ETV Bharat / state

ఏనుగు దాడిలో రైతుకు గాయాలు, కారు ధ్వంసం - అక్కడే తిష్ట వేసిన గజరాజు

Two Elephants Are Roaming at Forest Area: అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో గజరాజులు ప్రజలను గజగజ వణికిస్తున్నాయి. పంట పొలాలను సైతం నాశనం చేస్తున్నాయి. ఏనుగుల దాడిలో ఒక రైతు గాయపడగా, ఓ వాహనం ధ్వంసమైంది. అటవీ ప్రాంత సమీప గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

Two Elephants Are Roaming at Forest Area

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 4, 2024, 12:46 PM IST

Elephant Created Havoc in Chittoor District: చిత్తూరు జిల్లా శాంతిపురం, గుడుపల్లి మండలంలోని అత్తినత్తములో ఒక ఏనుగు బీభత్సం సృష్టించింది. కోనేరుకుప్పం, గొల్లపల్లి శివారులో ఏనుగు పంటలను తొక్కి నాశనం చేసి వెంకటాచలం అనే రైతుపై దాడి చేసింది. ఏనుగు దాడిలో రైతుకు తీవ్ర గాయాలయ్యాయి. కోనేరుకుప్పం పరిసరాల్లో ఏనుగు సంచరిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రాళ్లబూదుగూరు వద్ద ఓ కారును ఏనుగు అడ్డుకుని ధ్వంసం చేసింది. ఏనుగులు చేస్తున్న దాడులపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు హల్​చల్​- వ్యక్తి మృతి

Two Elephants Are Roaming at Forest Area: అన్నమయ్య జిల్లా కలికిరి, వాల్మీకిపురం మండలాల సరిహద్దుల్లోని మేకలవారిపల్లె అటవీ ప్రాంతంలో రెండు ఏనుగులు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గుట్టపాళెం, బర్నేపల్లె, మేకలవారిపల్లె, ఎర్రగుంట్లబావి తదితర అటవీ ప్రాంత రైతులు పొలాల వద్దకు ఒంటరిగా వెళ్లవద్దని అటవీ శాఖ అధికారులు సూచించారు. అడవిలో ఏనుగులు తిష్ట వేసి ఉన్నందున గొర్రెలు, మేకల కాపరులు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అటవీ ప్రాంత గ్రామ ప్రజలను అప్రమత్తం చేయాలని కోరుతూ అటవీశాఖ అధికారి గిరినాథ గ్రామ వాలంటీర్లకు సంక్షిప్త సమాచారాన్ని చేర వేశారు. కొంతమంది గ్రామస్థులు చరవాణుల్లో తీసిన ఏనుగుల చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ గా మారాయి. ఏనుగులు అటవీ ప్రాంతంలో సంచరిస్తుండటంతో చుట్టు ప్రక్కల గ్రామ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఏనుగులు కనిపించినట్లు ఉంటే వెంటనే సమాచారం ఇవ్వాలని గ్రామ ప్రజలకు అధికారులు విజ్ఞప్తి చేశారు.

పంట పొలాలు ధ్వంసం చేసిన ఏనుగుల గుంపు - అరటి తోట నేలమట్టం

Elephants Attack in Crop Fields at Tirupati: ఈ మధ్యనే తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని పంటపొలాలపై ఏనుగుల దాడులు చేశాయి. పది రోజులపాటు ఎల్లంపల్లి, భీమవరం, చిన్న రామాపురం, మానుగడ్డ ప్రాంతాలలోని పొలాలపై ఏనుగుల దాడులు అధికంగా పెరిగాయని రైతులు తెలిపారు. శేషాచలం అటవీ ప్రాంతం దగ్గరగా ఉండటం వల్ల రాత్రి సమయాల్లో వచ్చిన ఏనుగులు పంట నాశనం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. వరి పొలాలు, అరటి, కొబ్బరి వంటి చెట్లను పూర్తిగా నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులకు తెలియజేసిన ఏనుగులను పొలాల వైపు రాకుండా ఆపడం సాధ్యపడటం లేదంటున్నారు. ఏనుగుల బారి నుంచి తమ పొలాలను రక్షించాలని రైతులు కోరుతున్నారు.

జనావాసాల్లోకి ఏనుగులు రాకుండా ప్లాన్​- కొండల్లోనే గడ్డి పెంపకం, గజరాజులను కాపాడుతున్న ఎన్​జీఓ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.