ETV Bharat / state

ఆంధ్రప్రదేశ్​లో ప్రతి ఐదుగురిలో నలుగురు ఖాళీ- రోజురోజుకూ పెరుగుతోన్న నిరుద్యోగిత - Unemployement in AP - UNEMPLOYEMENT IN AP

Unemployement in AP : రాష్ట్రంలో ప్రతి ఐదుగురు యువకుల్లో ఒకరికి ఉపాధి లభించడం లేదు. ఈ విషయాన్ని కేంద్ర గణాంక-కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే తాజాగా వెల్లడించింది. ఈ ఏడాది జనవరి-మార్చి బులెటిన్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది.

Unemployement in AP
Unemployement in AP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 25, 2024, 12:05 PM IST

Unemployement in AP : రాష్ట్రంలో నిరుద్యోగం రోజురోజుకూ పెరిగిపోతోంది. చదువులు పూర్తి చేసిన ఉద్యోగం రాక యువత నానాఅవస్థలు పడుతోంది. ప్రతి ఐదుగురు యువకుల్లో ఒకరికి ఉపాధి లభించడం లేదు. ఈ విషయాన్ని కేంద్ర గణాంక-కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే (PLSF) తాజాగా వెల్లడించింది. ఈ ఏడాది జనవరి-మార్చి బులెటిన్‌ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఇది కూడా కేవలం పట్టణాల్లో అదీ 15 నుంచి 29 ఏళ్ల వారి విషయంలోనే ఇతర వయస్సుల వారు, పట్టణేతర ప్రాంతాల ప్రజలనూ పరిగణనలోకి తీసుకుంటే ఉపాధి లేమి ఇంకా పెరగొచ్చు. వైఎస్సార్సీపీ పాలనలో కొత్త పరిశ్రమలు రాకపోవడం, ఉన్నవాటినీ వెళ్లగొట్టడం, నిర్మాణ రంగం కుదేలవడం, ఐటీ ఊసే లేకపోవడం వంటి అనేక కారణాలతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి.

జగన్ చలవతో మనమే నెంబర్ వన్ - ఎందులోనో తెలిస్తే షాక్​ అవుతారు!

రాష్ట్రంలో 21.5శాతం : రాష్ట్రంలో నిరుద్యోగ రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది. 2024 జనవరి-మార్చిలో జాతీయ స్థాయి నిరుద్యోగ రేటు 18.9% ఉండగా రాష్ట్ర సగటు 21.5% నమోదైంది. ఒక్క పట్టణ ప్రాంత పురుషులనే తీసుకుంటే జాతీయ స్థాయిలో 15.1శాతం, ఏపీలో 19.1శాతంగా ఉంది. గత సంవత్సరం మార్చి నుంచి ఈ ఏడాది మార్చి వరకు కేవలం పట్టణ ప్రాంతంలోని 15-29 ఏళ్ల యువత ఉపాధిలేమి రేటు జాతీయ స్థాయిలో 18.9% నుంచి 19.25% మధ్య నమోదైంది.

జాతీయస్థాయిలో 3.4 శాతం - ఏపీలో 12 శాతం : అదే మన రాష్ట్రంలో గతేడాది అక్టోబరు-డిసెంబరు మధ్య గరిష్ఠంగా 26.55శాతానికి ఎగబాకింది. ఈ సంవత్సర కాలంలో 15-29 మధ్య వయసున్న పురుషుల విషయంలో జాతీయ సగటు 14.6%-15.19% మధ్య ఉండగా ఏపీలో మాత్రం 19.1% నుంచి 21.7 % మధ్య కొనసాగింది. మహిళల విషయానికొస్తే జాతీయ స్థాయిలో 22.5% నుంచి 22.9% మధ్యన ఉండగా రాష్ట్రంలో 23.9% నుంచి 32.1% వరకూ నమోదైంది. ఇక అన్ని వయసుల పురుషుల్లో నిరుద్యోగ రేటు జాతీయస్థాయిలో 3.4% ఉంటే అదే ఏపీలో 12%గా నమోదైంది. మహిళల్లో జాతీయ సగటు 3.7%కాగా రాష్ట్రంలో 20.2%గా ఉంది.

ఒక జాబ్ ఉంటే ఇయ్యమ్మా.. మెట్రో రైల్లో నిరుద్యోగుల భిక్షాటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.