ETV Bharat / state

ఆర్టీసీ కాలం చెల్లిన బస్సులకు ఇక చెల్లు - 1500ల కొత్త బస్సుల కొనుగోలుకు ప్రయత్నాలు - tsrtc buy 1500 new buses soon - TSRTC BUY 1500 NEW BUSES SOON

RTC Purchase New Buses 2024 : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. వాటికి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లను రవాణాశాఖ పునరుద్ధరించడం లేదు. దీంతో ఆర్టీసీ 1500ల కొత్త బస్సుల కొనుగోలుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

New RTC Buses in Telangana
TSRTC Bring New RTC Buses
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 28, 2024, 11:22 AM IST

TSRTC Buy 1500 New Buses Soon : రవాణా రంగంలో వస్తోన్న మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ టీఎస్​ఆర్టీసీ వినూత్న పద్ధతుల ద్వారా ప్రయాణికులకు చేరువవుతోంది. ఇందులో భాగంగానే ప్రయాణికుల సౌకర్యార్థం సుమారు 1500ల కొత్త బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు ఆర్టీసీలో కాలం చెల్లని బస్సులు పెరుగుతుండటంతో తరుచూ మొరాయిస్తున్నాయి.

TSRTC Buying New Buses 2024 : దీనికి తోడూ కాలం చెల్లిన బస్సుల నిర్వహణ వ్యయం కూడా పెరుగుతుంది. వీటి నుంచి వచ్చే పొగ వల్ల కాలుష్యమూ పెరుగుతోంది. పదిహేనేళ్ల జీవితకాలం దాటిన బస్సులను గ్రేటర్‌ హైదరాబాద్‌లో తిప్పేందుకు రవాణాశాఖ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఈ పరిణామాలు, సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ యాజమాన్యం వీటి స్థానంలో కొత్తవి ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. సుమారు 1500 బస్సుల కొనుగోలు చేసేందుకు ఆర్టీసీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు అవన్నీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌లే అని సమాచారం.

ఆదాయం పెంచుకోవడంపై టీఎస్‌ఆర్టీసీ ఫోకస్ - రోజుకు కోటి పెరిగేలా కార్యాచరణ! - TSRTC on Revenue

ఆర్థిక ఇబ్బందులతో ఆలస్యం : గడిచిన కొన్ని సంవత్సరాల్లో టీఎస్​ఆర్టీసీకి వచ్చిన ఆదాయానికి, అయిన ఖర్చుకు భారీగా అంతరం ఉంది. ఒకవైపు ప్రయాణికులు తగ్గడం మరోవైపు వేతనాలు, డీజిల్‌ వ్యయం పెరగడం దీర్ఘకాలం జరిగిన సమ్మె వంటి అంశాలతో నష్టాలు భారీగా పెరిగాయి. వాటిని పూడ్చుకునేందుకు యాజమాన్యం కొంతకాలంగా ప్రయత్నిస్తోంది. గతంలో వేతనాలూ ఆలస్యమయ్యేవి. ప్రస్తుతం ఒకటో తేదీకే వస్తున్నాయి. అయితే అప్పులు, కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు, పీఎఫ్‌, సీసీఎస్‌ చెల్లింపుల రూపంలో రూ.వేల కోట్ల ఆర్థికభారం అలాగే ఉంది. ఈ స్థితిలో ఎప్పటికప్పుడు కొత్త బస్సులు ప్రవేశపెట్టడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

అద్దెకు తీసుకొని సర్దుబాటు : ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో వీలైనంత మేరకు అద్దె పద్ధతిలో ఎలక్ట్రిక్‌ బస్సులను టీఎస్​ఆర్టీసీ తీసుకుంటోంది. జిల్లాల్లో ఒక్కో బస్సు రోజుకు 400-450 కిలోమీటర్లు తిరుగుతాయి. గ్రేటర్‌లో ట్రాఫిక్‌ సమస్యలతో సగటున 220 కిలోమీటర్లు మాత్రమే తిరిగే పరిస్థితులున్నాయి. జిల్లాల్లో 10, 12 లక్షల కిలోమీటర్లకి పైగా తిరిగిన బస్సులను హైదరాబాద్‌కు తీసుకువస్తున్నారు. 15 లక్షల కిలోమీటర్లు దాటినవి కూడా తిరుగుతున్నట్లు తెలుస్తోంది.

అయితే జీవిత కాలం 15 సంవత్సరాలు దాటిన వాటికి రవాణా శాఖ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ పునరుద్ధరించట్లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్టీసీ వీటిని పక్కనపెట్టాల్సి వస్తోంది. 2024 మార్చి వరకు ఇలా సుమారు 200 బస్సుల్ని ఆర్టీసీ పక్కన పెట్టింది. వీటి స్థానంలో సొంతంగా కొత్తవి కాకుండా అద్దె ప్రాతిపదికన ఎలక్ట్రిక్‌ బస్సులు తీసుకుంది. 2025 మార్చి వరకు దాదాపు 1300 బస్సుల జీవితకాలం పదిహేనేళ్లు దాటనుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీటి స్థానంలో కొత్తవి కొనేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందుకోసం బ్యాంకు రుణాలు సంపాదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

రానున్న రోజుల్లో 2515 బస్సులకు అందుబాటులోకి తీసుకువస్తాం : సజ్జనార్​

ఆర్టీసీ డ్రైవర్​పై ప్రయాణికుడి దాడి - బస్సులు తీసేదే లేదంటూ ధర్నాకు దిగిన సిబ్బంది - RTC Drivers Protest in Vikarabad

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.