LED street lights project In AP: వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గ్రామాల్లో నెలకొన్న అంధకారాన్ని తొలగించేదుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వైఎస్సార్సీపీ హయాంలో భ్రష్టుపట్టిన ఎల్‌ఈడీ వీధిదీపాల ప్రాజెక్టుకు జీవం పోసేందుకు చర్యలు తీసుకుంటోంది. పంచాయతీలకు గుదిబండగా మారిన వీధిదీపాల నిర్వహణను మళ్లీ కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇంధన సామర్థ్య సేవల సంస్థ (ఈఈఎస్‌ఎల్)కు అప్పగించే విషయాన్ని పరిశీలిస్తోంది. ఇందుకోసం ముగ్గురు ఐఏఎస్ అధికారులతో నియమించిన కమిటీ మంగళవారమే రంగంలో దిగింది.
Street Lights: "వీధి దీపాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది"
అంధకారంలోకి నెట్టిన వైఎస్సార్సీపీ: ఎల్‌ఈడీ వీధిదీపాల ప్రాజెక్టును తిరిగి ప్రారంభించేందుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం పూర్తిచేసి పది రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. గ్రామాల్లో సంప్రదాయ ట్యూబ్‌లైట్ల స్థానంలో ఎల్‌ఈడీ వీధిదీపాలు ఏర్పాటుచేసే ప్రాజెక్టును 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించారు. ఎల్‌ఈడీలు ఏర్పాటు చేయడానికంటే ముందు ప్రతి సంవత్సరం విద్యుత్తు ఛార్జీలకు దాదాపు రూ.338.95 కోట్లు వరకు ఖర్చు అయ్యేది. ఆ తర్వాత ప్రతి ఏడాదికి విద్యుత్తు ఛార్జీల ఖర్చు రూ.169.47 కోట్లకు తగ్గడం గమనార్హం. ఇలా రెండేళ్లూ చక్కగా సాగిన ప్రాజెక్టుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అనేక అడ్డంకులను సృష్టించారు. ఈఈఎస్‌ఎల్‌కి బిల్లులు భారీగా బకాయి పెట్టారు. పంచాయతీలు, గ్రామ సచివాలయాలకు వీధిదీపాల నిర్వహణను అప్పగించారు. దీంతో వాటి నిర్వహణ అధ్వానంగా తయారైంది. రెండున్నరేళ్ల క్రితం గ్రామాల్లో 95% ఎల్‌ఈడీ దీపాలు వెలిగేవి. రాష్ట్రంలో 22.22 లక్షల ఎల్ఈడీ దీపాలంటే అందులో 15 లక్షలు వరకు వెలగడం లేదు.
14 పంచాయతీల్లో వెలగని వీధి దీపాలు.. చీకట్లో ప్రజలు
ఈఈఎస్‌ఎల్‌తో జరిగిన ఒప్పందం: ఎల్‌ఈడీ వీధిదీపాల ప్రాజెక్టు నిర్వహణలో కీలకమైన ఈఈఎస్‌ఎల్‌కి చెల్లించాల్సిన బకాయిలు రూ.570 కోట్లకు చేరాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈఈఎస్‌ఎల్‌తో జరిగిన ఒప్పందంలో కుంభకోణం ఉందన్న అనుమానంతో గత ప్రభుత్వం అనేక విచారణలు చేయించింది. అవకతవకలకు ఆస్కారమే లేదని దర్యాప్తు సంస్థలు తేల్చేశాయి. 2017 నుంచి పదేళ్ల వరకు వాటి నిర్వహణ చేపట్టేందుకు ముందుకొచ్చింది. ఎల్‌ఈడీల ఏర్పాటుతో యూనిట్‌కు సరాసరి రూ.56 చొప్పున ఆదా అయిన విద్యుత్తు ఛార్జీల ఖర్చులో ఈఈఎస్‌ఎల్‌కి రూ.45 (80%) చెల్లించాలి. మిగిలిన రూ.11 (20%) తిరిగి పంచాయతీలకే జమకానుంది.
BJP Vishnu: 'రాయలసీమవి అక్రమ ప్రాజెక్టులైతే..తెలంగాణవి సక్రమ ప్రాజెక్టులా ?'.