Massive theft in Shameerpet : తాళం వేసిన ఇళ్లనే టార్గెట్గా చేసుకుంటూ భారీ చోరీలకు పాల్పడుతున్న ఈ దొంగలు పోలీసులకే సవాల్ విసురుతున్నారు. మూడురోజుల క్రితం నగరంలోని శామీర్పేట్ కాలనీలో అనిల్ కుమార్ యాదవ్ అనే యజమాని ఇంటికి తాళం వేసి ఫంక్షన్కు వెళ్లాడు. తిరిగి ఇంటికి 10 గంటలకు వచ్చేసరికి గుర్తు తెలియని దొంగలు 13 తులాల బంగారం, రూ.68 వేలు నగదును అపహరించుకుపోయారు. దీంతో బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే తాజాగా ఈ సంఘటన మరువకముందే మరో రెండు ఇళ్లల్లో 30 తులాల బంగారం, కొంత మేర డబ్బును ఇలానే దొంగలు ఎత్తుకుపోయారు. ఈసంఘటన శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
దీంతో కాలనీవాసులు బెంబేలెత్తుతున్నారు. గ్రామపంచాయతీ పరిధిలో 37 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన ప్రస్తుతం వాటిలో కేవలం ఒక్కటంటే ఒక్కటే పనిచేస్తుందని, ఇది దొంగలకు అనుకూలంగా మారడంతో యథేచ్చగా చోరీ చేసుకొని వెళుతున్నారు. తాళం వేసిన ఇళ్లను రోజంతా రిక్కీ నిర్వహించి చోరీలకు పాల్పడుతున్నారని కాలనీవాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వరుసగా చోరీలు జరుగుతున్న పోలీసులు దృష్టి సారించకపోవడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Robbery Incidents in Hyderabad : మరోవైపు రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో సైతం ఇవాళ దొంగలు రెచ్చిపోయారు. పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధి అన్నోజిగూడ తాజ్ హోటల్ పక్కన ఇంటి తాళం పగలగొట్టి, దుండగులు బీరువాలో భద్రపరిచిన 16 తులాల బంగారం, 35తులాల వెండి ఆభరణాలు, రూ.లక్ష 40వేల నగదు ఎత్తికెళ్లారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెక్కల కష్టం చేసి ఒక్కొక్క రూపాయి కూడపెట్టుకున్నామని కన్నీరు మున్నీరుగా విలపించారు. దుండగులపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని వేడుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీస్ క్లూస్ టీం, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
"మేము ఇక్కడ ఒక జ్యూస్ షాపులో పనిచేస్తున్నాం. రెక్కల కష్టం చేసి ప్రతి రూపాయి కూడబెట్టుకున్నాం. నా భార్య వాళ్ల అమ్మవాళ్లు పెట్టిన బంగారం, మేము కష్టపడి కూడబెట్టుకున్నది కలిపి 16 తులాలు ఉంటుండే, అంతేకాకుండా రూ. 1.40 లక్షలు మొత్తం అపహరణకు గురైంది. ఇంటి తాళం పగలగొట్టి, సంపదంతా ఎత్తుకెళ్లారు."-బాధితుడు
మహిళల వేషధారణలో వచ్చి చోరీ - 4 తులాల బంగారం, రూ.లక్షతో పరార్ - theft in Sr nagar