Tretheswara Swamy Temple Devotees flock in Annamayya District : రాష్ట్ర వ్యాప్తంగా శైవక్షేత్రాలు భక్తుల శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. తెల్లవారు జాము నుంచే భక్తులు బారులు తీయడంతో ఉదయం 10 గంటలు అయ్యే సరికి ఆలయంలో భక్తుల రద్దీ మరింత ఎక్కువ మారింది. భక్త జనాన్ని అంచనా వేయలేని అధికారులు వారికి కనీస అవసరాలు కూడా కల్పించిక లేకపోయారు. ఇలాంటి సంఘటనే అన్నమయ్యా జిల్లాలో చోటు చోసుకుంది.
భక్తులతో కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు - తెల్లవారుజాము నుంచే బారులు తీరిన ప్రజలు
Rajampet : అన్నమయ్య జిల్లాలోని రాజంపేట మండలంలోని హత్యరాలలో కొలువైన త్రేతేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. అక్కడ పుణ్యస్నానాలు ఆచరించి స్వామి దర్శనానికి బయలుదేరారు. ప్రత్యేక దర్శనం టికెట్ అయితే స్వామి వారి దర్శనం తొందరంగా భావించి రూ. వంద పెట్టి మరీ వెళ్లారు. తీరా చూస్తే ఒకవైపు భక్తుల రద్దీ పెరిగిపోవడం, మరోవైపు స్థానికంగా పలుకుబడి ఉన్నవారు స్వామి వారి దర్శనం కోసం పోటెత్తారు. దీంతో ఆలయ అధికారులు సామాన్య జనాన్ని పక్కన పెట్టి ప్రముఖులకు దర్శనం సౌకర్యాన్ని కల్పించారు. ప్రత్యేక దర్శనానికి రూ. వంద వసూలు చేసిన ఆలయ అధికారులు వారిని కూడా సాధారణ క్యూలైన్ లోకే పంపించారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 నిమిషాల్లో దర్శనం అవుతుందని చెప్పిన అధికారులు రెండు గంటలు అయినా దర్శనానికి పంపించలేదని వారితో వాగ్వాదానికి దిగారు.
శ్రీనివాసుడిని దర్శించుకున్న మాజీ క్రికెటర్ - వేద పండితుల ఆశీర్వచనం
క్యూలైన్లో గంటల తరబడి వేచి ఉన్న వారికి కనీసం మంచినీరు కూడా ఇవ్వట్లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటల తరబడి ఎండలో నిలుచున్నామని కనీసం షామియా కూడా ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. స్వామి వారి దర్శనానికి చిన్న పిల్లలతో వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడ్డామని పేర్కొన్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు క్యూలైన్లోనే స్పృహతప్పి పడిపోయారని పేర్కొన్నారు. దీనిపై కొందరు భక్తులు అధికారులు వ్యవహరిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ వారితో వాగ్వాదానికి దిగారు. పోలీసులు అధికారులకు వత్తాసు పలకడంతో భక్తులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల వ్యవహరించిన తీరు వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డామని పేర్కొన్నారు.