Telangana Transport Authority Actions on Non Tax Payers : రాష్ట్రవ్యాప్తంగా త్రైమాసిక పన్ను చెల్లించని వాహనదారుల వివరాలను రవాణా శాఖ అధికారులు సేకరించారు. ఇప్పటివరకూ సుమారు రూ.37 కోట్ల వరకు వాహనదారులు చెల్లించాల్సి ఉందని గుర్తించారు. దీంతో పన్ను చెల్లించకుండా రోడ్లపై తిప్పుతున్న వాహనదారులపై ప్రత్యేక దృష్టి సారించారు. వాహనదారులు పన్ను చెల్లించే గడువు జనవరి 31తో ముగియగా, మొదటి నెలలో వాహనదారులు పన్ను చెల్లిస్తే 25 శాతం, రెండో నెలలో చెల్లిస్తే 50 శాతం అదనపు పన్నుతో ఫీజు వసూలు చేయాలని రవాణా శాఖ నిర్ణయించింది.
అలా కాకుండా పన్ను చెల్లించకుండా వాహన తనిఖీల్లో దొరికితే, మొదటి నెలలో వంద శాతం జరిమానా, రెండో నెలలో దొరికితే 200 శాతం జరిమానా విధిస్తామని రవాణా శాఖ అధికారులు హెచ్చరించారు. అందుకే వాహనదారులు పన్నులను తక్షణమే చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తనిఖీల్లో దొరికితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే ఉండదని హెచ్చరిస్తున్నారు.
'ప్రభుత్వం ఆ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలి'
Vehicle Tax Revenue To Telangana Transport Authority : పన్నులు చెల్లించకుండా తిరుగుతున్న వాహనాలపై తనిఖీలు చేపట్టినట్లు రవాణా శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 220 వాహనదారుల నుంచి రూ.10 లక్షల 38 వేల 300 పన్నులను, రూ.4 లక్షల 69 వేల 320 కాంపౌండింగ్ ఫీజును వసూలు చేసినట్లు హైదరాబాద్ సంయుక్త రవాణా శాఖ అధికారి రమేశ్ తెలిపారు. సెంట్రల్ జోన్ పరిధిలో 76 కేసులు నమోదు కాగా, రూ.4 లక్షలకు పైగా పన్ను, లక్షా 84 వేల 20 కాంపౌండింగ్ ఫీజు వసూలు చేశారు. నార్త్ జోన్ పరిధిలో 52 కేసులు నమోదు కాగా, రూ.లక్షా 71 వేల 600 పన్ను, లక్షా 14 వేల 620 కాంపౌండింగ్ ఫీజు వసూలు చేశారు.
"మాములుగా రావాణా వాహనాలు క్వార్టర్లీ కానీ, హాఫ్ ఇయర్లీ కానీ పన్ను కట్టవచ్చు. ఆలస్యంగా కడితే దానిపై టాక్స్‌తో పాటు పెనాల్టీ పడుతుంది. అదే మేం తనిఖీలు చేసి వాహనాలను గుర్తిస్తే, ఈ నెల 100 శాతం, వచ్చే నెల 200 శాతం పెనాల్టీ పడుతుంది. ఇలా పెనాల్టీ పడకూడదు అంటే సకాలంలో ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి." - రమేశ్, హైదరాబాద్ సంయుక్త రవాణా శాఖ అధికారి
ELSS పెట్టుబడులతో పన్ను ఆదా- మంచి రిటర్న్స్- ఇంకెన్ని లాభాలో!
ఈస్ట్ జోన్ పరిధిలో 40 కేసులు నమోదు కాగా లక్షా 54వేల 180 పన్ను, రూ.79వేల 770 కాంపౌండింగ్ ఫీజు వసూలు చేశారు. సౌత్ జోన్ పరిధిలో 36 కేసులు నమోదు కాగాయ లక్షా 45వేల 880ల పన్నుగా, రూ.51వేల 430 కాంపౌండింగ్ ఫీజుగా వసూలు చేశారు. వెస్ట్ జోన్ పరిధిలో 16 కేసులు నమోదు కాగా లక్షా 65వేల 525 పన్నుగా, రూ.39వేల 480 కాంపౌండింగ్ ఫీజుగా వసూలు చేసినట్లు అధికారులు వివరించారు. తమ వద్ద డబ్బులు లేకపోవడంతోనే త్రైమాసిక పన్ను చెల్లించలేకపోతున్నామని వాహనదారులు చెబుతున్నారు. ఫీజులో రాయితీ కల్పిస్తే తమకు ఆర్థికంగా కొంత వెసులుబాటు కలుగుతుందని రవాణా శాఖకు విజ్ఞప్తి చేస్తున్నారు.
రాష్ట్ర ఖజానాకు తగ్గిన పన్నుల రాబడి - నెలలో రూ.1000 కోట్లు కోల్పోయిన సర్కార్
మార్చి నుంచి GPS విధానంలో టోల్ ఛార్జ్‌లు- ట్రాఫిక్‌ను తగ్గించేందుకే!