Road Accidents in Andhra Pradesh : బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బాపట్ల నుంచి కనిగిరి వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి పందిళ్లపల్లి నుంచి చీరాల వెళ్తున్న కారును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.
నెల్లూరు జిల్లా దుత్తలూరు సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా C.S. పురం మండలం ఉప్పలపాడు, పామూరుకు చెందిన కొంతమంది తిరుమలకు వెళ్లి వస్తుండగా వారి వాహనం పాల వ్యానుని ఢీకొని ప్రమాదం జరిగింది.
కర్నూలు జిల్లా కోడమూరు వద్ద ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. మృతులను హైదరాబాద్‌కి చెందిన లక్ష్మి, గోవర్ధనిగా గుర్తించారు. బస్సు హైదరాబాద్ నుంచి ఆదోని వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసిన పోలీసులు చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బస్సు ఆదోనికి చెందిన బిస్మిల్లా ట్రావెల్స్‌కు చెందినిదిగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ పరారైనట్లు ప్రయాణికులు తెలిపారు.
తెలంగాణలోని నల్లొండ జిల్లా తిప్పర్తిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రకాశం జిల్లా కారంచేడుకు చెందిన ఓ మహిళ మృతి చెందారు. హైదరాబాద్‌లో నివాసముంటున్న సుబ్రమణ్యం కుటుంబంతో కలిసి తిరుమలకు వెళ్లి వస్తుండగా కారు డివైడర్‌ని ఢీకొంది. సుబ్రమణ్యం భార్య చనిపోగా అతని పరిస్థితి విషమంగా ఉంది. ఇద్దరు పిల్లలు, డ్రైవర్‌కి స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి- పదుల సంఖ్యలో క్షతగాత్రులు` - ROAD ACCIDENTS
Road Accident in Visakha : విశాఖలోని ఎన్డీఏ (NDA) పైవంతనపై లారీ బోల్తా పడింది. ఒడిశా నుంచి గాజువాకలోని ఆటోనగర్‌కు పేపర్ లోడ్ కి వెళ్తున్న లారీ పైవంతన మీదకు వచ్చే సరికి అదుపుతప్పి బోల్తా కొట్టింది. అప్రమత్తతో లారీ డ్రైవర్ ముందే బయటకు దూకేయటంతో స్వల్పగాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. నిత్యం ఇటుగా ప్రమాదాలు జరుగుతుంటాయని, పోలీసుల గస్తీ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.