ETV Bharat / state

జోరుగా గంగమ్మ జాతర- పొరుగు రాష్ట్రాల నుంచి పోటెత్తిన భక్తులు - TIRUPATI GANGAMMA JATARA - TIRUPATI GANGAMMA JATARA

Tirupati Gangamma Jatara 2024 : చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో అమ్మవారి శిరస్సు ఊరేగింపును ఇవాళ ఘనంగా నిర్వహించారు. పురవీధుల్లో ఊరేగిన అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. కుప్పం పరిసర ప్రాంతాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దు గ్రామాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

Tirupati Gangamma Jatara 2024
Tirupati Gangamma Jatara 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 21, 2024, 12:59 PM IST

Tirupati Gangamma Jatara 2024 : పలమనేరులో నిన్న రాత్రి శ్రీ తిరుపతి గంగమ్మ శిరస్సు కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఆనవాయితీ ప్రకారం రజక కులస్థుల ఆధ్వర్యంలో పట్టణ పుర వీధుల్లో అమ్మ వారి శిరస్సును ఊరేగించారు. శిరస్సు కార్యక్రమానికి పట్టణ ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా పెద్ద ఎత్తున వేలాది సంఖ్యలో పాల్గొని అమ్మ వారి కృపకు పాత్రులయ్యారు. నేడు అమ్మవారి విశ్వరూప దర్శనం ఉంటుందని ఆలయ ఈవో కమలాకర్ తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు.

వైభవంగా తిరుపతి గంగమ్మ జాతర- భక్తులంతా బైరాగి వేషంలో అమ్మవారికి పూజలు - Tataiahgunta Gangamma Jatara

జాతర సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పిల్లలని ఆకర్షించడానికి పలు ఏర్పాట్లూ చేశారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణ సిఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నేడు, రేపు అత్యంత వైభవంగా పట్టణ ప్రజలు గంగమ్మ జాతర నిర్వగహించనున్నారు. రేపు (బుదవారం) జరగబోయే జలదీ కార్యక్రమంతో జాతర ముగియనుంది.

చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో అమ్మవారి శిరస్సు ఊరేగింపును ఇవాళ ఘనంగా నిర్వహించారు.
పురవీధుల్లో ఊరేగిన అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. కుప్పం పరిసర ప్రాంతాలతో పాటు కర్ణాటక తమిళనాడు సరిహద్దు గ్రామాల నుంచి భక్తులు వేలా అధిక తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ప్రసన్న తిరుపతి గంగమాంబ ముత్తు మారెమ్మ అగ్నిగుండ ప్రవేశం కార్యక్రమాన్ని కోలాహలంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించారు.

వైభవంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర - GANGAMMA JATARA CELEBRATIONS

జోరుగా సాగుతున్న గంగమ్మ జాతర- పొరుగు రాష్ట్రాలనుంచి పోటెత్తిన భక్తులు (ETV Bharat)

తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది. ఉదయం అమ్మవారికి అర్చకులు ఘనంగా అభిషేకం నిర్వహించారు. జాతరను పురస్కరించుకుని భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. పసుపు, కుంకుమలతో సారె తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తున్నారు. పొంగళ్లు, అంబలి పెట్టుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బుధవారం ఉదయం అమ్మవారి విశ్వరూప దర్శనంతో జాతర ముగియనుంది.

తిరుపతి తాతయ్యగుంట జాతర గురించి రాయలసీమ వాసులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాయలసీమ సంస్కృతి, సంప్రదాయాలకు తార్కాణంగా చెప్పుకొనే జాతరను అనాదిగా ఆలయ ఆచార వ్యవహారాల ప్రకారం సంప్రదాయబద్ధంగా నిర్వహించడం ఆనవాయితీ.

రాజంపేటలో ఘనంగా జరిగిన గంగమ్మ తల్లి జాతర - భారీగా తరలి వచ్చిన భక్తులు - Sri Gangamma Thalli Jatara

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.