ETV Bharat / state

ఫోన్‌ ట్యాపింగ్‌లో కొత్త కోణాలు - పోలీసులే సాక్షులు, వారి వాంగ్మూలాలే ఆధారాలు - TS Phone Tapping Case - TS PHONE TAPPING CASE

Telangana Phone Tapping Case Updates : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులే సాక్షులుగా వారి వాంగ్మూలాలే ఆధారాలుగా మారాయి. ఎస్‌ఐబీ, టాస్క్‌ఫోర్స్‌ల్లో పనిచేసిన సిబ్బంది విచారణలో కీలకమైన విషయాలను దర్యాప్తు బృందం రాబట్టింది. కంప్యూటర్ హార్డ్‌ డిస్క్‌ల ధ్వంసంతో ప్రత్యామ్నాయాల సేకరణపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు.

Telangana Phone Tapping Case Updates
Telangana Phone Tapping Case Updates
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 14, 2024, 6:56 AM IST

ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులే సాక్షులు వారి వాంగ్మూలాలే ఆధారాలు

Telangana Phone Tapping Case Updates : ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు కీలకమైన హార్డ్‌ డిస్క్‌లను ధ్వంసం చేయడంతో ప్రత్యామ్నాయ ఆధారాల సేకరణపై దర్యాప్తు బృందం దృష్టి సారించింది. గతంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్‌తో పాటు హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసిన క్షేత్రస్థాయి పోలీసుల నుంచి వాంగ్మూలాలు సేకరించే పనిలో నిమగ్నమైంది.

Task Force EX OSD Radhakishan Rao Case : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచిన సమయంలో ఎస్ఐబీలో పనిచేసిన ఇన్స్‌పెక్టర్లు, ఎస్సైలు, ఇతర సిబ్బందితో వాంగ్మూలాలు సేకరిస్తోంది. అలాగే క్షేత్రస్థాయి ఆపరేషన్లు, నగదు అక్రమ రవాణా తదితర అంశాలపై గట్టుమల్లు సహా ఇతర పోలీసుల వాంగ్మూలాలనే బలమైన సాక్ష్యాధారాలుగా మలిచే అంశంపై దర్యాప్తు అధికారులు దృష్టి పెట్టారు. ఇప్పటికే దాదాపు 35 మంది నుంచి వాంగ్మూలాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుతోపాటు టాస్క్‌ఫోర్స్‌ మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌రావుల (Task Force Radhakishan Rao Case) ఆధ్వర్యంలో ఎలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడ్డారని ఈ వాంగ్మూలాల ద్వారా తేట తెల్లమైనట్లు తెలుస్తోంది. వీటినే సాక్ష్యాధారాలుగా న్యాయమూర్తి ముందు పెట్టనున్నట్లు సమాచారం.

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నమ్మలేని నిజాలు - నల్గొండలో వార్‌ రూమ్‌ ఏర్పాటు చేసి మరీ బెదిరింపులు! - PHONE TAPPING CASE latest upadates

Praneeth Rao Phone Tapping Case : గత ప్రభుత్వంలో ఎస్ఐబీ చీఫ్‌గా ప్రభాకర్‌రావు, టాస్క్‌ఫోర్స్ ఓఎస్టీగా రాధాకిషన్‌రావులు ఆడిందే ఆటగా సాగినట్లు అధికారులు గుర్తించారు. అక్రమమని తెలిసినా రాజకీయ నేతల ఫోన్ల ట్యాపింగ్ యథేచ్ఛగా సాగిపోయిందని, ఆ ఇద్దరూ బాస్‌లు కావడంతో వారి ఆదేశాలను క్షేత్రస్థాయి సిబ్బంది తూచా తప్పకుండా పాటించక తప్పలేదని వారి వాంగ్మూలాలను బట్టి తెలుస్తోంది. గతంలో ఎస్ఐబీలో పనిచేసి ప్రసుత్తం సీఐడీలో ఉన్న ఓ ఇన్స్‌పెక్టర్‌ వాంగ్మూలాన్ని సైతం దర్యాప్తు బృందం సేకరించింది. ఆయన ఎస్ఐబీలో ఉన్నప్పుడు ప్రభాకర్‌రావు ప్రణీత్‌రావుల సూచనల మేరకు అనధికారిక నిఘా ఎలా కొనసాగిందో దర్యాప్తు బృందానికి కూలంకషంగా వివరించినట్లు సమాచారం.

