TSRTC and SCR Record Revenue in Election : ఎన్నికల సమయంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లతో పాటు, సాధారణ రైళ్లకు అదనపు బోగీలను ఏర్పాటు చేశారు. మే 9 నుంచి 12 వ తేదీ వరకు జంటనగర పరిధిలోని సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, లింగంపల్లి తదితర రైల్వే స్టేషన్ల నుంచి వివిధ గమ్యస్థానాలకు సుమారు 4.3 లక్షల మంది జనరల్ భోగిలో ప్రయాణికులు ప్రయాణించారు. జంట నగరాల నుంచి ప్రతి రోజు జనరల్ కోచ్‌లలో సగటున 1.05 లక్షల మంది ప్రయాణించారు. రోజువారీ సగటున ప్రయాణించే 68,800 మంది అన్రిజర్వ్డ్ ప్రయాణికులతో పోలిస్తే 52 శాతం ఎక్కువ అని రైల్వే శాఖ వెల్లడించింది.
Special Trains During Election Time : దక్షిణ మధ్య రైల్వే ఎన్నికల సమయంలో భారీ రద్దీని దృష్టిలో ఉంచుకొని రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మే 9 నుంచి మే 15 వరకు అదనంగా 60 పైచిలుకు ప్రత్యేక రైళ్లను నడిపించారు. ఈ ప్రత్యేక రైళ్లు 100 శాతం కంటే ఎక్కువ ఆక్యుపెన్సీని నమోదు చేశాయి. జంటనగరాల నుంచి కాకినాడ, విశాఖపట్నం, నర్సాపూర్, నాగర్ సోల్, మచిలీపట్నం తదితర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడిపించారు.
SCR Special Trains Revenue : జంట నగరాల నుంచి ఖుర్దా రోడ్, బెర్హంపూర్, బెంగళూరు, సంబల్పూర్, దానాపూర్, గోరఖ్ పూర్, అగర్తలా, రక్సాల్, ఉదయపూర్, కటక్, సంత్రాగచ్చి, కొల్లాం, జైపూర్, రాజ్ కోట్ తదితర ప్రాంతాలకు కూడా ప్రత్యేక రైళ్లు నడిపించారు. ఈ సమయంలో వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణీకుల అదనపు రద్దీకి అనుగుణంగా ఏసీ-3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లతో కూడిన 41 అదనపు కోచ్‌లు, 40 రోజువారీ రైళ్లను అటాచ్ చేశారు.
TSRTC Earn 25 Crore During Election : ఎన్నికల సమయంలో టీఎస్ఆర్టీసి సుమారు 3,500 పైచిలుకు బస్సులను రెండు తెలుగు రాష్ట్రాలకు నడిపించింది. తెలంగాణ రాష్ట్రానికి 1,500 పైచిలుకు బస్సులు, ఆంధ్రపదేశ్‌కు సుమారు 1000కి పైగా బస్సులను నడిపించింది. జేబీఎస్, ఎంబీబీఎస్ వంటి ప్రధాన బస్టాండ్లతో పాటు ఎల్బీనగర్, ఉప్పల్, కూకట్ పల్లి, మియాపూర్, ఆరాంఘర్ తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడిపించారు. ఆర్టీసీకి 23 గంటల్లోనే భారీ ఎత్తున ఆదాయం సమకూరింది.
ప్రయాణికులకు TSRTC బంపరాఫర్ - రూ.20తో డీలక్స్ బస్సుల్లో ప్రయాణించవచ్చు! - TSRTC Latest Offer
ఆర్టీసీకి రూ.25 కోట్లు ఆదాయం : ఈ నెల 13వ తేదీన టీఎస్ఆర్టీసీ బస్సుల్లో 54 లక్షల మంది ప్రయాణించారు. తద్వారా సంస్థకి రూ.24.22 కోట్ల ఆదాయం సమకూరింది. 14వ తేదీన ఓటేసిన వారు 54 లక్షల మంది ప్రయాణించారు. టికెట్ కొనుగోలు చేసిన వారి ద్వారా ఆదాయం రూ.15 కోట్లు సమకూరినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇందులో ఆర్టీసి మహిళలకు మహాలక్ష్మి ఉచిత ప్రయాణంతో రూ.9 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం ఆర్టీసీకి రియంబర్స్మెంట్ ద్వారా చెల్లించాల్సి ఉంది.