Telangana Phone Tapping Case Update : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ప్రధాన నిందితుడు ప్రణీత్‌రావును విచారిస్తున్న పోలీసులకు కీలక వివరాలు లభ్యమయ్యాయి. హార్డ్ డిస్క్‌లను డిసెంబరు 4న మూసీలో పడేసినట్లు ప్రణీత్‌రావు వెల్లడించారు. అలాగే భుజంగరావు, తిరుపతన్న రిమాండ్ నివేదికలో నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఇంకా రిమాండ్ రిపోర్టులో అనేక విషయాలను పోలీసులు పొందుపరిచారు.
డిసెంబరు 4వ తేదీన మూసీ నదిలో హార్డ్‌డిస్కులను పడేసినట్లు ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారంతో నాగోలు వద్ద మూసీలో హార్డ్ డిస్క్ శకలాలను పోలీసులు సేకరించారు. మూసీ వద్ద 5 హార్డ్ డిస్క్ కేసులు, 9 హార్డ్‌డిస్క్ ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే మూసీలోనే 6 మెటల్ హార్డ్ డిస్క్ ముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఎస్ఐబీ(SIB) కార్యాలయంలోనూ పోలీసులు పలు ఆధారాలు సేకరించారు. ఎస్ఐబీ కార్యాలయంలో 12 కంప్యూటర్లు, 7 సీపీయూలు, ప్రణీత్‌రావు బృందం వాడిన ల్యాప్‌టాప్, మానిటర్లను స్వాధీనం చేసుకున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో బయటపడుతున్న షాకింగ్ విషయాలు - టాస్క్‌ఫోర్స్ వాహనాల్లో ఎన్నికల డబ్బు తరలింపు
అలాగే ఎస్ఐబీ కార్యాలయం ఆవరణలో పాక్షికంగా కాలిన డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యాలయం సీపీ ఫుటేజీ, లాగ్‌బుక్ ప్రతులను సేకరించారు. ఎస్ఐబీ కానిస్టేబుల్ నరేశ్ వాంగ్మూలం పోలీసులు నమోదు చేసుకున్నారు. విపక్ష అభ్యర్థుల డబ్బుల పంపిణీపై నిఘా పెట్టినట్లు తెలిపారు. ప్రైవేటు వ్యక్తులపై అక్రమంగా భుజంగరావు, తిరుపతన్న నిఘా పెట్టినట్లు వెల్లడించారు.
Radha Krishnarao on Phone Tapping Case : అంతకు ముందు టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు కస్టడీ పిటిషన్(Radhakishan Rao Custody Petition)పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు బుధవారం తీర్పును వెలువరించనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నకు ఐదు రోజుల పోలీసు కస్టడీ ముగిసింది. వీరికి ఈ నెల 6 వరకు రిమాండ్‌ను నాంపల్లి కోర్టు విధించింది. దీంతో ఇద్దరు నిందితులనూ చంచల్‌గూడ జైలుకు పోలీసులు తరలించారు. వీరిద్దరినీ ఐదు రోజులు విచారించిన పోలీసులు వారి నుంచి కేసుకు సంబంధించిన వివరాలను రాబట్టినట్లు సమాచారం. ఉన్నతాధికారులు చెప్పినట్లే చేశామని వారిద్దరూ పోలీసుల కస్టడీలో వెల్లడించినట్లు తెలుస్తోంది.
నాటి అధికార పార్టీ సుప్రీమ్ ఆదేశాల మేరకే- రాధాకిషన్‌రావు రిమాండ్ రిపోర్డులో కీలక విషయాలు
ఎన్నికల డబ్బు పంపిణీ వైపు మళ్లుతోన్న ఫోన్ ట్యాపింగ్ కేసు - త్వరలోనే ఆ రాజకీయ ప్రముఖులకు నోటీసులు!