ETV Bharat / state

అకాల వర్షాలతో అన్నదాతలు విలవిల- వేలాది ఎకరాల్లో పంట నష్టం - Unseasonal Rains Damage Crops

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 21, 2024, 9:30 PM IST

Unseasonal Rains Damage Crops in AP : రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు అన్నదాతలకు తీవ్రంగా దెబ్బతీశాయి. ఊహించని విధంగా మంగళ, బుధవారాల్లో కురిసిన వానల వల్ల ఉత్తరాంధ్రతో పాటు గోదావరి జిల్లాల్లో వివిధ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆరుగాలం శ్రమించి చివరికి పంట కోతకు సిద్ధంగా ఉన్న సమయంలో, పంట నీటిపాలు కావడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Unseasonal_Rain_Damage_Crops_in_AP
Unseasonal_Rain_Damage_Crops_in_AP

Unseasonal Rain Damage Crops in AP : ఆరుగాలం శ్రమించి పంటలు సాగుచేస్తున్న అన్నదాతకు అడుగడుగునా ఇబ్బందులు తప్పడంలేదు. ఎన్నెన్నో సమస్యలను ఎదుర్కొని పండించిన పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు పడి వారి బతుకులను చిదిమేస్తున్నాయి. మంగళ, బుధవారాల్లో విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో ఈదురు గాలులతో కురిసిన వానతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వందలాది ఎకరాల్లో మొక్కజొన్న, అరటి తోటలు నేలకొరిగాయి.

అకాల వర్షం.. ఆందోళనలో మామిడి రైతాంగం

జిల్లాలోని గరివిడి మండలంలో 300 ఎకరాలు, చీపురుపల్లి మండలంలో 450 ఎకరాల్లో మొక్కజొన్న పంటకు నష్టం చేకూరిందని వ్యవసాయశాఖ అధికారులు జరిపిన ప్రాథమిక పరిశీలనలో తెలిసింది. కొన్ని చోట్ల వాటి కండెలు పాలుపోసుకునే దశలో ఉండగా మరికొన్ని చోట్ల కోతకు సిద్ధంగా ఉన్నాయి. వర్షంతోపాటు ఈదురు గాలులు బలంగా వీయడంతో పైరు పూర్తిగా నేలకొరింది. అంతేకాదు వెదుళ్లవలస, కొండశంభాంలో అరటి తోటలు నేలమట్టమయ్యాయి. నష్టాలను అంచనా వేసి, ఉన్నత అధికారులకు నివేదిస్తామని ఉద్యాన శాఖ అధికారి చంద్రశేఖర్ తెలిపారు. అలాగే గరివిడి మండలంలోని కుమరాం, కోడూరు, కొండపాలెం, తోండ్రంగి, చుక్కవలస, ఎం.దుగ్గివలస, మందిరవలసట గ్రామాల్లో మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లినట్లు గుర్తించామని ఎంఏవో శైలజ తెలిపారు.

Unseasonal RainS in Vizianagaram District : గజపతిగనరం పాత శ్రీరంగరాజపురం, కొత్తశ్రీరంగ రాజపురం, పిడిశీల, సీతారాంపురం, తుమ్మి కాపల్లి గ్రామాల్లో ముందుగా వేసిన రబీ మొక్కజొన్న పంట కంకులను కొంత మంది రైతులు కోశారు. వాటిని ఎండ బెట్టేందుకు పొలాల్లో వదిలేశారు. అకస్మాత్తుగా మంగళవారం కురిసిన వర్షానికి కంకులు మెత్తగా నానిపోయాయని, మొలకలు వచ్చే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటల నష్టాన్ని అంచన వేశామని ఉన్నతాధికారుల సూచన మేరకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

పొగాకుపై పగ..రైతుల ఆశలు ఆవిరి..గిట్టుబాటు ధర లేక రైతు కంట నీరు

పార్వతీపురం జిల్లాలో ఈదురు గాలులు కారణంగా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది రైతులు వాపోయారు. వీరఘట్టం మండలం కంబర గ్రామంలో చేతికందిన అరటి పంట నేలకూలడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు 50 ఎకరాల్లో అరటి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. గత ఏడాది ఇటువంటి పరిస్థితి కారణంగా నష్టపోయామని, ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ రైతులు కోరుతున్నారు.

ఏలూరు జిల్లా పోలవరంలో పెనుగాలి బీభత్సం సృష్టించింది. కుండపోత వర్షానికి వందలాది ఎకరాల్లో మెుక్కజొన్న నేలవాలింది. సుమారు 800 ఎకరాల్లో నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన పంటను అంచనా వేస్తున్నామని వ్యవసాయ అధికారులు తెలిపారు. పెనుగాలులతో చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడటంతో పలు ప్రాంతాల్లో విద్యుత్​కు అంతరాయం ఏర్పడింది.

అకాల వర్షాలతో అన్నదాతలు అతలాకుతలం - వందల ఎకరాల్లో పంట నష్టం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.