ETV Bharat / state

80 ఏళ్ల వయసులో తోడు కోసం వృద్ధుడి ప్రకటన - పెళ్లికి ఓకే చెప్పిన ఇద్దరు మహిళలు - చివర్లో ట్విస్ట్! - OLD MAN CHEATED BY TWO LADIES

80 ఏళ్ల వయసులో పెళ్లికి సిద్ధమైన వ్యక్తి - అదే అదనుగా పెళ్లి పేరుతో లూటీ చేసిన మ్యాట్రిమోనీ నిర్వాహకురాలు సహా మరో మహిళ

Old man Cheated by Two Ladies
Old man Cheated by Two Ladies (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 27, 2024, 7:48 PM IST

Updated : Oct 27, 2024, 7:57 PM IST

Old Man Cheated by Two Ladies in The Name of Marriage : 80 ఏళ్ల వయసు ఉన్న ఒక వృద్ధుడిని పెళ్లి చేసుకుంటామని నమ్మించి మ్యాట్రిమోనీకి చెందిన నిర్వాహకురాలితో పాటు మరో మహిళ మోసగించిన ఘటన సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పెళ్లి కోసం మంగళసూత్రం కొనుగోలు చేస్తామని చెప్పి వృద్ధుడి నుంచి క్రెడిట్ కార్డు తీసుకుని, రూ.1,77,000 విలువ చేసే తాళి తీసుకుని పరారవడంతో బాధితుడు మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు, రిటైర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్​గా పని చేసిన చిన్న కొండయ్య భార్య 10 సంవత్సరాల క్రితం చనిపోయింది. అతనికి సంతానం లేకపోవడంతో మధిరలోని జమాలపురంలో ఆశ్రమంలో ఉంటున్నాడు. తన ఆలనా పాలనా చూసేందుకు ఎవరూ లేరని కలత చెందిన చిన్న కొండయ్య వృద్ధుడైనప్పటికీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు ఇటీవల పత్రికలో ప్రకటన కూడా ఇచ్చాడు. అది చూసి ఓ మ్యాట్రిమోనీకి చెందిన మహిళ అతన్ని పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకుంది. మ్యాట్రిమోనీకి చెందిన ఓ నిర్వాహకురాలితో పాటు సరస్వతి అనే మరో మహిళ చిన్న కొండయ్యను పెళ్లి చేసుకునేందుకు దిల్​సుఖ్​నగర్​లోని ఓ లాడ్జికి వచ్చారు. వృద్ధుడిని అక్కడకు రప్పించుకుని, పెళ్లి కోసం మాట్లాడుకున్నారు.

ఈ క్రమంలోనే పెళ్లికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేసేందుకు సికింద్రాబాద్​లోని చందన బ్రదర్స్​కు వచ్చి చిన్న కొండయ్య క్రెడిట్ కార్డుతో డబ్బులు డ్రా చేసి మంగళసూత్రం కొనుగోలు చేశారు. వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. రూ.లక్షా 77 వేలు క్రెడిట్ కార్డు నుంచి డ్రా చేసినట్లు మెసేజ్ రావడంతో కంగుతున్న చిన్న కొండయ్య, అనంతరం ఆ ఇరువురి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.

మరోవైపు ఇటువంటి ఉదంతాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయని, ఆన్లైన్​ ప్లాట్​ఫాం సహా ఇతర ప్రకటనల ద్వారా మ్యారేజ్​ ప్రపోజల్స్​ చేసినప్పుడు అపరిచితుల వివరాలను పూర్తిగా విశ్లేషించుకోవాలని తెలుపుతున్నారు.

Married Woman Cheated Young Man : వివాహిత ఘరానా మోసం.. వధువుగా పరిచయమై.. ప్రేయసిగా దోచుకుని.. చివరకు..!

పెళ్లి పేరుతో మోసం, ఆపై బెదిరింపులు - మహిళా నిర్మాతపై కేసు నమోదు

Last Updated : Oct 27, 2024, 7:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.