ETV Bharat / state

పలు వర్సిటీల వీసీలు, రిజిస్ట్రార్లు రాజీనామా - సంబరాల్లో విద్యార్థులు - University Registrars Resigns in AP

Universities VCs and Registrars Resigns in AP: వైఎస్సార్సీపీ హయాంలో కొన్ని యూనివర్సిటీల్లో కొందరు ఉద్యోగులపై పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తుండటంతో వారు రాజీనామా చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతల అండతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకున్నారని విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. దీంతో పలు జిల్లాల్లో ఉన్న విశ్వవిద్యాలయాల నుంచి కొందరు రాజీనామా చేస్తున్నారు.

Universities Registrars And Vice Chancellors Resigns in AP
Universities Registrars And Vice Chancellors Resigns in AP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 29, 2024, 10:08 PM IST

పలు వర్సిటీల వీసీలు, రిజిస్ట్రార్లు రాజీనామా - సంబరాల్లో విద్యార్థులు (ETV Bharat)

Universities VCs and Registrars Resigns in AP: రాష్ట్రంలో పలు విశ్వవిద్యాలయాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో యూనివర్సిటీల్లో స్వామి భక్తి చాటుకున్న ఉపకులపతులు, రిజిస్ట్రార్​లు వంటి కీలక పదవుల్లో నియమితులైన కొందరు ఉద్యోగులపై పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తుండటంతో వారు రాజీనామా చేస్తున్నారు. ఇప్పటివరకు వైఎస్సార్సీపీ నేతల అండదండలతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకున్నారని విద్యానిపుణులు, విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పలు విశ్వవిద్యాలయాల నుంచి అధికారులు తప్పుకుంటున్నారు.

కడప యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య చింతా సుధాకర్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనతోపాటు రిజిస్ట్రార్‌ వెంకటసుబ్బయ్య కూడా రాజీనామా చేశారు. చింతా సుధాకర్‌, వెంకటసుబ్బయ్య రాజీనామాను ఉన్నత విద్యామండలి ఆమోదించింది. వైఎస్సార్సీపీతో అంటకాగినట్లు చింతా సుధాకర్‌, వెంకటసుబ్బయ్యపై ఆరోపణలు వెలువెత్తాయి. ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌గా వైవీయూ ప్రిన్సిపల్‌ రఘునాథ్‌రెడ్డికి అదనపు బాధ్యతలను విద్యామండలి అప్పగించింది. నెల్లూరు జిల్లాలోని విక్రమ సింహపురి వర్సిటీ రిజిస్ట్రార్​గా పని చేస్తున్న రామచంద్రారెడ్డి రాజీనామా చేశారు. కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా రామచంద్రారెడ్డి చేరారు.

ఏయూ ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌గా ఆచార్య కిషోర్ బాబు బాధ్యతలు స్వీకరణ - AU New incharge registrar

విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ప్రసాదరెడ్డి, రిజిస్ట్రార్‌ స్టీఫెన్‌సన్‌ తమ పదవులకు రాజీనామా చేశారు. ఇన్‌ఛార్జ్‌ రిజిస్ట్రార్‌గా ప్రొ. కిశోర్‌బాబు బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థిగా జీవితం మొదలు పెట్టి ఇక్కడే అధ్యాపకునిగా చేరి ఇంఛ్​ర్జి రిజిస్ట్రార్​గా బాధ్యతలు తీసుకోవడంపై కిషోర్ బాబు ఆనందం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి యూనివర్సిటీని భ్రష్టు పట్టించారంటూ విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా, వీసీ ఛాంబర్‌ను, వర్సిటీని వైఎస్సార్​సీపీ కార్యాలయంగా మార్చేశారని, వైఎస్సార్​సీపీ పెద్దల కనుసన్నల్లోనే పనిచేశారనే అభియోగాలు ఉన్నాయి. వైఎస్సార్​సీపీ గెలుపు కోసం పరిశోధకులను ఉపయోగించుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో కొత్త ప్రభుత్వం రావడంతో వీసీ తన పదవికి రాజీనామా చేశారు.

ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ప్రసాదరెడ్డి, రిజిస్ట్రార్‌ రాజీనామా - AU VC and Registrar Resigned

ఆంధ్ర విశ్వవిద్యాలయ మాజీ ఉపకులపతి ప్రసాద్‌రెడ్డి అక్రమాలపై న్యాయ విచారణ జరిపించి శిక్ష పడేలా చేస్తామని తెలుగుదేశం, బీజేపీ, జనసేన నేతలు చెప్పారు. ఏయూలో విద్యార్థుల అభివృద్ధికి దోహదపడే పాలకవర్గం ఉంటుందని ఎంపీ సీఎం రమేష్‌ స్పష్టం చేశారు. వీసీ అవినీతిపై గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. ఏయూలో మళ్లీ పూర్వ పరిస్థితులు రప్పిస్తామని భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు.

ఏయూలో అనేక అక్రమాలు జరిగాయని నిబంధనలకు విరుద్ధంగా పరీక్షలు పెట్టి నియామకాలు చేశారని గంటా పేర్కొన్నారు. ప్రసాదరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరతామన్నారు. ప్రసాద్‌రెడ్డి రాజీనామాతో పూర్వ విద్యార్థులు సైతం వర్సిటీకి చేరుకొని సంబరాలు చేసుకున్నారు. విద్యార్థులు సిబ్బందికి సంఘీభావం తెలిపారు. ఏయూలో రాజకీయ కార్యకలాపాలను నిర్మూలించి, వర్సిటీ ప్రతిష్టను పునరుద్ధరిస్తామని నేతలు చెప్పారు.

బెదిరించి రాజీనామా చేయించారు- గుడివాడ వైసీపీ నేతలపై మాజీ వాలంటీర్ల ఫిర్యాదు - EX Volunteers Complaint YCP Leaders

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.