ETV Bharat / state

తిరుమలలో మరోసారి చిరుతల కలకలం - రంగంలోకి దిగిన అటవీ సిబ్బంది - Two leopards spotted at tirumala

Two Leopards Spotted at Tirumala: తిరుమలలో మరోసారి చిరుతల సంచారం కలకలం రేపింది. అలిపిరి నడకదారిలో ఆఖరి మెట్ల వద్ద రెండు చిరుతల సంచారంతో భయంతో భక్తులు కేకలు పెట్టారు. భక్తుల కేకలతో చిరుతలు అడవిలోకి పారిపోయాయి. ఘటనాస్థలానికి చేరుకుని విజిలెన్స్ సిబ్బంది ఆరా తీస్తున్నారు. చిరుత జాడలను గుర్తించేందుకు అటవీ సిబ్బంది రంగంలో దిగింది.

Leopards spotted at tirumala
Leopards spotted at tirumala (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 20, 2024, 4:46 PM IST

Two Leopards Spotted at Tirumala: తిరుమలలో మరోసారి చిరుతపులుల సంచారం కలకలం రేపింది. అలిపిరి నడకదారిలోని ఆఖరి మెట్లు వద్ద రెండు చిరుతలు సంచరించడాన్ని చూసిన భక్తులు బిగ్గరగా కేకలు పెట్టి భయంతో పరుగులు తీశారు. భక్తుల కేకలతో చిరుతలు రెండూ అడవిలోకి పారిపోయాయి. సమాచారం అందుకొని విజిలెన్స్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చిరుత జాడలను గుర్తించేందుకు ఫారెస్ట్‌ సిబ్బంది రంగంలోకి దిగారు. చిరుతపులుల సంచారంతో అప్రమత్తమైన భద్రత సిబ్బంది భక్తులను గుంపులుగా పంపుతున్నారు.

కాగా తిరుమల కొండపై కొద్ది రోజుల క్రితమే చిరుత సంచరించింది. తాజాగా మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. ఈ నెల 15వ తేదీన తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ రోడ్డులో చిరుత కనిపించింది. తెల్లవారుజామున భక్తుల కారుకు చిరుత అడ్డొచ్చింది. కారు సీసీటీవీ కెమెరాలో చిరుత దృశ్యాలు రికార్డు అయ్యాయి. చిరుతను చూసిన భక్తులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. చిరుత రోడ్డును దాటుకొని వెళ్లిపోవడంతో భక్తులు పీల్చుకున్నారు. గతంలో కూడా తిరుమలలో పలుమార్లు చిరుతలు కనిపించడం భక్తులను భయాందోళనకు గురి చేసింది. తాజాగా మరోసారి తిరుమలలో రెండు చిరుతలు కనిపించడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు.

తిరుమలలో చిరుత కలకలం - భక్తుల కారు సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు - Cheetah spotted at Tirumala

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.