Three People Died After Eating Contaminated Food at Peddapalli District : కలుషిత ఆహారం, కలుషిత నీరు తాగి ఒడిశాకు చెందిన ముగ్గురు వలస కార్మికులు మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలంలోని గౌరెడ్డి పేటలో జరిగింది. ఎమ్ఎస్ఆర్ ఇటుక బట్టీలో పని చేస్తున్న 19 మంది కార్మికులు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. పలువురు కార్మికుల పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ ముగ్గురు కార్మికులు మృతి చెందారు.
Food Poison Three People Died at Peddapalli : మిగిలిన 13 మంది కార్మికులు కరీంనగర్లోని ఓప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు వారిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. అస్వస్థతకు గురైన మరో నలుగురు కార్మికులు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. యజమాని నిర్లక్ష్యం వల్లే తమవాళ్లు మృతి చెందడంతో పాటు అస్వస్థతకు గురయ్యారని కార్మికులు ఆరోపిస్తున్నారు. బట్టీ యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
Food Poison in Nagarkurnool : కలుషిత ఆహారం కలకలం.. 40 మందికిపైగా విద్యార్థులకు అస్వస్థత
Food Poisoning in Asifabad District : సంతలో మిర్చీ బజ్జీలు తిని 60 మందికి పైగా అస్వస్థత