ETV Bharat / state

కానిస్టేబుళ్ల దాష్టీకం : ఫొటో తీసి బెదిరింపులు - డబ్బులు ఇవ్వనందుకు కాపురంలో చిచ్చు - CONSTABLES IN NAGARKARNOOL DISRICT

NAGARKARNOOL CONSTABLES : ఓ ఫొటోను అడ్డు పెట్టుకుని ఓ వ్యక్తిని పోలీస్‌ కానిస్టేబుల్‌ ఒకరు బెదిరించి డబ్బు వసూలు చేశాడు. ఆ ఫొటోను మరో కానిస్టేబుల్‌కు పంపించాడు. అతను కూడా బాధితుడిని డబ్బులు డిమాండ్‌ చేశాడు. అతను ఇవ్వకపోవడంతో భార్యాభర్తల కాపురంలో చిచ్చుపెట్టాడు. నాగర్​కర్నూల్​ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

CURREPTED CONSTABLES NAGARKARNOOL
CONSTABLES IN NAGARKARNOOL DISRICT (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 24, 2024, 1:33 PM IST

CONSTABLES IN NAGARKURNOOL DISTRICT : ఫొటోలు అడ్డం పెట్టుకొని ఓ వ్యక్తిని పోలీస్​ కానిస్టేబుల్​ బ్లాక్ మెయిల్ చేసిన ఘటన నాగర్​కర్నూల్​ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ బ్లాక్​ మెయిల్​ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు చూస్తే, నాగర్​కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి, 4 నెలల క్రితం నాగర్​కర్నూల్ పట్టణంలోని ప్రధాన రహదారిలో తన కారులో స్నేహితురాలితో కలిసి భోజనం చేస్తున్నాడు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న ఓ కానిస్టేబుల్, వారి ఫొటోలను తన ట్యాబ్​లో చిత్రీకరించి వారిని బెదిరించాడు.

ఒంటరిగా కారులో ఏం చేస్తున్నారని వారిని భయభ్రాంతులను గురి చేసి, బ్లాక్​ మెయిల్ చేశాడు. కేసు నమోదు చేస్తానని, సామాజిక మాధ్యమాల్లో ఫొటోలను పెడతామని బెదిరించి రూ.10 వేలు డిమాండ్ చేశాడు. దీంతో గత్యంతరం లేక ఆ వ్యక్తి తన స్నేహితుల సహాయంతో రూ.2 వేలను ఆన్​లైన్​లో ఫోన్ పే ద్వారా ఆ కానిస్టేబుల్​కు డబ్బులు పంపించాడు.

మరో కానిస్టేబుల్​ వికృత చేష్టలు : ఇది చాలదన్నట్లు ఆ కానిస్టేబుల్​ ఆ ఫొటోలను మరో కానిస్టేబుల్​కు పంపించాడు. దీంతో ఆ కానిస్టేబుల్ కూడా సదరు వ్యక్తికి ఫొటోలు చూయించి బ్లాక్ మెయిల్ చేశాడు. డబ్బులు డిమాండ్​ చేశాడు. ఇచ్చేందుకు ససేమిరా అనడంతో ఆ ఫొటోలను ఆయన భార్యకు వాట్సప్​లో పంపించాడు. దీంతో ఆ భార్యాభర్తల మధ్య పెద్ద గొడవ జరిగింది. ఈ విషయం ఊర్లో వారికి తెలిసి, భార్యాభర్తల మధ్య రాజీ కుదిర్చారు.

ఈ విషయం ఊర్లో వాళ్ల అందరికీ తెలిసింది. రక్షణ ఇచ్చే పోలీసులే ఇలా బ్లాక్ మెయిలర్లుగా మారితే ఎలా అని గ్రామస్థులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వెంటనే సీఐ స్పందించి, సదరు కానిస్టేబుళ్ల​ను సస్పెండ్​ చేయాలని కోరారు. ఈ విషయంపై నాగర్ కర్నూల్ సీఐ కనకయ్యను వివరణ కోరగా, పూర్తి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు చేపడతామని తెలిపారు.

గోల్డ్ మెడల్ సాధించిన వ్యక్తికి ఓటు వేస్తారో, బ్లాక్ మెయిల్ చేసే వ్యక్తికి వేస్తారో ఆలోచించండి : కేటీఆర్ - KTR MLC Election Campaign Nalgonda

ఆమె స్నానం చేస్తుండగా ఫొటోలు తీశాడు.. ఆపై బెదిరించి సంవత్సరం పాటు అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.