ఇతర పార్టీల నగదు అక్రమ తరలింపుపై ఫోకస్ : టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు నేతృత్వంలో ఇతర రాజకీయ పార్టీల నగదు అక్రమ తరలింపును అడ్డుకుని, ఎలా జప్తు చేశారనేది వెల్లడించినట్లు సమాచారం. గతంలో టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసి ఇప్పుడూ అక్కడే ఉన్న మరో ఇన్స్‌స్పెక్టర్‌ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. రాధాకిషన్‌రావు ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి సిబ్బందితో కలిసి ఎనిమిది సార్లు ఇతర రాజకీయ పార్టీల నగదు అక్రమ తరలింపును ఎలా పట్టుకోగలిగామనే విషయాన్ని విచారణలో వెల్లడించారు.

సొంత అవసరాలకు ఫోన్ ట్యాపింగ్ - ప్రణీత్ టీమ్ ప్రైవేట్ దందా మామూలుగా లేదుగా! - Telangana Phone Tapping Case

రాధాకిషన్‌రావు తనను ఎలా ఏమార్చారనే అంశాన్ని టాస్క్‌ఫోర్స్‌ ఎస్సై ఒకరు పూసగుచ్చినట్లు దర్యాప్తు బృందానికి వివరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డికి సంబంధించిన నగదును ఎలా తరలించారు, ఓ ప్రముఖ ఆసుపత్రిలో విశ్రాంత ఎస్పీకి డబ్బులు ఎలా చేర్చారనే విషయాలు వెల్లడించారు. ప్రభాకర్‌రావు ఆదేశాలతో ప్రణీత్‌రావు బృందం (SIB EX DSP Praneeth Rao Case) గులాబీ పార్టీ ప్రత్యర్థి నేతలకు చెందిన నగదు రవాణా సమాచారాన్ని పసిగట్టడం, దాన్ని రాధాకిషన్‌రావుకు చేరవేయడం, వెంటనే టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి పట్టుకోవడంఇదీ ఫోన్‌ ట్యాపింగ్ దందా సాగిన తీరు. ప్రతిపక్ష పార్టీల నేతలకు ఆర్థిక వనరులు అందకుండా అడ్డుకోవడం ద్వారా భారత్ రాష్ట్ర సమితి అభ్యర్థులను గెలిపించే లక్ష్యంతోనే ఇలా అడ్డదారిలో నిఘా అమలుపరిచినట్లు రాధాకిషన్‌రావు విచారణలో తేటతెల్లమైంది.

8 ఉదంతాల్లో రూ.10.41 కోట్ల స్వాధీనం : 2018 ఎన్నికల సమయంలో రాంగోపాల్ పేట ఠాణా పరిధిలో రూ.70 లక్షలు, దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో బేగంపేటలో కోటి రూపాయలు, మునుగోడు ఉపఎన్నిక సమయంలో గాంధీనగర్‌లో మూడున్నర కోట్లు, అసెంబ్లీ ఎన్నికల వేళ గత ఏడాది అక్టోబరులో బంజారాహిల్స్‌లో రూ.3.35 కోట్లు, గాంధీనగర్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రూ.22 లక్షలు, నగరంలోని మరోచోట రూ.15 లక్షలు, నారాయణగూడ ఠాణా పరిధిలో మరో రూ.49 లక్షలు, భవానీనగర్‌లో కోటి రూపాయలు ఇలా ఎనిమిది ఉదంతాల్లో ప్రత్యర్థి పార్టీలకు చెందిన రూ.10.41 కోట్ల నగదు రవాణాను అడ్డుకోగలినట్లు రాధాకిషన్‌రావు తన వాంగ్మూలంలో వెల్లడించారని విశ్వసనీయ సమాచారం.

'రాజకీయ నాయకులు, ఇతర వ్యక్తుల ఫోన్లపై నిఘా పెట్టారు' - Telangana Phone Tapping Case Update

నా ఫోన్​ ట్యాప్​ చేసి రూ.కోట్లు వసూలు చేశారు - రాధాకిషన్​రావుపై రియల్​ ఎస్టేట్ వ్యాపారి ఫిర్యాదు - phone tapping case updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.