ETV Bharat / state

జూనియర్‌ లెక్చరర్స్‌, గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్ పరీక్ష ఫలితాలు విడుదల - TGPSC Junior Lecturers Results Out - TGPSC JUNIOR LECTURERS RESULTS OUT

TGPSC Junior Lecturer Results : రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో భర్తీకి నిర్వహించిన జూనియర్‌ లెక్చరర్స్‌ పరీక్ష ఫలితాలను టీజీపీఎస్సీ సోమవారం విడుదల చేసింది. మరోవైపు గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్ ఫలితాలను సైతం ప్రకటించింది. ఈ రెండు పరీక్షలకు సంబంధించిన ఫలితాలను టీజీపీఎస్సీ వెబ్​సైట్​లో పొందుపరిచింది.

TGPSC Junior Lecturers and Lab Technician Results
TGPSC Junior Lecturer Results (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 8, 2024, 10:37 PM IST

TGPSC Junior Lecturers and Lab Technician Results : రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 1,392 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్ష ఫలితాలను టీజీపీఎస్సీ సోమవారం విడుదల చేసింది. ఈ మేరకు జూనియర్ లెక్చరర్ జనరల్ ర్యాంకింగ్స్​ను ప్రకటించింది. కమిషన్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ పరిధిలోని జేఎల్ పోస్టుల ఫలితాలను విడుదల చేసింది. గతేడాది సెప్టెంబర్‌ 12 నుంచి అక్టోబర్‌ 3 వరకు వివిధ తేదీల్లో కంప్యూటర్‌ ఆధారితంగా టీజీపీఎస్సీ ఈ పరీక్ష నిర్వహించిన విషయం విదితమే.

ఈ మేరకు జూనియర్‌ లెక్చరర్‌ ఫలితాలను టీజీపీఎస్సీ అధికారిక వెబ్​సైట్లో పొందుపరిచింది. త్వరలోనే 1:2 నిష్పత్తిలో షార్ట్‌ లిస్టు జాబితాను వెల్లడిస్తామని టీజీపీఎస్సీ పేర్కొంది. పీడబ్ల్యూడీ అభ్యర్థులకు సైతం 1:5 నిష్పత్తిలో షార్ట్‌ లిస్ట్​ను విడుదల చేస్తామని తెలిపింది. మరోవైపు గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్ ప్రొవిజినల్ ఫలితాలను సైతం టీజీపీఎస్సీ సోమవారం విడుదల చేసింది. డీపీహెచ్, డీఎంఈ, టీవీవీపీ పరిధిలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించిన టీజీపీఎస్సీ, తన అధికారిక వెబ్ సైట్​లో ఫలితాలు చూసుకోవాలని పేర్కొంది.

డీఎస్సీ పరీక్షలు యథాతథం - ఈ నెల 11న హాల్‌టికెట్లు విడుదల : విద్యాశాఖ - TG DSC As Per Schedule

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.