ETV Bharat / state

3 రాజధానులతో లాభం జరుగుతుందని నమ్మి మోసపోయాం - టీడీపీలో చేరిన బహుజన పరిరక్షణ సమితి నేతలు - Three Capital YCP leaders Join TDP - THREE CAPITAL YCP LEADERS JOIN TDP

Three Capital Movement YCP leaders Join to TDP : వైసీపీ పార్టీకి వరుస షాక్​లు ఎదురవుతున్నాయి. వైసీపీ అనుబంధ బహుజన పరిరక్షణ సమితి నేతలు మూడు రాజధానుల శిబిరం ఎత్తివేసి లోకేశ్​ సమక్షంలో టీడీపీలో చేరారు. వారికి పసుపు కండువా కప్పిన లోకేశ్​ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మూడు రాజధానులతో లాభం జరుగుతుందని నమ్మి మోసపోయామని ఆ పార్టీ నేతలు అన్నారు. బహుజన రాజకీయ యాత్ర చేపట్టి రాజకోట రహస్యాలను ప్రజలకు వివరిస్తామన్నారు

Three Capital YCP leaders Join TDP
Three Capital YCP leaders Join TDP
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 3, 2024, 5:59 PM IST

Three Capital Movement YCP leaders Join to TDP : వైసీపీ నేతలు అమరావతిలో మూడు రాజధానుల శిబిరం ఎత్తివేసి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ను కలిశారు. దాదాపు నాలుగు సంవత్సరాలుగా మందడం సీడ్ యాక్సిస్ రోడ్డు వద్ద శిబిరం నిర్వహిస్తూ వచ్చారు. శిబిరం ఎత్తివేసి వైసీపీ అనుబంధ బహుజన పరిరక్షణ సమితి నేతలు లోకేశ్ సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. కేశినేని చిన్ని ఆధ్వర్యంలో శిబిరం నిర్వాహకులైన బహుజన పరిరక్షణ సమితి నేతలు లోకేశ్​ను కలిసి తెలుగుదేశం తీర్ధం పుచ్చుకున్నారు. మూడు రాజధానులతో లాభం జరుగుతుందని నమ్మి మోసపోయామని బహుజన పరిరక్షణ సమితి అధ్యక్షుడు మాదిగాని గురునాథం అన్నారు.

చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తూ వైసీపీ ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాలుగా తమను నమ్నించే యత్నం చేసిందని విమర్శించారు. అభివృద్ధి వికేంద్రీకరణ కూటమితోనే సాధ్యమని ఆలస్యంగా గ్రహించామన్నారు. నియంత పోకడలు ప్రదర్శిస్తూ పేదలకు పెత్తందారులకు యుద్ధమని సీఎం జగన్ అంటున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బహుజనుల్ని ఏకం చేసి తెలుగుదేశం కూటమి గెలుపు కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. రాజధాని రైతులకు ఇకపై తమ సహకారం ఉంటుందని ఆయన తెలిపారు.

తాయిలాల ఆశ చూపి - బలవంతంగా వైసీపీ కండువాలు కప్పుతున్న నేతలు - YCP Scarves by Force

బహుజన రాజకీయ యాత్ర చేపట్టి రాజకోట రహస్యాలను ప్రజలకు వివరిస్తామన్నారు. తమ పోరాటాన్ని రాజకీయంగా నందిగం సురేష్, కొడాలి నాని వాడుకున్నారని నేతలు ఆరోపించారు. రాజధాని ఉద్యమాన్ని ఎన్నో అరాచక శక్తులు ఇబ్బంది పెట్టాయని తెలుగుదేశం విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని చిన్ని అన్నారు. బహుజన పరిరక్షణ సమితి వాస్తవాలు గ్రహించి మూడు రాజధానుల ఉద్యమానికి స్వస్తి పలకడం శుభ పరిణామమని చిన్ని పేర్కొన్నారు. రాజకోట రహస్యాలు ఏంటో తెలుసుకునేందుకు రాష్ట్రం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోందన్నారు.

వైఎస్సార్సీపీకి షాక్ - ఎన్నికల సమయంలో టీడీపీలోకి భారీ ఎత్తున చేరికలు

Kesineni Chinni Meeting in Vijayawada: గత ఎన్నికల్లో జగన్మోహన్​ రెడ్డి ఒక్క అవకాశం అని చెప్పి ప్రజలను మోసం చేశారని కేశినేని చిన్ని అన్నారు. ఇందిరాగాంధీ స్టేడియం వాకర్స్ అసోసియేషన్‌ సభ్యులతో కలిసి కేశినేని శివనాథ్, సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావు ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. కేశినేని చిన్ని సమక్షంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 34, 35 డివిజన్ల నుంచి వైసీపీ నేతలు తెలుగుదేశంలోకి చేరారు. వారికి ఆయన పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఈ సమావేశంలో టీడీపీ- జనసేన- బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

రానున్న ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతో వైసీపీ నేతలు టీడీపీ కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అందరి లెక్కలు తేలుస్తామని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కారణంగానే పింఛన్లు ఆగిపోయినట్లు వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా పింఛన్ల ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని చిన్ని స్పష్టం చేశారు.

చిలకలూరిపేటలో వైసీపీ ఖాళీ - మాజీ ఇన్‌ఛార్జితో పాటు మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ సహా కౌన్సిలర్లు టీడీపీలో చేరిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.