ETV Bharat / state

మీ ఇంటికి ఇలాంటి 'తెనాలి' గ్యాంగ్​ రావొచ్చు - బీకేర్​ఫుల్​! - NARA DISTI POOJA IN HYDERABAD

నరదిష్టి ఉంది, పూజలు చేస్తామంటూ మాయమాటలు చెప్పి డబ్బులు కాజేస్తున్న మహిళలు

two_women_fraud_in_the_name_of_nara_disti_pooja_in_hyderabad
two_women_fraud_in_the_name_of_nara_disti_pooja_in_hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 26, 2024, 11:00 AM IST

Updated : Oct 26, 2024, 2:06 PM IST

Two Women Fraud in the Name of Nara disti Pooja in Hyderabad : ఇంద్ర సినిమాలో బ్రహ్మానందం గ్యాంగ్​.. మీది తెనాలే మాది తెనాలే అంటూ పెద పిచ్చయ్య ఫ్యామిలీకి మాయమాటలు చెప్పి నగలు కొట్టేసిన సీన్​ మీకు గుర్తుండే ఉంటుంది. అచ్చం అలాగే హైదరాబాద్​లో ఓ ఘటన జరిగింది. కానీ ఇక్కడ ఆ సీన్​ పండించింది మాత్రం ఓ ఇద్దరు మహిళలు. చూడటానికి ఎంతో అమాయకంగా, కట్టు-బొట్టులో దైవత్వం ఉట్టిపడేలా నటిస్తూ దొంగ పూజలు చేస్తూ డబ్బులు కొట్టేశారు. కానీ చివరకు పోలీసులు వీళ్ల గుట్టు రట్టు చేశారు.

Cheated in the Name of Pooja were Arrested : ఇద్దరు మహిళలు నుదుట పెద్దబొట్టు పెట్టుకొని దైవత్వం అంతా ముఖంలో, వస్త్రాధరణలో కనిపించేలా నటిస్తూ ఇంటింటికి తిరిగి మీకు నరదిష్టి ఉంది, మేము తొలగిస్తామని నమ్మిస్తారు. ఇంట్లో ఉండే సామగ్రి, నగదును తెప్పించి మూట కట్టిస్తారు. పూజ చేస్తున్నట్లు నటిస్తూనే సొమ్ము దోచేస్తారు. ఈ ఇద్దరు మహిళలను బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు.

పాముకాటుతో బాలిక మృతి.. బతికించేందుకు మృతదేహానికి పేడ పూసి, వేప కొమ్మలతో పూజలు..

బంజారాహిల్స్‌ డీఐ బషీర్‌ అహ్మద్‌ తెలిపిన వివరాల ప్రకారం ప్రకారం మాదాపూర్‌లో ప్రీస్కూల్‌ నిర్వహిస్తున్న చిట్టినేని కరుణ బంజారాహిల్స్‌ రోడ్‌ నం.7లో నివసిస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 9న ఇద్దరు మహిళలు ఆమె ఇంటికి వచ్చారు. నరదిష్టి ఉందని నమ్మించి పూజ చేయాలంటూ నిమ్మకాయ, మిర్చి, ఉప్పు, బియ్యం, చీరతోపాటు రూ.లక్ష తీసుకొని రమ్మన్నారు. ఉపాధ్యాయురాలు వారికి రూ.70 వేలు ఇవ్వగా వాటిని సంచిలో మూటగట్టినట్టు ఆమెకు చూపారు. పూజలు చేస్తున్నట్లు నటిస్తూ రూ.70వేలను కాజేశారు. అరగంట పూజ చేసి తాము వెళ్లిన తరువాత చీర ధరించాలని, డబ్బులు తీసుకోవాలని నమ్మించి అక్కడి నుంచి జారుకున్నారు. వారు వెళ్లిన తరువాత చూడగా డబ్బు కనిపించలేదు. శ్రీనగర్‌కాలనీలో నివసించే పద్మ కొండల వద్ద రూ.51వేలు, జూబ్లీహిల్స్‌ డాక్టర్‌ ఆర్‌.ఎన్‌.సుబ్బారెడ్డి నివాసంలో రూ.లక్ష, సుజీత్‌ నారాయణ్‌ ఇంట్లో రూ.లక్ష, పంజాగుట్టలో ఉపాధ్యాయురాలైన రమా గుప్తా వ్దద రూ.లక్ష కాజేశారు. నిజామాబాద్‌ జిల్లాలోని జక్రాన్‌పల్లిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించి వారిని అరెస్ట్‌ చేశారు.

'రెండు మర్డర్​ కేసులున్నాయి-మిమ్మల్ని చంపేస్తే మరొకటి' - బాధితులకు వైఎస్సార్సీపీ నేత హెచ్చరిక

Last Updated : Oct 26, 2024, 2:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.