ETV Bharat / state

అప్పుల భారం - ఐదు నెలల చిన్నారితో సహా తల్లిదండ్రుల ఆత్మహత్య - THREE MEMBERS DIED IN FAMILY

ఐదు రోజుల నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం - కుళ్లిపోయే దశకు మృతదేహాలు

three_members_died_in_family_due_to_debts_in_anantapur_district
three_members_died_in_family_due_to_debts_in_anantapur_district (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 21, 2024, 5:19 PM IST

Three Members Died In Family Due to Debts in Anantapur District : అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మరణం కలకలం రేపింది. భార్యాభర్తలు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం కృష్ణ కిషోర్‌ (45), భార్య శిరీష (35) తమ ఐదు నెలల చిన్నారితో కలిసి పోలీస్‌స్టేషన్‌ సమీపంలోని సంతబజారులో నివాసం ఉంటుంన్నారు. ఐదు రోజుల నుంచి వారెవరూ ఇంటి నుంచి బయటకు రాలేదు. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో అనుమానం వచ్చిన కొందరు పక్క ఇంటి మిద్దెపై నుంచి ఇంట్లోకి చూశారు. తీవ్రమైన దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఎస్సై సాగర్‌, ఆర్‌ఐ జ్యోతి, ఏఎస్సై నాగరాజు తదితరులు అక్కడికి చేరుకొని తలుపులు బద్దలు కొట్టి చూశారు. భార్యా భర్తలిద్దరూ ఉరివేసుకొని ఉన్నారు. ఉయ్యాలలో చిన్నారి విగతజీవిగా పడి ఉన్నాడు. ఆర్థిక సమస్యల వల్లే ఉత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు భావిస్తున్నారు. కిషోర్‌ మెడికల్‌ స్టోర్‌ నిర్వహించేవాడని ఈ క్రమంలో అప్పులు ఎక్కువయ్యాని స్థానికులు తెలుపుతున్నారు. వీరు ఆత్మహత్య చేసుకొని నాలుగైదు రోజులు కావడంతో మృతదేహాలు కుళ్లిపోయే దశకు చేరుకున్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాగర్‌ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.