ETV Bharat / state

రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు- 40డిగ్రీలు దాటొచ్చని వాతావరణశాఖ అంచనా

Temperatures Raising Extreme in AP: వేసవికాలం వచ్చిందంటే చాలు ఎండలు భరించలేక విలవిల్లాడిపోతాం. అసలు పూర్తి వేసవికాలం ఇంకా రాకముందే రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఈ ఉష్ణోగ్రతలు రానున్న నాలుగు రోజుల్లో దాదాపు 40 డిగ్రీల వరకూ నమోదు కావచ్చని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.

Temperatures Raising Extreme in AP
Temperatures Raising Extreme in AP
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 1, 2024, 5:28 PM IST

రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు- 40డిగ్రీలు దాటొచ్చని వాతావరణశాఖ అంచనా

Temperatures Raising Extreme in AP: వేసవికాలం ఇంకా పూర్తిగా రాకముందే ఉష్ణోగ్రత తీవ్రత అధికంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగినట్టు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో ఎక్కడికక్కడ ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగినట్టు వాతావరణశాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ జిల్లాల్లో సగటు ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల నుంచి 38 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. మార్చి 6 తేదీన అమరావతి ప్రాంతంలో దాదాపు 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే సూచనలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.

High Temperatures: భానుడి భగభగలు.. మరో 4 రోజులు ఇదే పరిస్థితి..!

Temperatures Extreme in All Districts: ప్రస్తుతం విజయవాడలో గరిష్టంగా 37 డిగ్రీలు, కాకినాడలో 38 డిగ్రీలు, విశాఖ 36 డిగ్రీలు, కర్నూలు 36 డిగ్రీలు, తిరుపతి 36 డిగ్రీలు, కడపలో 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నాయి. మార్చి ఆరో తేదీ నాటికి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగి 40 డిగ్రీలు దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. వచ్చే నాలుగైదు రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని వివరించింది. రానున్న రెండు మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల మేర పెరిగినట్టు ఐఎండీ స్పష్టం చేస్తోంది. రానున్న నాలుగైదు రోజుల పాటు ఏపీలోని ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వేడిమి, ఉక్కపోతతో కూడిన వాతావరణం నెలకొంటుందని ఐఎండీ స్పష్టం చేసింది. ఇది మార్చి 6 తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతల తీవ్రత 39 నుంచి 40 డిగ్రీల వరకూ నమోదయ్యే అవకాశముందని వాతావారణశాఖ అంచనా వేస్తోంది.

రాష్ట్రంలో ఠారెత్తిస్తున్న ఎండలు.. పల్నాడులో అత్యధికం

High temperatures in Telangana: తెలంగాణలో చాలా చోట్ల వేడిమి, ఉక్కపోత వాతావరణం నమోదు అవుతుందని వాతావరణశాఖ స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో వేసవి కాలం పూర్తిగా రాకముందే ఉష్ణోగ్రతలు పెరగడంతో వేడి వాతావరణంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. హైదరాబాద్ మినహా మిగతా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల మేర పెరిగినట్టు ఐఎండీ చెబుతోంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ, అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్​నగర్‌లో రానున్న నాలుగైదు రోజుల్లో ఉష్ణోగ్రతల తీవ్రత 39 డిగ్రీలకు చేరువవుతుందని అంచనా వేస్తున్నారు. ఏపీ, తెలంగాణాల్లో రాత్రి వేళల్లో సగటున 25 డిగ్రీల మేర ఉష్ణోగ్రత రికార్డవుతున్నట్లు వాతావరణశాఖ స్పష్టం చేస్తోంది.

డేంజర్ బెల్స్..! రుతుపవనాల మందగమనంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.