Tribals Variety Protest for Road in Alluri District : దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నా గిరిజన పుత్రుల జీవితాల్లో మాత్రం ఇంకా వెలుగులు రావడం లేదు. యావత్తు ప్రపంచం ఆధునికతలో ముందుకు వెళ్తున్నా వారు మాత్రం ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండిపోయారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా అడవిపుత్రుల జీవితాల్లో మార్పు రావడం లేదు. అడవి తల్లిని నమ్ముకుని బ్రతికే వారికి కనీస మౌలిక సదుపాయాలు లేక నానా అవస్థలు పడుతున్నారు.
First Roads then Votes : అత్యవసర పరిస్థితిలో ఆస్పత్రికి వెళ్లాలంటే సరైన రోడ్డు సౌకర్యం ఉండదు. చిన్నపిల్లలు, వృద్ధులు, రోగులు, గర్బిణీలను ఆసుపత్రికి తీసుకువెళ్లాంటే సరైన రోడ్డు సదుపాయం లేకపోవడంతో తమ గ్రామాల్లోకి అంబులెన్సులు రావు. వారిని అంబులెన్సు వద్దకు చేర్చాలంటే డోలీ మోతలే వారికి దిక్కు. సమయానికి వైద్య సహాయం అందక ప్రాణాలు కోల్పొయిన గిరిజనులు చాలా మంది ఉన్నారు. వారి దయనీయ పరిస్థితి చూసి చలించలేని నాయకులు ఎవరూ లేరు. రోడ్డు సదుపాయం కల్పించి మా ప్రాణాలను కాపాడండి మహాప్రభో అంటూ గిరిజనులు వేడుకున్న అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు.
ఎన్నికలు వస్తే చాలు మీ కష్టాలను మేము చూశాము, మేము విన్నాము అంటూ వారిని నమ్మబలికి నాయకులు ఓట్లును అభ్యర్థిస్తారు. దీంతో మా కష్టాలు తెలిసిన నాయకుడు వస్తున్నారు అంటూ వారు ఆనంద వ్యక్తం చేస్తారు. తీరా చూస్తే నాయకులు అయిదు సంవత్సరాల కాలం కరిగిపోయినా వారికి మాత్రం రోడ్డు కాదు కదా. కనీసం వారు ఉన్నారన్న విషయం కూడా పట్టించుకోరు. వారి సమస్యలు మాత్రం అలాగే ఉంటాయి.
రోడ్డు లేని కారణంగా నిలిచిన అంబులెన్స్ - మధ్యలోనే గర్భిణీ ప్రసవం - WOMAN DELIVERY ON ROAD
Tribal People Protest for Road : ఈ సారి జరగపోయే ఎన్నికల్లో ఏ నాయకుడు మాటలు నమ్ముడానికి తాము సిద్ధంగా లేరని చెప్పడానికి అడవుల గుండా గుర్రాలపై ప్రయాణిస్తూ గిరిజనులు నిరసన తెలిపారు. కొండ శిఖర గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పిస్తేనే ఓట్లు వేయడానికి వస్తామని అల్లూరి జిల్లా జీనబాడు పంచాయతీ పరిధిలోని గిరిజనులు సృష్టం చేశారు. నెత్తిపై అడ్డాకులు పెట్టుకుని గుర్రాలతో సుమారుగా నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణించి నిరసన చేపట్టారు. ఆదివాసీల కోసం కోట్ల నిధులు ఖర్చు చేశామని అధికారులు లెక్కలు చూపిస్తున్నారే కానీ అభివృద్ధి పనులు మాత్రం క్షేత్రస్థాయిలో జరగలేదని ఆరోపించారు. జీనబాడు గ్రామ పంచాయతీ పరిధిలో పీవీటీజీ (PVTG) తెగకు చెందిన 170 మంది జీవిస్తున్నారని గిరిజనులు తెలియజేశారు. వీరిలో 70 మందికి ఓట్లు ఉన్నాయని పేర్కొన్నారు. వీరు ఓటు వేయాలంటే సుమారుగా 30 కిలోమీటర్లు దూరం ప్రయాణించాలని చెప్పారు. ఎటువంటి రహదారి సౌకర్యం లేకపోవడంతో గుర్రాలపై వెళ్లాల్సి వస్తుందన్నారు. అధికారులు చర్యలు తీసుకుని ఆయా గ్రామాలకు రహదారుల నిర్మాణం చేపట్టాలని కోరారు.
అనకాపల్లిలో ఎస్టీ కమిషన్కు నిరసన సెగ - డోలి మోతలతో స్వాగతం పలికిన గిరిజనులు
గిరిజన గ్రామాలకు లేని రహదారి సౌకర్యం - సకాలంలో వైద్యం అందక మృత్యు ఘోష