Tidco Houses Construction Works Delay in AP: రాష్ట్ర వ్యాప్తంగా టిడ్కో గృహాల నిర్మాణం, పంపిణీని పక్కనపెట్టిన వైసీపీ ప్రభుత్వం లబ్ధిదారుల గోడు గాలికొదిలేసింది. ఇళ్ల కోసం నాలుగున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న మహిళల ఆశలపై జగన్(CM Jagan) నీళ్లు చల్లారు. అప్పులు చేసి మరీ ఇళ్ల నిర్మాణాలకు డబ్బులు కట్టిన లబ్ధిదారులకు బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయి. తీసుకున్న రుణాలు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారు.
టిడ్కో ఇళ్లలో మంచినీళ్లొద్దా? బిందెలతో మహిళల నిరసన
ఎన్టీఆర్ జిల్లా నందిగామ పురపాలక సంఘం పరిధిలో 2 వేల 496 మంది పేదలకు జీ ప్లస్ త్రీ ఇళ్లు మంజూరయ్యాయి. లబ్ధిదారులు(TIDCO House Beneficiaries) తమవంతుగా రెండు కోట్ల రూపాయలు డిపాజిట్లు చెల్లించారు. అయినా ఎంపిక చేసిన లబ్ధిదారుల్లో 98 మంది పేర్లతో స్టేట్ బ్యాంకు(State Bank of India) నుంచి రుణం తీసుకున్నారు.
ఆ డబ్బుతో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి ఇస్తామన్న ప్రభుత్వ(YSRCP Govt) మాటలు అమలు చేయలేదు. అయితే బ్యాంకులు మాత్రం లబ్ధిదారులను డబ్బు చెల్లించమని ఒత్తిడి తెస్తున్నాయి. కట్టనివారికి నోటీసులు పంపుతున్నారు. దీనిపై మున్సిపల్ అధికారులను ప్రశ్నిస్తే సమాధానం చెప్పటం లేదని లిబ్ధిదారులు వాపోతున్నారు. లబ్ధిదారు ఖాతాలో నుంచి డబ్బులు పోవటం, బ్యాంకుల నుంచి నోటీసులు రావటంపై ఇటీవల మహిళలు ఆందోళనకు దిగారు.
ఇళ్లు ఇస్తామని పిలిచి ఉసూరుమనిపించిన వైసీపీ నేతలు - కన్నీరుపెడుతూ వెనుతిగిన పేదలు
తమకు తెలియకుండా లోన్లు ఎలా తీసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్లు అందించకుండా డబ్బులు కట్టమంటే తమ పరిస్థితి ఏంటని నిలదీశారు. బ్యాంకు ఖాతాలో ఉన్న ఇతర సొమ్మును సైతం టిడ్కో రుణం పేరుతో లాగేసుకుంటున్నారని లబ్ధిదారులు వాపోయారు. దీనిపై ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం దక్కలేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్య పరిష్కరించాలని టిడ్కో లబ్ధిదారులు వేడుకుంటున్నారు.
ఎన్నికల వేళ హడావుడిగా టిడ్కో ఇళ్ల పంపిణీ - మౌలిక వసతులు లేవంటూ లబ్ధిదారులు ఆగ్రహం