ETV Bharat / state Telangana News > Telangana News Live Updates: Telangana Latest News in Telugu - 8 September 2024 

Telangana News Today Live : తెలంగాణ Sun Sep 08 2024 లేటెస్ట్‌ వార్తలు- ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం - యువకుడి ట్రాప్‌లో బాలిక - కట్​చేస్తే హోటల్​ గదిలో 20 రోజులుగా బందీ - Girl Captive in the Hotel Room

author img

By Telangana Live News Desk

Published : Sep 8, 2024, 7:20 AM IST

Updated : Sep 8, 2024, 10:00 PM IST

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

09:57 PM, 08 Sep 2024 (IST)

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం - యువకుడి ట్రాప్‌లో బాలిక - కట్​చేస్తే హోటల్​ గదిలో 20 రోజులుగా బందీ - Girl Captive in the Hotel Room

Girl Captive in the Hotel Room : హైదరాబాద్​ నగరంలో దారుణం వెలుగు చూసింది. నిర్మల్‌ జిల్లా భైంసాకు చెందిన బాలికను నగరంలోని ఓ హోటల్‌ గదిలో 20 రోజులుగా ఓ యువకుడు బంధించాడు. సమాచారం తెలుసుకున్న షీ టీమ్‌ సిబ్బంది ఆదివారం సాయంత్రం బాలికను రక్షించారు. అనంతరం నిందితుడిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - YOUNG MAN TRAPPED MINOR GIRL

09:52 PM, 08 Sep 2024 (IST)

రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్​ విష ప్రచారం చేస్తోంది : తుమ్మల - Minister Thummala On loan waiver

Minister Thummala On loan waiver : రుణమాఫీ, రైతు భరోసాపై స్పష్టమైన విధానంతో ముందుకెళ్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసిన వడ్డీమాఫీ పథకాన్ని ప్రస్తావించే ధైర్యంలేక తమ ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీపై అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తూ రైతులను ఆందోళనకు గురిచేస్తున్నారని బీఆర్ఎస్ నేతలపై తుమ్మల మండిపడ్డారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - MINISTER THUMMALA FIRES ON BRS

09:02 PM, 08 Sep 2024 (IST)

దూకుడు పెంచిన హైడ్రా - కూల్చివేతలపై అధికారులతో బాధితుల వాగ్వాదం - HYDRA DEMOLITIONS

Hydra Demolitions : హైడ్రా కూల్చివేతలతో బాధితులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేస్తున్నారంటూ రోదిస్తున్నారు. మార్క్ చేసిన భవనాలను ఖాళీ చేసేందుకు అధికారులు గంట సమయం ఇవ్వడంపై, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, జీహెచ్​ఎంసీ, హైడ్రా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - VICTIMS FIGHT WITH HYDRA OFFICERS

08:06 PM, 08 Sep 2024 (IST)

ఖమ్మం జిల్లాలో ఇంకా జలదిగ్బంధంలో ఇళ్లు, పంటపొలాలు - Flood Effect In Khammam

Flood Effect In Khammam : ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో వర్షం మరోసారి దంచికొడుతోంది. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వైరా జలాశయానికి భారీగా వరదనీరు చేరడంతో 20 అడుగుల పూర్తిస్థాయి నీటి నిల్వ ఉంది. మధిర నియోజకవర్గం చింతకాని, ముదిగొండ మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటించారు. మెదక్‌, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో ఇద్దరు మహిళలు మృతి చెందారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - BHATTI KHAMMAM VISIT

07:49 PM, 08 Sep 2024 (IST)

బుడమేరు వరద ఉద్ధృతి తగ్గడంతో కోలుకుంటున్న బెజవాడ - సహాయ చర్యలు ముమ్మరం - Vijayawada Recovering From floods

Vijayawada Floods Effect 2024 : బుడమేరు ఉద్ధృతితో వారం రోజులుగా ముంపులో ఉన్న విజయవాడ కాలనీలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. నీరు తగ్గిన కాలనీల్లో ప్రభుత్వం పారిశుద్ధ్యం, విద్యుత్‌ పునరుద్ధరణ పనులను ముమ్మరం చేసింది. వైద్య సేవలను యుద్ధ ప్రాతిపదికన అందిస్తోంది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - BUDAMERU WORKS COMPLETED

07:39 PM, 08 Sep 2024 (IST)

