Tollywood Heroes Diwali Celebrations : కుటుంబమంతా ఓ చోట కలిస్తే పండగ వాతావరణం నెలకొంటుంది. ఎన్నో సంతోషాన్ని ఇస్తుంది. అటువంటిది పండగకి ఫ్యామిలీ అంతా ఒక్కచోట చేరితే, ఆ ఆనందమే వేరు. షూటింగ్స్, ప్రమోషన్స్ అంటూ నిత్యం బిజీ బిజీగా గడిపే మన టాలీవుడ్ హీరోలు దీపావళిని కుటుంబంతో సరదాగా జరుపుకొన్నారు.
టాలీవుడ్ స్టార్ హీరోలు తమ కుటుంబంతో కలిసి దీపావళి పండగను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఆనందకర క్షణాలను కెమెరాల్లో బంధించి, సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకుంటూ పండగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్‌గా మారాయి. తన భార్య ప్రణతి, కుమారులతో కలిసి దిగిన ఫొటోను ఎన్టీఆర్ షేర్ చేశారు.

ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీకి టైం కేటాయించే ఎన్టీఆర్, ఈ దీపావళిని కూడా సరదాగా చేసుకున్నారు. దీపావళి పండగని ఇంట్లో ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేశారు. ఈ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.

మెగా హీరో వరుణ్‌తేజ్ దీపావళిని తన కుటుంబంతో సరదాగా జరుపుకున్నారు. ఈ ఫొటోలను సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ ఫొటోలో వరుణ్ తేజ్‌తో పాటు తన భార్య లావణ్య త్రిపాఠి, తండ్రి నాగబాబు, సోదరి కొణిదెల నిహారిక, తల్లి కొణిదెల పద్మజ ఉన్నారు. మరోవైపు వరుణ్ తేజ్ త్వరలోనే మట్కా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మూవీ నవంబర్ 14న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ తెగ ఆకట్టుకుంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు.

'కంగువ' చిత్రానికి జోరుగా, ప్రచారం చేస్తున్న సూర్య, మరోవైపు దీపావళిని కూడా అంతే హుషారుగా ఫ్యామిలీతో జరుపుకున్నారు.
Happy Diwali my lovessss ❤️❤️❤️
— Vijay Deverakonda (@TheDeverakonda) October 31, 2024
Sending you all bigg hugs and my love. pic.twitter.com/ZR7jl2hE0y
తన సోదరుడు, నటుడు ఆనంద్‌తో కలిసి హీరో విజయ్ దేవరకొండ టపాసులు పేల్చారు. తల్లిదండ్రులతో కలిసి దిగిన ఫొటోలను విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

అదే విధంగా యువ కథానాయకుడు విశ్వక్ సేన్ ప్రతి పండక్కి ఫ్యామిలీతోనే ఉంటారు. ఆయన ఫోటోలు సైతం సామాజిక మాధ్యమంలో షేర్ చేశారు.