Telangana Phone Tapping Case Updates : తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలకు కోర్టు ఈ నెల 6 వరకు రిమాండ్ విధించింది. ఎస్ఐబీలో హార్డ్‌డిస్క్‌లు ధ్వంసం చేసిన విషయంలో ఇద్దరు పోలీసు అధికారుల పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. నిందితులిద్దరి పోలీస్ కస్టడీ నేటితో ముగియడంతో, వైద్య పరీక్షల నిమిత్తం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తీసుకువచ్చారు.
సీనియార్టీ ఉందని నర్సును సర్జన్ చేస్తారా? - ప్రవీణ్‌ప్రకాశ్ తీరుపై హైకోర్టు అసంతృప్తి
ఆస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తైన అనంతరం వారిని కొంపల్లిలో న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. అనంతరం కోర్టు అదనపు ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావులకు ఈ నెల 6 వరకు రిమాండ్ విధించడంతో వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. నిందితుల నుంచి కీలక సమాచారం సేకరించిన దర్యాప్తు బృందం, వారిచ్చిన సమాచారంతో మరి కొందరిని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరో వైపు మాజీ డీసీపీ రాధాకిషన్ రావును 10 రోజుల కస్టడీకి కోరుతూ వేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది.