ETV Bharat / state

"అల పాపికొండల్లో విహరిద్దామా" - తక్కువ ధరలో తెలంగాణ టూరిజం అద్దిరిపోయే ప్యాకేజీ! - Hyderabad Papikondalu Tour - HYDERABAD PAPIKONDALU TOUR

Telangana Tourism: పాపికొండలు చూడాలని, గోదావరిలో బోట్​ రైడింగ్​ చేయాలని చాలా మంది అనుకుంటారు. అయితే పలు కారణాల వల్ల అది సాధ్యం కాకపోవచ్చు. అలాంటి వారి కోసం తెలంగాణ టూరిజం ఓ ప్యాకేజీని తీసుకొచ్చింది. ధర కూడా తక్కువే! మరి పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూడండి..

Papikondalu Tour
Telangana Tourism Hyderabad Papikondalu Tour (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 17, 2024, 3:44 PM IST

Telangana Tourism Hyderabad Papikondalu Tour: ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్​ అయిన పాపికొండలు చూడాలని అనుకుంటున్నారా..? గోదావరిలో బోట్ రైడింగ్ చేస్తూ.. ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకుంటున్నారా..? అయితే మీ కోసం తెలంగాణ టూరిజం(Telangana Tourism) స్పెషల్ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. అతి తక్కువ ధరలోనే ఈ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలను వీక్షించడం కోసం తెలంగాణ టూరిజం ఎన్నో ప్యాకేజీలను ఆపరేట్​ చేస్తుంది. ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టు అందుబాటు ధరలోనే ప్యాకేజీలను నిర్వహిస్తోంది. అంతేకాకుండా భోజనం, వసతి వంటి సౌకర్యాలు కూడా అందిస్తోంది. ఇప్పటికే పలు ప్రదేశాలకు ప్యాకేజీలను ఆపరేట్​ చేస్తున్న సంస్థ తాజాగా పాపికొండల్లో విహరిద్దామనుకునేవారి కోసం ఓ ప్యాకేజీ తీసుకొచ్చింది. మొత్తం ఈ టూర్​ మూడు రోజుల పాటు సాగనుంది. హైదరాబాద్​ నుంచి ప్రతి శుక్రవారం టూర్​ మొదలవుతుంది. రోడ్డు మార్గం ద్వారా జర్నీ ఉంటుంది. అదనంగా గోదావరిలో బోటింగ్ కూడా ఉంటుంది.

సూపర్ టూర్ : బొగత అందాలు చూడాలంటే ఇటు.. నాగార్జున సాగర్​ చూడాలంటే అటు.. తెలంగాణ టూరిజం ఒక్కరోజు ప్యాకేజీలు! - Bogatha Waterfalls Tour Package

ప్రయాణం ఇలా: పాపికొండలు చూసేందుకు తెలంగాణ టూరిజం PAPIKONDALU ROAD CUM RIVER CRUISE PACKAGE TOUR పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.

  • మొదటి రోజు రాత్రి 07.30 గంటలకు హైదరాబాద్ లోని పర్యాటక భవన్ నుంచి, రాత్రి 8 గంటలకు బషీర్​బాగ్​ నుంచి బస్సు జర్నీ ద్వారా పాపికొండలు టూర్​ స్టార్ట్​ అవుతుంది. రాత్రంతా జర్నీ ఉంటుంది. మార్గ మధ్యలో భోజనం సదుపాయం ఉంటుంది.
  • రెండో రోజు ఉదయం 6 గంటలకు భద్రాచలంలోని హారిత హోటల్​కు చేరుకుంటారు. ఫ్రెషప్​ అండ్​ బ్రేక్​ఫాస్ట్​ తర్వాత 8 గంటలకు పోచారం బోటింగ్ పాయింట్​కు చేరుకొని.. అక్కడి నుంచి పాపికొండలతో పాటు పెరంటాలపల్లికి వెళ్తారు. పోచారానికి బోట్​లో జర్నీ ఉంటుంది. లంచ్​తో పాటు స్నాక్స్ ఇస్తారు. రాత్రి భద్రాచలంలోని హారిత హోటల్​లో బస చేస్తారు.
  • మూడో రోజు బ్రేక్ ఫాస్ట్​ చేసిన తర్వాత పర్ణశాలకు వెళ్తారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత తిరిగి హైదరాబాద్​కు స్టార్ట్​ అవుతారు. రాత్రి 10 గంటలకు హైదరాబాద్​ చేరుకోవడంతో టూర్​ కంప్లీట్​ అవుతుంది.

పాపికొండలు టూర్ ప్యాకేజీ ధరలు: హైదరాబాద్ - పాపికొండలు టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే పెద్దలకు.. 6,999రూపాయలుగా నిర్ణయించారు. పిల్లలకు 5,599 రూపాయలుగా ఉంది. అలాగే నాన్ ఏసీ బస్సులో జర్నీ ఉంటుంది. బోట్​లో భోజనం ఇస్తారు. ఈ ప్యాకేజీకి సంబంధించిన వివరాలు, బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

ఊటీ సూపర్ టూర్ - బడ్జెట్​ ధరలోనే తెలంగాణ టూరిజం కొత్త ప్యాకేజీ! - మరికొన్ని ప్రదేశాలు కూడా! - Telangana Tourism Mysore Tour

వీకెండ్​ టూర్​: ఒక్కరోజులోనే 4 ప్రదేశాలు - తక్కువ ఖర్చుతో తెలంగాణ టూరిజం స్పెషల్​ ప్యాకేజీ! - Telangana Tourism Weekend Tour

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.