ETV Bharat / state

శ్రీవారి భక్తులకు శుభవార్త - వార్షిక బ్రహ్మోత్సవాల తేదీలు ప్రకటించిన టీటీడీ - TTD Announced Brahmotsavam Dates - TTD ANNOUNCED BRAHMOTSAVAM DATES

Tirumala Brahmotsavam Will be held from October 4 to 12 : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబరు 4 నుంచి 12 వరకు జరగనున్నాయి. అక్టోబరు 4న ధ్వజారోహణంతో ప్రారంభం కానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు అదే నెల 12న చక్రస్నానంతో ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాలు సందర్భంగా ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఈ మేరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై టీటీడీ దృష్టి సారించింది.

TIRUMALA BRAMOTSAVAM 2024 DATES
Tirumala Brahmotsavam will be held from October 4 to 12 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 3, 2024, 10:56 PM IST

Tirumala Brahmotsavam will be held from October 4 to 12 : కలియుగ వైకుంఠుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారైంది. అక్టోబరు 4న ధ్వజారోహణంతో ప్రారంభం కానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు అదే నెల 12న చక్రస్నానంతో ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాలు సందర్భంగా ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఈ మేరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై టీటీడీ దృష్టి సారించింది. బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లకు సన్నద్దం అయ్యింది.

అత్యంత వైభవంగా : శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు రెండు నెలల సమయం ఉన్నందున అత్యంత వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని టీటీడీ అదనపు ఈవో సీహెచ్‌ వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అన్నమయ్య భవన్‌లో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఇంజినీరింగ్‌ పనులు, వాహనాల ఫిట్‌నెస్‌, లడ్డూల బఫర్‌ స్టాక్‌, అన్నప్రసాదం, దర్శనం, వసతి, కళా బృందాల కార్యక్రమాలు, ఉద్యానశాఖ, ట్రాన్స్‌పోర్ట్‌, కల్యాణ కట్ట, గోశాల, శ్రీవారి సేవకులు, విజిలెన్స్‌ విభాగం భద్రతా ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.

ఆ సమయంలో ప్రత్యేక దర్శనాలు రద్దు : బ్రహ్మోత్సవాల్లో భాగంగా, అక్టోబరు 4న ధ్వజారోహణం, 8న గరుడ సేవ, 9న స్వర్ణరథం, 11న రథోత్సవం, 12న చక్రస్నానం నిర్వహిస్తారు. వాహన సేవలు ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు, సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతాయి. సాధారణంగా గరుడ సేవ రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అక్టోబరు 7న రాత్రి 11 గంటల నుంచి అక్టోబరు 8 అర్ధరాత్రి వరకు ద్విచక్రవాహనాల రాకపోకలపై నిషేధం అమలు కానుంది. వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో వయోవృద్ధులు, వికలాంగులు, ఎన్‌ఆర్‌ఐలు, చిన్న పిల్లల తల్లిదండ్రులతో సహా అన్ని ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేయనుంది.

టీటీడీ కీలక నిర్ణయాలు : తిరుమల శ్రీవారిని సామాన్య భక్తులకు చేరువచేసే లక్ష్యంతో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకొంటోంది. నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో పలు మార్పులు చేపట్టిన టీటీడీ సర్వదర్శన టోకెన్ల సంఖ్య భారీగా పెంచుతోంది. గడచిన ఐదేళ్లలో బ్రేక్‌దర్శనాలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలకు ప్రాధాన్యత కల్పిస్తూ సర్వదర్శనానికి వచ్చే భక్తులను నిర్లక్ష్యం చేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పిస్తూ చర్యలు చేపట్టింది. భక్తులకు మెరుగైన వసతులు కల్పించడంతో పాటు సర్వదర్శన టికెట్లను భారీగా పెంచారు.

శ్రీవారి భక్తులకు గుడ్​న్యూస్ - సర్వదర్శనం టోకెన్లు భారీగా పెంచిన టీటీడీ - TTD Increased sarva darshan

తిరుమల భక్తులకు అలర్ట్ : శ్రీవారి పుష్కరిణి మూసివేత - ఎప్పుడు, ఎందుకో తెలుసా? - Alert To Tirumala Devotees

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.