ETV Bharat / state

గొర్రెల మందపైకి దూసుకెళ్లిన లారీ - ఇద్దరు కాపరులు దుర్మరణం - road accident

Two Shepherds Along With Sheep Were Killed by a Lorry: నిర్లక్ష్యపు డ్రైవింగ్​ రెండు ప్రాణాలను బలితీసుకుంది. రోడ్డు దాటడానికి వేచిచూస్తున్న గొర్రెల మందపైకి లారీ దూసుకెళ్లిన ప్రమాదంలో ఇద్దరు గొర్రెల కాపరులతో పాటు 20 గొర్రెలు మృతి చెందాయి.

Four_Were_Died_in_Road_Accident
Four_Were_Died_in_Road_Accident
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 31, 2024, 3:07 PM IST

గొర్రెల మందపైకి దూసుకెళ్లిన లారీ - గొర్రెలు సహా ఇద్దరు కాపరులు దుర్మరణం

Two Shepherds Along With Sheep Were Killed by a Lorry in Anantapur: రోడ్డు దాటుతున్న గొర్రెల కాపర్లు, గొర్రెల మందపైకి లారీ దూసుకెళ్లటంతో ఇద్దరు గొర్రెల కాపర్లతో పాటు 20 గొర్రెలు మృతి చెందాయి. ఈ ఘటన అనంతపురం జిల్లా డి.హీరేహాల్‌ మండలం మడినేహళ్లి గేటు వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. ఇదిలా ఉండగా అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన వాహనం ఆగకుండా వెళ్లిపోవటంతో న్యాయం జరిగేంత వరకూ వెళ్లమని కుటుంబసభ్యులు మృతదేహంతో రోడ్డుపై ఆందోళనకు దిగారు.

Man Died in Road Accident At Annamayya District: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన అన్నమయ్య జిల్లా రాజంపేటలో చోటు చేసుకుంది. మృతుడు కర్నూలు జిల్లా పత్తికొండ మండలం బార్తాండ ప్రాంతానికి చెందిన చిన్న నాయక్‌ అనే కూలీగా గుర్తించారు. ప్రమాదం తర్వాత వాహనం ఆపకుండా వెళ్లిపోవడంతో స్థానిక కూలీలు, మృతుని బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. ప్రమాదానికి కారణమైన వాహనం, దాని డ్రైవర్​ను పట్టుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఆందోళనతో ట్రాఫిక్‌ జామ్‌ అవడంతో పోలీసులు మృతదేహాన్ని తరలించేందుకు సహకరించాలని కుటుంబసభ్యులను కోరారు. దీనికి వారు ఒప్పుకోకపోవడంతో కాసేపు పోలీసులు, మృతుడి బంధువుల మధ్య వాగ్వాదం జరిగింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేష్‌ నాయుడు ఘటనా స్థలానికి చేరుకుని కూలీలను శాంతింప చేశారు. ప్రమాదానికి కారణమైన వారిని పట్టుకుని శిక్షించేందుకు చర్యలు తీసుకుంటామని, పోలీసులతో తాను మాట్లాడతానని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.

టైరు పేలి మరో కారును ఢీకొట్టిన కారు - 19 నెలల చిన్నారితో సహా ముగ్గురు మృతి

Road Accident in Vizag: విశాఖ జిల్లా ఆనందపురం నుంచి మామిడిలోవ వెళ్తున్న కారు ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో కారు డ్రైవర్ చెల్లూరి రాంబాబు (33) అక్కడికక్కడే దుర్మరణం చెందగా, కారులో ప్రయాణిస్తున్న మహిళకు గాయాలయ్యాయి. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతదేహాన్ని భీమిలి ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

పల్నాడు జిల్లాలో కారు బీభత్సం - రెండు బైకులను ఢీకొట్టడంతో ఇద్దరు దుర్మరణం

UnKnown Persons Set Fire to Grass in Anantapur: గుర్తు తెలియని వ్యక్తులు గడ్డి వాముకు నిప్పు పెట్టటంతో రూ. 1.5 లక్షల విలువైన పశుగ్రాసం బూడిదైంది. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం గాజుల మల్లాపురంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు జిల్లాలోని మల్లాపురంలో మల్లన గౌడ్ అనే రైతు పశు పోషణకు పశుగ్రాసాన్ని వాము దొడ్డిలో నిల్వ ఉంచుకున్నాడు. మంగళవారం రాత్రి దానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. మంటలను బాధిత రైతు, స్థానికులు గమనించే లోపు విపరీతంగా వ్యాపించటంతో అదుపు చేసే ప్రయత్నం చేసినా ఫలితం లేదు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఈలోపే పశుగ్రాసం మొత్తం బూడిదయ్యింది. దీంతో బాధిత రైతుకు రూ. 1.5 లక్షల వరకు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. పక్కన ఉన్న గడ్డివాములకు మంటలు వ్యాపించకుండా స్థానికులు చొరవ చూపడంతో పెద్ద ప్రమాదం తప్పింది. గ్రామంలో పెద్దమ్మ అమ్మవారి గ్రామ దేవర కార్యక్రమం జరుగుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో గ్రామస్థులు ఉలిక్కి పడ్డారు.

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.