ETV Bharat / state

తిరుమలలో సామాన్య భక్తులకు ప్రాధాన్యం - ఒక్కరోజులోనే శ్రీనివాసుడి దర్శనభాగ్యం - Tirumala Brahmotsavam 2024

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

Tirumala Brahmotsavam 2024 : దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలోని శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ కీలక చర్యలు చేపట్టింది. శ్రీవారి దర్శనాల్లో సామాన్య భక్తులకే ప్రాధాన్యమివ్వనున్నట్లుగా ఈవో శ్యామల రావు వెల్లడించారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఆర్జిత సేవలు, వీఐపీ సిఫార్సులపై బ్రేక్​ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

TIRUMALA BRAHMOTSAVAM 2024
TIRUMALA BRAHMOTSAVAM 2024 (ETV Bharat)

TTD EO On Tirumala Brahmotsavam 2024 : కలియుగ వైకుంఠంగా పేరొందిన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఒకే రోజు స్వామివారితో పాటు వాహనసేవల దర్శనభాగ్యం కల్పించేలా ఏర్పాట్లు చేశామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఆర్జిత సేవలతోపాటు వీఐపీ సిఫార్సులపై బ్రేక్‌ దర్శనాలను రద్దు చేసినట్లు ఆయన వెల్లడించారు.

శ్రీవారి దర్శనాల్లో సామాన్య భక్తులకే పెద్దపీట - ఒక్కరోజులోనే శ్రీనివాసుడి దర్శనభాగ్యం (ETV Bharat)

స్వయంగా వచ్చే వీఐపీలకే దర్శన అవకాశం ఉంటుందని టీటీడీ ఈవో వివరించారు. గరుడ సేవ జరిగే 8వ తేదీన దాన్నీ రద్దు చేస్తున్నట్లుగా వెల్లడించారు. శ్రీవారి దర్శనాలలో సామాన్యులకే ప్రాధాన్యమివ్వనున్నట్లు పునరుద్ఘాటించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై మంగళవారం ఆయన ‘ఈనాడు-ఈటీవీ భారత్​తో మాట్లాడారు.

'శ్రీవారి బ్రహ్మోత్సవాల రోజుల్లో ప్రత్యేక ప్రవేశ దర్శనాల కోసం 1.32 లక్షల టికెట్లను ఆన్‌లైన్​లో జారీ చేశాం. ఈ వ్యవధిలో సర్వదర్శనానికి వచ్చే వారికి తిరుపతిలో రోజుకు 24 వేల టోకెన్లను ఇవ్వనున్నాం. దీని వల్ల రోజుకు సుమారు 80 వేలు, గరుడ సేవనాడు లక్ష మంది దర్శించుకునేందుకు వీలుంటుంది. ఉదయం ఎనిమిదింటి నుంచి పది గంటల వరకు, సాయంత్రం 7గంటల నుంచి రాత్రి తొమ్మిదింటి వరకు జరిగే వాహన సేవలను తిలకించేందుకు ఏర్పాట్లు చేశాం"- శ్యామల రావు, టీటీడీ ఈవో

శ్రీవారి సేవకు "కోటి రూపాయల" టికెట్‌ - జీవితాంతం స్వామి సేవలో! - ప్రత్యేకతలు తెలుసా? - TTD Udayasthamana Seva Details

3.5 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా : 'గరుడ సేవ సాయంత్రం 6.30 నుంచి రాత్రి 11 గంటల వరకు జరుగుతుంది. ఈ వేడుకను రెండు లక్షల మంది ప్రత్యక్షంగా వీక్షించే విధంగా గ్యాలరీలను, వారికి అన్నప్రసాద వితరణ తదితర ఏర్పాట్లను చేస్తున్నాం. ఆ రోజు తిరుమల కొండపైకి 3.5 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేశాం. తిరుమలలో మొత్తంగా 6,200 గదులు అందుబాటులో ఉంటాయి.

ఆన్‌లైన్‌ కోటా తగ్గించి కరెంటు బుకింగ్‌ ద్వారానే గదులు అందిస్తాము. వీఐపీల కోసం 1300 గదులు అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా 40 వేల మంది భక్తులకు వసతి కల్పిస్తాం. ఇవే కాకుండా తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం, ఇతర వసతి గృహాలూ అందుబాటులో ఉంటాయి' అని శ్యామలరావు తెలిపారు.

శ్రీవారి సేవలో అనునిత్యం తరిస్తున్న పూలదండలు - వీటి పేర్లు, కొలతలు తెలుసా? - Lord Venkateswara Swamy garlands

వివిధ ప్రాంతాల్లో అన్నప్రసాద కేంద్రాలు : తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలోనే కాకుండా కొండపై పలు ప్రాంతాల్లో అన్నప్రసాద కేంద్రాలు అందుబాటులో ఉంచుతామని టీటీడీ ఈవో శ్యామలరావు వివరించారు. గరుడ సేవనాడు ఉదయం ఏడింటినుంచి రాత్రి ఒంటిగంట వరకు వెంగమాంబ అన్నదాన సత్రం అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. సాధారణ రోజుల్లో 3.5 లక్షల లడ్డూలను ఇస్తున్నామని తెలిపారు. ఉత్సవాల నేపథ్యంలో మరో ఏడు లక్షల నిల్వలు అందుబాటులో ఉంచుతామని శ్యామల రావు వెల్లడించారు. ప్రసాదాల పంపిణీకి మరో 11 కౌంటర్లు ఏర్పాటుచేస్తున్నామన్నారు. భద్రత దృష్ట్యా 12 ఏళ్లలోపు పిల్లలకు గుర్తించేందుకు వారికి ట్యాగ్‌ వేస్తున్నామని వివరించారు.

అందుబాటులో ఆర్టీసీ బస్సులు : తిరుపతిలో ఐదు ప్రాంతాల్లో పార్కింగ్‌ కేంద్రాల వద్ద ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచనున్నామన్నారు. ఆర్టీసీ బస్సులు రోజూ 2వేల ట్రిప్పులు, గరుడసేవ నాడు 3వేల ట్రిప్పులు నడుస్తాయని ఆయన వివరించారు. గరుడ సేవనాడు కనుమ దారుల్లో ద్విచక్రవాహనాల రాకపోకలను నిలిపేస్తామని స్పష్టం చేశారు. గతేడాది 12 రాష్ట్రాలనుంచి సాంస్కృతిక బృందాలు వస్తే ఈసారి 21 రాష్ట్రాలనుంచి 60 బృందాలు రానున్నాయని ఈవో వెల్లడించారు.

తిరుమలకు ముక్కోటి దేవతలు వస్తున్నారహో! వెంకన్న స్వామి 'గరుడ' వాహన సేవ ఎప్పుడంటే? - Tirumala Brahmotsavam 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.