Trains Cancelled and Rescheduled: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో 3వ రైల్వే లైన్ ఇంటర్ లాకింగ్ పనుల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు పలు రైళ్లను కొద్ది రోజులపాటు రద్దు చేశారు. అదే విధంగా కొన్నింటిని దారి మళ్లించినట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఖమ్మం రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లే శాతవాహన, గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌తోపాటు విజయవాడ-భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్, విజయవాడ-డోర్నకల్ ప్యాసింజర్ ట్రైన్స్‌ను ఆగస్టు 5 నుంచి 10వ తేదీ వరకు పూర్తిగా రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
పలు ట్రైన్స్‌ను ఖమ్మం రాకుండా వయా తెనాలి, గుంటూరు, పగిడిపల్లి రైల్వే స్టేషన్ల మీదుగా దారి మళ్లించినట్లు తెలిపారు. ఆగస్టు 2వ తేదీ నుంచి పలు తేదీల్లో చార్మినార్, పద్మావతి, సింహపురి, కృష్ణ ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్ ఖమ్మం రైల్వే స్టేషన్‌కు మీదుగా రాకపోకలు సాగించవని అన్నారు.
రద్దైన రైళ్ల వివరాలు: విజయవాడ - భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ (07979), భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్- విజయవాడ (07278), విజయవాడ - డోర్నకల్ (07756), డోర్నకల్ - విజయవాడ (07755), విజయవాడ - సికింద్రాబాద్(శాతవాహన) (12713), సికింద్రాబాద్ - విజయవాడ(శాతవాహన) (12714), గుంటూరు - సికింద్రాబాద్(గోల్కొండ) (17201), సికింద్రాబాద్ - గుంటూరు(గోల్కొండ) (17202) రైళ్లను ఆగస్టు 5నుంచి 10 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
దారి మళ్లించిన రైళ్ల వివరాలు: హైదరాబాద్-తాంబారం (చార్మినార్) (12760) ఆగస్టు 2 నుంచి 10వ తేదీ వరకు, సికింద్రాబాద్- తిరుపతి (పద్మావతి) (12764) ఆగస్టు 2, 3, 4, 5, 6, 8, 9 తేదీలలో, సికింద్రాబాద్-గూడూరు (సింహపురి) (12710) ఆగస్టు 2 నుంచి 10వ తేదీ వరకు, ఆదిలాబాద్ తిరుపతి(కృష్ణ) (17406) ఆగస్టు 2 నుంచి 10వ తేదీ వరకు, తాంబరం- హైదరాబాద్ (చార్మినార్) (12759) ఆగస్టు 2 నుంచి 10వ తేదీ వరకు, తిరుపతి-సికింద్రాబాద్ (పద్మావతి) (12763) ఆగస్టు 3, 4, 5, 6, 7, 9, 10వ తేదీలలో, గూడూరు-సికింద్రాబాద్ (సింహపురి) (12709) ఆగస్టు 3 నుంచి 9వ తేదీ వరకు, తిరుపతి-ఆదిలాబాద్(కృష్ణ) (17405) ఆగస్టు 3 నుంచి 9వ తేదీ వరకు దారి మళ్లించినట్లు తెలిపారు.
రైల్వే ప్రయాణికులకు శుభవార్త - ఈ రైళ్లకు అదనపు బోగీలు - extra general coaches in trains
పలు రైళ్ల రీ షెడ్యూల్: ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్లు బయలుదేరే సమయాలను రీ షెడ్యూల్ చేయడంతో పాటు, కొన్నింటి గమ్య స్థానాలను కుదించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. భువనేశ్వర్-చెన్నై సెంట్రల్ (12830) ఎక్స్‌ప్రెస్ ఆగస్టు 1వ తేదీన మధ్యాహ్నం 12.10 గంటలకు బదులు 1.10 గంటలకు, పూరీ-గాంధీధామ్ (22974) ఎక్స్‌ప్రెస్ ఆగస్టు 3వ తేదీ ఉదయం 11.15 గంటలకు బదులు మధ్యాహ్నం 12.45కి బయలుదేరుతుంది. భువనేశ్వర్- తిరుపతి (22879) ఎక్స్‌ప్రెస్ ఆగస్టు 3వ తేదీన మధ్యాహ్నం 12.10 గంటలకు బదులు 1.10 గంటలకు బయలుదేరేలా మార్పు చేశారు. విశాఖ-పలాస (07470) మెము ఈనెల 29వ తేదీతో పాటు, ఆగస్టు 1, 3వ తేదీల్లో శ్రీకాకుళం రోడ్ వరకే నడుస్తుంది. మళ్లీ అక్కడి నుంచే విశాఖ వస్తుంది.
బీ అలర్ట్ - ఈ రైళ్ల టైమింగ్స్ మారాయి తెలుసా ! - trains timings changed