ETV Bharat / state

కూటమి ప్రభుత్వానికి అరుదైన విరాళం - రూ.6కోట్ల ఆస్తిని అప్పగించిన తెనాలి మహిళామండలి - Tenali Women Donated Property - TENALI WOMEN DONATED PROPERTY

Tenali Women Donated Property Worth Six Crores To The Government : ప్రభుత్వం మాకు పథకాలు అందించాలి. మా ప్రాంతంలో మౌలిక సదుపాయులు కల్పించాలని ప్రజలు ఆలోచిస్తుంటారు. కానీ గుంటూరు జిల్లా తెనాలి మహిళలు మాత్రం ప్రభుత్వానికే రూ.6 కోట్ల ఆస్తిని ఎదురిచ్చారు. అతివల అభ్యున్నతి కోసం విరాళాలు పోగేసి ఏర్పాటు చేసుకున్న భవనాన్ని సర్కారుకి అప్పగించారు.

TENALI WOMEN DONATED PROPERTY
TENALI WOMEN DONATED PROPERTY (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 26, 2024, 12:52 PM IST

Tenali Women Donated Property Worth Six Crores To Government : గుంటూరు జిల్లా తెనాలి పచ్చని పంటలకే కాదు మహిళల చైతన్యానికి నిదర్శనం. ఈ ప్రాంతంలోని మహిళా వైద్యలు, న్యాయవాదులు, అధ్యాపకులు, విద్యావేత్తలు, చైతన్యవంతులైన గృహిణులు. సుమారు వంద మంది కలిసి 1967లో తెనాలి మహిళా మండలి ఏర్పాటు చేశారు. విరాళాలు పోగుచేసి పట్టణ నడిబొడ్డులోని కొత్తపేటలో 514 గజాల స్థలాన్ని కొనుగోలు చేసి ఓ భవనాన్ని నిర్మించారు. 1969వ సంవత్సరంలో స్వాతంత్య్ర సమరయోధురాలు దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ చేతుల మీదుగా భవంతిని ప్రారంభించారు. డాక్టర్‌ చలసాని ఝాన్సీవాణి, బోయపాటి సుభద్రాదేవి అధ్యక్షురాలు, కార్యదర్శులుగా అప్పట్లో మహిళల అభ్యున్నతి కోసం మొదలైన కార్యక్రమాలు అనేక సంవత్సరాలు కొనసాగాయి.

రూ. 6 కోట్ల విలువైన భవనం అందజేత : మహిళా మండలి ఏర్పాటైన నాటి నుంచి సభ్యురాలిగా ఉన్న డాక్టర్‌ ముద్దన కస్తూరిబాయి సుమారు 20 ఏళ్ల క్రితం అధ్యక్షురాలు అయ్యారు. ప్రస్తుతం చాలా మంది మండలి సభ్యులు మరణించడం, మిగిలినవారు వృద్ధాప్యం వల్ల క్రీయాశీలకంగా లేకపోవడంతో కార్యక్రమాలు నెమ్మదించాయి. దీంతో మహిళా మండలి భవనాన్ని ప్రభుత్వానికి అందిస్తే స్త్రీలకు మేలు జరుగుతుందని కస్తూరి బాయి భావించారు. ఈ క్రమంలో సభ్యుల అందరి తీర్మానంతో భవనాన్ని ప్రభుత్వానికి అప్పగించారు.

మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ గజ్జల వెంకటలక్ష్మికి ఉద్వాసన - Gajjala Venkata Lakshmi

మహిళా అభ్యున్నతి వినియోగించాలని వినతి : మహిళా మండలి భవనాన్ని ప్రభుత్వానికి అప్పగించే కార్యక్రమాన్ని వేడుకలా నిర్వహించారు. కస్తూరిబాయి దంపతులను పూలబాటపై నడిపిస్తూ మండలి భవనానికి తీసుకొచ్చారు. మంత్రి నాదెండ్ల మనోహర్‌ అమెకు ఎదురు వెళ్లి ఘన స్వాగతం పలికారు. అ తర్వాత నాదెండ్ల సమక్షంలో కార్యదర్శి కొసరాజు ఝాన్సీకుమారితో కలిసి కస్తూరిబాయి భవనం పత్రాలపై సంతకాలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి మనోహర్‌ ఆధ్వర్యంలో మహిళలకు మంచి జరుగుతుందనే నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకున్నామని కస్తూరిబాయి తెలిపారు.

తొమ్మిదో బిడ్డకు జన్మనిచ్చి తనువు చాలించిన తల్లి - అనాథలైన పిల్లలు - Woman Gives Birth Nine Babies

నెల రోజుల్లోపు అందుబాటులోకి : డాక్టర్‌ కస్తూరిబాయి, కోటేశ్వరరావు దంపతులు, కొసరాజు ఝాన్సీకుమారిని మంత్రి నాదెండ్ల మనోహర్​, అధికారులు ఘనంగా సత్కరించారు. భవనానికి మరమ్మతులు చేసి నెల రోజుల్లోపు అందుబాటులోకి తెస్తామని నాదెండ్ల తెలిపారు.

టవల్ చుట్టుకుని గర్భిణిగా నమ్మించింది- ప్రసవానికి ఆస్పత్రికి తీసుకెళ్తే డాక్టర్లు షాక్ - PREGNANT CHEATING

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.