వెంటనే స్పందించారు. తన విదేశీ విద్యకు సాయం చేస్తామన్నారు. నా కుమార్తెను సీఎం చంద్రబాబు ప్రశంసించారు. చదువుకున్న ప్రతి ఒక్కరు పేదరికంలోనే జీవించకూడదని లోకేశ్​ సాయం అందించారు. ఇంతటి సాయం చేసిన చంద్రబాబు, లోకేశ్​కు ప్రత్యేక ధన్యవాదాలు. - విద్యార్థిని కుటుంబసభ్యులు.

ఆర్థిక సాయం చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు: తమ ఆర్థిక పరిస్థితిని గమనించి ప్రభుత్వం లక్ష రూపాయల ఆర్థిక సాయం, ల్యాప్‌టాప్‌ను అందించిందని కృతజ్ఞతలు తెలుపుతోందని తేజశ్రీ తల్లి. జీవితంలో ఎదురొచ్చిన కష్టాలు, కన్నీళ్లనే ఆదరువుగా చేసుకుని.. కలలబాటలో పయనిస్తోంది తేజశ్రీ. పట్టుదలతో చదివి అమెరికా స్టడీటూర్‌కు వెళ్లే అవకాశాన్ని ఒడిసిపట్టుకుంది. ఈ కార్యక్రమం ద్వారా భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాల ఔన్నత్యాన్ని ప్రపంచానికి తెలియజేస్తానని అంటోంది ఈ మట్టిలో మాణిక్యం.

కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలకు వేదిక - ఇంజినీరింగ్​ కాలేజీల్లో స్పేస్​ డే వేడుకలు - National Space Day Celebrations

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.