ETV Bharat / state

"మీకు సూపర్ జాబ్ ఆఫర్.. కళ్లు చెదిరే జీతం.. పైగా వర్క్ ఫ్రమ్​ హోమ్​"

పెచ్చరిల్లుతున్న ఫేక్‌ జాబ్‌ నోటిఫికేషన్స్‌ - జాగ్రత్తగా ఉండకపోతే అంతే సంగతులు - మోసగాళ్లను ఇలా గుర్తించండి

Tips In Telugu How To Spot Fake Job Notification
Tips In Telugu How To Spot Fake Job Notification (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

How To Spot Fake Job Offers Tips In Telugu : వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌, ఆన్‌లైన్‌ వర్క్‌ కల్చర్‌ రోజురోజుకూ పెరుగుతుండటంతో దాన్నే ఆసరాగా చేసుకుని మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. నకిలీ ఉద్యోగాలతో నిరుద్యోగులు, అమాయకులను టార్గెట్‌ చేసుకుని వారికి ఉద్యోగం ఆశ చూపి జేబులను గుల్లచేస్తున్నారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంకు ఖాతాల వివరాలను సైతం సేకరించి అందినకాడికి దోచుకుంటున్నారు. ఇలాంటి నకిలీరాయుళ్ల రంగు తెలియక యువత వారి ఉచ్చులో పడి బలైపోతున్న ఉదంతాలు అనేకం. ఈ నేపథ్యంలో ఫేక్‌ జాబ్‌ ఆఫర్లను గుర్తించడం ఎలా? వాటి బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఈ స్టోరీలో తెలుసుకుందాం.

  • 'సార్‌.. ఫలానా కంపెనీలో వర్క్‌ ఫ్రమ్ హోమ్‌ జాబ్‌ ఉంది. దానికి రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద కొంత మొత్తం కడితే చాలు. డేటా ఎంట్రీ ఉద్యోగం ఉందండీ.. కాకపోతే కన్సల్టెన్సీకి కొంత డబ్బు చెల్లించాలి అంతే. జాబ్‌ మీదే. సంవత్సరానికి రూ.10 లక్షల ప్యాకేజీ, మీ బ్యాంకు ఖాతా వివరాలు కొంచెం చెప్పండి' అంటూ కాల్స్‌ వస్తుంటాయి. అలా వస్తే వాటిని కచ్చితంగా సందేహించాల్సిందే. నకిలీ ఉద్యోగాల బెడద రోజురోజుకూ పెరిగిపోతున్న తరుణంలో ఇలాంటివి వస్తే జాగ్రత్త పడాల్సిందే. లేకపోతే మోసపోయే అవకాశం ఎక్కువ.
  • ఏదైనా ఉద్యోగానికి మీరు దరఖాస్తు చేయకుండానే మిమ్మల్ని ఎవరైనా మీకు జాబ్‌ ఇస్తామని చెప్తే అలాంటి వారు చెప్పేవి గుడ్డిగా నమ్మకూడదు. మీరు అప్లై చేయకుండా ఉద్యోగం ఆఫర్ వచ్చినట్లు కాల్ చేస్తే, అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండటం శ్రేయస్కరం.
  • కొందరు ఇంటర్వ్యూ లేకుండానే డైరెక్ట్‌గా జాబ్‌ ఇస్తామని కాల్‌ చేస్తుంటారు. కంపెనీలు ఏవైనా ఉద్యోగుల ఎంపిక ప్రక్రియలో దరఖాస్తు, ఇంటర్వ్యూ అనేవి తప్పకుండా ఉంటాయి. అందువల్ల ఇంటర్వ్యూ కూడా లేకుండా మీకు జాబ్‌ ఆఫర్‌ చేస్తామంటే తొందరపడొద్దు. మీ ఆధార్‌, పాన్‌ నంబర్లు, అడ్రస్‌, మెయిల్‌ ఐడీ వంటివి ఇచ్చేటప్పుడు ఎదుటి వ్యక్తులు కాల్ చేసింది కంపెనీ నుంచేనా అని చెక్‌ చేసుకోవాలి. ఎటువంటి రుసుమూ చెల్లించొద్దు. ఏమాత్రం అనుమానం వచ్చినా సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయాలి.
  • జాబ్‌ ఆఫర్‌ చేస్తూ వచ్చే ఈ-మెయిల్‌ను తరచూ చెక్‌ చేసుకుంటూ ఉండాలి. అది ఏ అడ్రస్‌ నుంచి వచ్చిందో చూడండి. ఆ కంపెనీ గురించి వివరాలను గూగుల్‌లో చెక్‌ చేయాలి. ప్రొఫెషనల్‌ కంపెనీలు ఏవైనా అఫిషియల్‌ డొమైన్‌ పేర్లను ఉపయోగిస్తుంటాయి ఈ అంశాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి.
  • ఏ కంపెనీలో జాబ్‌ ఆఫర్‌ అని చెబుతున్నారో ఆ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను శోధించండి. అందులో నిజంగా నియామకాలు జరుగుతున్నాయో, లేదో తెలుసుకోండి. ఇలాంటి వాటిపట్ల అప్రమత్తతో ఉండటం మంచిది.

