ETV Bharat / state

పాదాలు నరికేసి - నోటిని చీల్చి చిరుత గోళ్లు, పళ్లు ఎత్తుకెళ్లిన వేటగాళ్లు! - ఎక్కడంటే?

ఏపీలోని చిత్తూరు జిల్లాలో వరుసగా చిరుతల మరణం - అతి భయంకర స్థితిలో లభ్యమవుతున్న కళేబరాలు - అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు

Leopard
Leopard Died in Hunters Trap in AP (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

Leopard Died in Hunters Trap in AP : వేటగాళ్లు పన్నిన ఉచ్చులో చిక్కి మగ చిరుత (4-5 ఏళ్లు) బలైంది. చిరుత కాలి గోళ్ల కోసం పాదాలు నరికేసి, అతి భయంకరంగా నోటిని చీల్చి మరీ అన్ని పళ్లు పట్టుకెళ్లారు. ఈ ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లా తాళ్లమడుగు సమీపంలోని బోడబండ్ల బీట్‌ పరిధిలో వెలుగు చూసింది. సోమవారం స్థానికంగా పశువుల కాపరి చిరుత కళేబరాన్ని గుర్తించి గ్రామస్థులందరికీ చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

వారి సమాచారం మేరకు డీఎఫ్‌వో (డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్) భరణి ఆధ్వర్యంలో అధికారులు అక్కడికి చేరుకుని కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి ఎస్వీ జూ పశు వైద్యాధికారులతో పోస్టుమార్టం నిర్వహించగా, శరీరంపై గాయాలు ఉన్నట్లు గుర్తించారు. కరెంటు తీగలు ఏర్పాటు చేసి చిరుతను హత్య చేసి ఉండవచ్చని డీఎఫ్‌వో భరణి అనుమానం వ్యక్తం చేశారు. వైద్యుల నివేదిక ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

TIGER DIED INCIDENTS IN CHITTOOR
వేటగాళ్లు పన్నిన ఉచ్చులో పడి చిరుత మృతి (ETV Bharat)

విద్యుత్ తీగలు ఎక్కడివి?: సోమల మండలంలోని ఆవులపల్లె అటవీ పరిధి గట్టువారిపల్లె సమీపంలోని చెరువుకోన అటవీ ప్రాంతంలోని లోయలోనూ మరో చిరుత కళేబరం వెలుగు చూసింది. జిల్లాలో రెండు పులులు మృత్యువాతపడిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. డీఎఫ్‌వో భరణి, ఎఫ్‌ఆర్వో శ్రీరాములు ఘటనా స్థలం పరిశీలించారు. పశు సంవర్ధక ఏడీ శ్రీనివాసులు నాయుడు, పశు వైద్యాధికారి చందన ప్రియ, తిరుపతి జూపార్క్‌ అధికారులు, గ్రామ పెద్దల సమక్షంలో కళేబరానికి పరీక్షలు నిర్వహించారు. చిరుత వేటగాళ్ల ఉచ్చులో పడిందా? విద్యుత్తు తీగలు తగలి మృత్యువాత పడిందా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Chetah Died in Chittoor Forest
చెరువుకోన లోయ ప్రాంతంలో మృతి చెందిన చిరుత (ETV Bharat)

లోయను దాటే క్రమంలో జారిపడి మృతి చెందినట్లు ప్రాథమికంగా భావిస్తున్నామని, శవ పరీక్ష నివేదిక ఆధారంగా కేసు పరిశీలిస్తామని అధికారులు తెలిపారు. ఈ చిరుతకు కాళ్ల గోర్లు మాత్రం అలాగే ఉన్నాయని, మృతి చెంది మూడు రోజులకు పైగా అయి ఉంటుందన్నారు. వరుస చిరుతల మృతి పట్ల అటవీ శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. దీని వెనుక ఎవరి హస్తం ఉంటుందన్న కోణంలో దర్యాప్తు చేస్తోన్నట్లు తెలుస్తోంది.

గుడ్​ న్యూస్​ - మియాపూర్​లో రాత్రి కనిపించింది చిరుత కాదు - అది ఏంటంటే?

అలర్ట్ : 'అక్కడ కనిపించింది చిరుతపులే - ఎవరూ ఒంటరిగా తిరగొద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.