Tummala Pond Missing Complaint in PS : చెరువు జాడ కనిపించట్లేదని ఓ ఊరి ప్రజలు పహాడిషరీఫ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. మహేశ్వరం మండలంలోని తుక్కుగూలో 8 ఎకరాల్లో ఉండాల్సిన తుమ్మల చెరువును కొందరు కబ్జా చేసి వెంచర్లు వేశారని గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనివల్ల ప్రతి వర్షాకాలం పంటలు మునుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చెరువు ఆచూకీ కనిపెట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. చెరువు కబ్జాపై రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయామని వాపోయారు. పోలీసులైనా చెరువు ఆచూకీ వెతికిపెట్టాలని కోరారు.
మరోవైపు ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మించిన ఇళ్లను రెవెన్యూ అధికారులు నేలమట్టం చేశారు. హైదరాబాద్ రాయదుర్గం మల్కం చెరువు సమీపంలోని ప్రభుత్వ భూమిలో కొందరు ఇళ్లు నిర్మించుకుని నివాసముంటున్నారు. శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు భారీ పోలీసు బందోబస్తుతో దాదాపు ఎకరం భూమిలో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. నిర్మాణాల తొలగింపును స్థానికులు, నివాసితులు అడ్డుకున్నారు. అధికారుల కూల్చివేతలతో చిన్న పిల్లలు సైతం భయాందోళనలకు గురయ్యారు.
ఆక్రమణలపై హైడ్రా హై నజర్ - కబ్జా అని తేలితే కూల్చేయటమే! - HYDRA OPERATIONS