Telangana TET 2024 Last Date for Application: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET) 2024కు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకో అలర్ట్. తెలంగాణ టెట్ ఆన్లైన్ అప్లికేషన్ల గడువు ఇవాళ్టి(ఏప్రిల్ 20)తో ముగియనుంది. అర్హత గల అభ్యర్థులు ఎవరైనా ఉంటే వెంటనే అప్లయ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. మరోసారి గడువు పెంచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అయితే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం…ఏప్రిల్ 10వ తేదీనే ముగియాల్సి ఉంది. కానీ పలువురి నుంచి వచ్చిన విజ్ఞప్తుల ఆధారంగా ఈ తేదీని ఏప్రిల్ 20 వరకు పొడిగించారు. ఫలితంగా ఇవాళ్టితో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తి అవుతుంది.
నోటిఫికేషన్ ముఖ్య వివరాలు:
- దరఖాస్తులు ప్రారంభం తేదీ: మార్చి 27, 2024
- దరఖాస్తులకు చివరితేది : ఏప్రిల్ 20, 2024
- హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ ప్రారంభం: మే 15 నుంచి
- పరీక్షల తేదీలు : మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరుగుతుంది.
- పరీక్షల ఫలితాల విడుదల తేదీ: జూన్ 12, 2024
How to Apply TS TET 2024:
- అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్లోకి వెళ్లాలి. https://schooledu.telangana.gov.in
- పేమెంట్ ఆప్షన్‌పై క్లిక్ చేసి ఫీజును చెల్లించాలి. ఈ ప్రక్రియ పూర్తి అయితేనే అప్లికేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
- ఫీ పేమెంట్ తర్వాత హోం పేజీలో కనిపించే Application Submission అనే లింక్ పై నొక్కాలి. ఇక్కడ మీ వివరాలను ఎంటర్ చేసుకోవాలి.
- ఫొటో, సంతకం తప్పనిసరిగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
- అన్ని వివరాలనూ ఎంట్రీ చేశాక చివర్లో ఉండే సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేస్తే అప్లికేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది.
- 'Print Application' అనే ఆప్షన్ పై నొక్కితే మీ అప్లికేషన్ కాపీనీ డౌన్లోడ్ లేదా ప్రింట్ తీసుకోవచ్చు.
వారికో అప్డేట్: ఇక ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కూడా విద్యాశాఖ అప్డేట్ ఇచ్చింది. అభ్యర్థులు ఇప్పటికే సమర్పించిన దరఖాస్తులో ఏమైనా తప్పులు ఉంటే సవరించుకునే అవకాశాన్ని కల్పిస్తూ వెబ్‌సైట్‌లో ఎడిట్ (TS TET 2024 Application Edit option) ఆప్షన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆప్షన్‌ను ఉపయోగించుకోని వెంటనే ఎడిట్ చేసుకోవాలని.. ఈ గడువు కూడా ఏప్రిల్ 20వ తేదీతోనే క్లోజ్ కానుందని స్పష్టం చేశారు. ఒక్కసారి ఎడిట్ చేసి సబ్మిట్ చేస్తే.. మరోసారి ఎడిట్ చేసుకునేందుకు అవకాశం ఉండదని వివరించారు. ఏప్రిల్ 11 నుంచి ఈ ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది.
How to Edit TET 2024 Application:
- అభ్యర్థి అప్లికేషన్ ఎడిట్ చేసుకోవడానికి మొదట https://schooledu.telangana.gov.in/ISMS/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
- హోం పేజీలో Edit Application అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- అక్కడ Journal Number/Payment Reference ID, Date of Birth ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.
- అప్పుడు అభ్యర్థి అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అందులో వివరాలను ఎడిట్ చేసుకోవచ్చు.
- చివరగా సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ ఎడిట్ పూర్తి అవుతుంది.