ETV Bharat / state

షుగర్, గుండె పోటు, ఊబకాయం - కారణాలు ఇవే! - Trans Fats Foods List

Trans Fats Food Health Effects : చాలా మంది నోటికి రుచిగా ఉందని బయట దొరికే చాలా రకాల ఆహార పదార్థాలను లొట్టలేసుకుంటూ తింటున్నారు. మీరు కూడా ఇలా బయట ఫుడ్​ ఎక్కువగా తింటున్నారా? అయితే, అలర్ట్​గా ఉండాల్సిందేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుండె జబ్బులు, షుగర్, ఊబకాయం​ రావడానికి ఆ తిండే కారణం అంటున్నారు! మరి.. ఆరోగ్యాన్ని అంతగా పాడుచేసే ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

trans_fats_foods_list
trans_fats_foods_list (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 15, 2024, 5:56 PM IST

Trans Fats Heart Health Effects : మనం ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా మనం తీసుకునే ఆహారం బాగుండాలి. మనకు హాని చేసే ఆహారం తీసుకుంటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అయితే.. ప్రస్తుత కాలంలో మనం తెలిసో తెలియకో తీసుకునే కొన్ని ఆహార పదార్థాలలో ట్రాన్స్​ ఫ్యాట్స్​ అధికంగా ఉంటున్నాయి. వీటిని తినడం వల్ల మనకు గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం వంటి అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ట్రాన్స్​ఫ్యాట్స్​ ఉండే ఆహార పదార్థాలు ఏంటో మీకు తెలుసా ? ఇప్పుడు చూద్దాం.

మనం తినే జంక్​ఫుడ్​లో ట్రాన్స్​ ఫ్యాట్స్​ (National library of medicine రీపోర్ట్​) అధికంగా ఉంటాయి. ట్రాన్స్​ ఫ్యాట్స్​ అనేవి వంట నూనెలను బాగా వేడి చేయడం ద్వారా ఏర్పడతాయి. సాధారణంగా ఫ్యాట్స్ రెండు రకాలు. శాచురేటెడ్, అన్​శాచురేటెడ్​. ఈ ట్రాన్స్​ఫ్యాట్స్​ అన్​శాచురేటెడ్​ కిందకు వస్తాయి. వంట నూనెలను హైడ్రోజనీకరణం చేసినప్పుడు ట్రాన్స్​ ఫ్యాట్స్​ ఏర్పడతాయి.

  • మనం తినే ఫ్రెంచ్​ఫ్రైస్​, చిప్స్, బర్గర్లు, పిజ్జాలు, కుకీలు, మంచూరియా, బిస్కెట్లలలో ట్రాన్స్​ ఫ్యాట్స్​ అధికంగా ఉంటాయి.
  • ఇంకా మైదాతో చేసే పఫ్​లు, డోనట్స్​ వంటి చాలా రకాల పదార్థాలలో ట్రాన్స్ ​ఫ్యాట్స్​ ఉంటాయి.
  • అలాగే కేకులు, బేకరీ ఐటమ్స్​, చాక్లెట్లు, ఐస్​క్రీమ్​, రెడీ టు ఈట్​ ఆహార పదార్థాల్లో ట్రాన్స్​ ఫ్యాట్స్​ ఉంటాయి.
  • అయితే.. మన రోజువారీ ఆహారంలో ఇవి సున్న శాతం ఉండాలని నిపుణులు చెబుతున్నారు. కానీ, చాలా మంది పైన తెలిపిన ఆహార పదార్థాలు నోటికి రుచిగా ఉంటాయని ఎక్కువగా తింటుంటారు.
  • కానీ, వీటి ఫలితంగా చిన్నవయసులోనే గుండె జబ్బులు, మధుమేహం, అధిక బరువు వంటి అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
  • ట్రాన్స్​ ఫ్యాట్స్​ వల్ల మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ (hdl)​ తగ్గిపోతుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్​ (ldl) పెరిగిపోతుంది.

2015లో "న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్" (NEJM) జర్నల్లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. ట్రాన్స్​ ఫ్యాట్ తీసుకోవడం గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధనలో హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో ప్రొఫెసర్‌ 'డాక్టర్​ దరియుష్ మొజాఫరియన్' పాల్గొన్నారు.

తారుమారైన పరిస్థితి - పాల సేకరణ నిలిపివేసిన అమూల్​ - Amul Milk Collection in AP

ఇలా చేయండి :

  • వీలైనంత వరకు తీపి పదార్థాలకు దూరంగా ఉండండి.
  • అలాగే నూనెలో వేయించిన పదార్థాలను తినడం తగ్గించండి.
  • ప్యాకేజ్డ్​​ ఆహార పదార్థాలను తీసుకునేటప్పుడు దాని వెనక ఉన్న లేబుల్​ని చదవాలి.
  • క్యాలరీలు, ఉప్పు, కొవ్వు శాతం ఎంత ఉన్నాయో చూసుకోవాలి. వీలైతే వాటికి బదులుగా వేరే ఆహార పదార్థాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇవి కూడా చదవండి :

గుడ్​న్యూస్ - ఇక చేరువలోనే రేషన్ షాప్ - కొత్తగా 4 వేల దుకాణాలు - New Ration Shops in AP

శ్రావణ మాసం ఎఫెక్ట్​ - భారీగా తగ్గిన చికెన్​ ధరలు - Chicken Rates Down

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.