విదేశాల్లో ఈజీ జాబ్, లక్షల్లో జీతమంటూ కేటుగాళ్ల బురిడీ - నమ్మారో అంతే సంగతులు - Foreign Job Scams in Telangana

  • ఉద్యోగం కోసం డబ్బులు అడుగుతున్నారంటే అనుమానించాల్సిందే. మోసగాళ్లు ఉద్యోగం కోసం లేదా ఆ ఉద్యోగ నియామక ప్రక్రియ ఖర్చుల కోసం డబ్బులు అడుగుతుంటారు. సక్రమమైన పద్ధతుల్లో నడిచే కంపెనీలేవీ ఉద్యోగాల భర్తీ కోసం అభ్యర్థుల నుంచి డబ్బులు తీసుకోవు. కొందరైతే ప్రభుత్వ రంగ సంస్థల్లో బ్యాక్‌ డోర్‌ అంటూ మోసం చేస్తుంటారు. ఇలాంటివి పట్టణాలు, పల్లెల్లో ఎక్కువగా జరుగుతుంటాయి.
  • సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఉద్యోగ ప్రకటనలను అంత ఈజీగా నమ్మొద్దు. మనకు తెలిసిన వారు షేర్‌ చేసినా సరే ఒకటికి పదిసార్లు చెక్‌ చేసుకున్నాకే ముందడుగు వేయాలి. ఒక్కోసారి వేలకు వేల ఉద్యోగాలంటూ ఆన్‌లైన్‌లో పోస్టులు, వీడియోలు తారసపడుతుంటాయి. అలాంటి వాటికి స్పందించే ముందు నిజంగా అంత భారీ రిక్రూట్‌మెంట్ జరిగితే ప్రధాన మీడియా సంస్థలు వార్తలు ప్రచురించకుండా ఉండవు కాబట్టి, అన్ని ఆలోచించి నిర్ధారించుకొనే ప్రయత్నం చేయాలి.
  • ఎక్కడ చూసినా డేటా ఎంట్రీ జాబ్‌లు కనిపిస్తుంటాయి. ఇదో పెద్ద స్కామ్. ముందుగా కొంత మొత్తాన్ని డిపాజిట్‌ కట్టమంటారు. 'మీరు జాబ్‌ పట్ల సీరియస్‌గా ఉన్నారా? లేదా అన్నది తెలుసుకోవడానికి' అంటూ నమ్మిస్తారు. తర్వాత ఏదో పని ఇచ్చి చేసిన పనికి వంకలు చూపించి, డిపాజిట్‌ డబ్బులు తిరిగి ఇవ్వరు. తర్వాత ఇంకేవో కారణాలు చూపించి తిరిగి డబ్బులు వసూలు చేస్తారు. మన దేశంలో అత్యధిక మంది మోసపోతుంది ఇందులోనే.
  • మంచి పేరున్న పెద్ద పెద్ద కంపెనీల బ్రాండ్‌ను వాడుకుంటూ ఆఫర్స్‌ ఇస్తుంటే గుడ్డిగా నమ్మకూడదు. ఆ కంపెనీల నియామక ప్రక్రియ ప్రణాళికాబద్ధంగా, కాస్త కష్టంగానే ఉంటుంది. ఫోన్‌లో మాట్లాడి ఉద్యోగం ఇచ్చేస్తే ఆ సంస్థలకు అంత పేరు ప్రఖ్యాతులు ఎలా వస్తాయన్న అంశాన్ని గుర్తుంచుకోవాలి? ఇవన్నీ ఒకసారి ఆలోచించాలి. అవన్నీ నకిలీలేనని గుర్తించాలి.
  • విదేశాల్లో చదువు, ఉద్యోగాల పేరిట ఎవరైనా మిమ్మల్ని నమ్మించాలి అని అనుకుంటే వెంకీ, దుబాయ్‌ శీను సినిమాలు చూసే ఉంటారుగా!
  • కొందరు మరో అడుగు ముందుకేసి ఆఫర్‌ లెటర్స్‌ కూడా పంపిస్తారు. వాటిని బాగా చదవాలి. అందులో వ్యక్తిగత ఫోన్‌ నంబర్లు ఇచ్చినా, అక్షర దోషాలు, భాష ప్రొఫెషనల్‌గా లేకపోయినా, అన్వయ లోపాలు ఉన్నా, మెయిల్‌ ఐడీ సంస్థది కాకుండా వ్యక్తులు వాడే ఉచిత ఐడీల్లా అనిపించినా దాన్ని అనుమానించాల్సిందే.
  • కన్సల్టెన్సీ ద్వారా ఉద్యోగం.. ఇదో పెద్ద మోసం. మన నంబర్ తెలుసుకుని కాల్‌ చేసి, మంచి ఉద్యోగమంటూ మాయమాటలు చెప్పి నమ్మిస్తారు. లక్షల ప్యాకేజీ అని అంకెలు చెప్తారు. కొంత ఖర్చవుతుందంటూ డబ్బులు ఖాతాలో వేయమంటారు. ఇలాంటి సమయంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఉద్యోగం ఇచ్చే ఏ సంస్థ అయినా అభ్యర్థి నుంచి డబ్బు తీసుకోదు అన్న అంశాన్ని ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలి. ఒకవేళ ఆ కన్సల్టెన్సీ నిజమైనదే అయితే దానికి సదరు సంస్థ చెల్లించుకుంటుంది లేదా చేరాక ఇమ్మంటారు కానీ ముందే ఇవ్వమనరు. ఆ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి.

fake job racket busted : పంచాయతీరాజ్‌ శాఖలో కొలువులంటూ ఘరానా మోసం

Fake job racket busted: ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.