ETV Bharat / state

పిల్లలు ఇంటి పనులు చేయాల్సిందే - లేదంటే అలా తయారవుతారు! - నిపుణుల సూచనలివిగో

పిల్లలను ప్రేమించడం తప్పు కాదు - ఆ ప్రేమలో వారిని సోమరులుగా మార్చడం తప్పు - ఆ తప్పే చేయొద్దని తల్లిదండ్రులకు చెబుతున్నారు నిపుణులు - ఇంతకీ ఆ సూచనలేంటో ఈ స్టోరీలో చూద్దామా?

Child Development Tips
Children Help Their Mother (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Child Development Tips : "అబ్బబ్బా.. ఈ మధ్య కాలంలో పని చాలా ఎక్కువైంది. మా పిల్లలు తిన్న తర్వాత కనీసం కంచమైనా తీయరంటే నమ్మండి.. స్కూల్​ నుంచి వచ్చి పుస్తకాల సంచీ ఓ చోట, దుస్తులు మరోచోట విసిరేస్తారు. వాటిని సర్దాలంటే తల ప్రాణం తోకకొస్తుందంటే నమ్మండి." - ఓ తల్లి ఆవేదన

"మా అమ్మాయి డిగ్రీ చదువుతోంది. అయినా ఇల్లు ఊడ్చదు. కనీసం కంచంలోంచి కింద పడిన అన్నం మెతుకులు కూడా తీయదు. మా వాడికేమో కనీసం కప్పుకున్న దుప్పటి మడత పెట్టడమూ రాదు. ఇంట్లో లైట్లు ఆఫ్‌ చేయాలన్నా నేను చేయాల్సిందే."- మరో మాతృమూర్తి మాటలు

ఇలాంటి మాటలు పేరెంట్స్ నోట మనం తరచూ వింటూనే ఉంటాం. తమ పిల్లలకు కష్టం కలిగించొద్దని కొందరు, అనునిత్యం చదువు, చదువు అంటూ మరికొందరు.. పిల్లలు ఇంటి పనులు చేయాల్సిన అవసరమే లేదని ఇంకొందరు.. ఇలా వారిని దూరం పెట్టిన సందర్భాలు కోకొల్లలు. అసలు స్టడీతో పాటు ఇంటి పని కూడా ముఖ్యమనే విషయం ప్రతి తల్లిదండ్రులు తెలుసుకుంటే చిన్నారుల్లో చదువు, స్వీయ బాధ్యత పెరుగుతుందన్నది నిపుణుల సూచన. కనీసం సెలవు రోజుల్లోనైనా మొబైళ్లను పక్కన పెట్టి, అమ్మకు ఇంటి పనుల్లో సాయం చేద్దామనే భావన పిల్లల్లో కల్పించాల్సిన బాధ్యత కుటుంబసభ్యులదే. ప్రధానంగా తల్లిదండ్రులకు ఎక్కువగా ఉంటుంది.

పేరెంట్స్​కు నిపుణుల సూచనలేమిటంటే : చిన్నారులు కోరుకున్న వంట వారి చేత చేయించండి. ఆ అనుభూతే వేరు. ప్రేమించడం తప్పు కాదు. కానీ ఆ ప్రేమలో తెలియకుండానే వారిని సోమరితనంగా మారిస్తే జీవన నైపుణ్యాలు లేక పిల్లల ఉన్నతికి ప్రతి బంధకమవుతుందంటే అతిశయోక్తి కాదు. విద్య, ఉపాధి అవకాశాల కోసం గడప దాటినప్పుడు కొత్త ప్రపంచంలో ఇమడలేక గందరగోళంలో పడతారని నిపుణులు హెచ్చరికలు చేస్తుండటం గమనార్హం. బాల్యంలో ఇంటి పనులు నేర్పితే గృహ నిర్వహణలో ఆర్థిక, భౌతిక, సాంఘిక, భావోద్వేగ స్కిల్స్​ వృద్ధి చెందుతాయని విద్యాశాఖ సైతం సూచిస్తుంది. 3 నుంచి 5వ తరగతులకు పని, విద్య నిర్దేశించిన టాపిక్​లను ప్రస్తావించింది. వీటిని సెలవు దినం 'ఆదివారం' నుంచి ఆచరించడంలో పిల్లలను ప్రోత్సహిద్దాం.

పిల్లలతో ఇంటిపనులు చేయిద్దాం.. (పని విద్య పుస్తకంలో నిర్దేశించిన కార్యక్రమాలు ఇవీ)

❇ ఉతికి ఆరేసిన బట్టలను మడత పెట్టి భద్రపరచుకోవడం

❇ చెప్పులు, బూట్లను శుభ్రం చేసి క్రమ పద్ధతిలో ఉంచడం

❇ విడిచిన దుస్తులు పేరెంట్స్ సలహా మేరకు వేయడం

❇ వినియోగ వస్తువులను, బట్టలు, పుస్తకాలను క్రమపద్ధతిలో అమర్చుకోవడం

❇ ఇంటి సరకులు తీసుకురావడంలో తమదైన సాయం చేయడం

❇ నీళ్లు పట్టడం, ఇల్లు ఊడ్చడం, వంట చేయడంలో సహకరించడం

❇ మొక్కలకు నీళ్లు పోయడం, ఎరువులు వేయడం

❇ భోజన సమయంలో తాగునీరు ఏర్పాటు, కంచాలు తీసి కడగడం

❇ మరుగుదొడ్లను వినియోగించాక తప్పనిసరిగా నీరు పోసి పరిశుభ్రంగా ఉంచడం.

'మీరు తలో చేయి వేస్తే - నేను 'శ్రద్ధ'గా చదువుకుని డాక్టర్ అవుతా'

తల్లిదండ్రులే భారం అనుకున్నా చేరదీసి - ఆరిపోయే ఆయువుకు ప్రాణం పోస్తున్న 'శిశువిహార్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.