నిబంధనలు ఉల్లంఘిస్తే డ్రైవింగ్ లైసెన్స్​ రద్దు చేస్తాం : పొన్నం - Minister Ponnam On Road Accidents

Minister Ponnam On Motor Vehicle Act : రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రత్యేక నిబంధనలు తీసుకుస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్​ తెలిపారు. ఈమేరకు కేంద్ర రవాణా చట్టానికి అనుబంధంగా మరిన్ని సంస్కరణలు చేయాలని రాష్ట్ర సర్కార్​ భావిస్తోందన్నారు. లక్డీకపూల్​లోని జరిగిన తెలంగాణ రవాణా శాఖ సాంకేతిక అధికారుల సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు చేశారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - MOTOR VEHICLE ACT IMPLEMENTATION

07:41 PM, 08 Sep 2024 (IST)

'కేటీఆర్‌ ఇక నుంచైనా నిజాలు తెలుసుకుని మాట్లాడండి' - ఎంపీ చామల కిరణ్‌ కౌంటర్ - MP Chamala Fires on KTR

Chamala Kiran Kumar Reddy on Tweet : కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి ఖండించారు. ప్రభుత్వం గురించి తప్పుడు ట్వీట్‌ చేశారని ఆరోపించారు. నిజానిజాలు తెలుసుకోకుండా ట్వీట్‌ చేయడం సరికాదని, ఇకనుంచి ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు తెలుసుకొని చెప్పాలని సూచించారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - MP CHAMALA FIRES ON KTR

07:37 PM, 08 Sep 2024 (IST)

ప్రభుత్వంపై హరీశ్​రావు విషప్రచారాలు మానుకోవాలి : విప్ ఆది శ్రీనివాస్ - VIP Aadi Srinivas Slams Harishrao

VIP Aadi Srinivas Slams Harishrao : రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉన్నారని, హరీశ్​రావు దుఃఖంలో మునిగిపోయారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. రుణమాఫీ అవుతుందన్న బెంగతో హరీశ్​రావుకు కన్నీళ్లు ఆగడం లేదని ఆయన ఆరోపించారు. రైతులను రెచ్చగొట్టడమే హరీశ్​రావు పనిగా మారిందని, రుణమాఫీపై విషప్రచారాలు చేయడం మానుకోవాలని తెలిపారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - VIP AADI SRINIVAS FIRES ON BRS

06:54 PM, 08 Sep 2024 (IST)

ఈ బొజ్జగణపయ్యలు కాస్త డిఫరెంట్ - మీరూ చూసేయండి - Variety Ganesh Idols In Warangal

Variety Ganesh Idols In Warangal : పర్యావరణ పరిరక్షణలో మేముసైతం అంటూ మట్టిగణపతులను పూజిస్తూ ముందుకు సాగుతున్నారు వరంగల్ వాసులు. నగరంలో ఏర్పాటు చేసిన మర్రిఊడల వినాయకుడు, డ్రైఫూట్స్​, గులాబీలు తదితర పర్యావరణ హితమైన వాటితో గణేశ్​ విగ్రహాలను తయారు చేసి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. మరి వాటి ప్రత్యేకతలేంటో తెలుసుకుందామా? | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - VARIETY GANESH IDOLS IN WARANGAL

06:28 PM, 08 Sep 2024 (IST)

ఉత్తరాంధ్రలో హై అలర్ట్ - విశాఖలో విరిగిపడుతున్న కొండచరియలు - Red Alert Issued In North Andhra

Heavy Rainfall in Andhra Pradesh : ఏపీకి వాన గండం ఇప్పట్లో తప్పేలా కనిపించడం లేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే కృష్ణా జిల్లా అతలాకుతలం అయ్యింది. తాజాగా వరుణుడు ఉత్తరాంధ్ర వైపు కదులుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. రాబోయో రెండురోజుల్లో ఉత్తరాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయంటూ, వాతావరణ శాఖ రెడ్ అలర్డ్ జారీ చేసింది. అటు విశాఖలో విరిగిపడుతున్న కొండచరియలతో స్థానికులు భయం గుప్పిట్లో ఉన్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - HEAVY RAINFALL IN ANDHRA PRADESH

05:26 PM, 08 Sep 2024 (IST)

బాలికను గర్భవతి చేసిన ముగ్గురు యువకులు- ఒకరికి తెలియకుండా మరొకరు అత్యాచారం - Minor Girl Rape in Siddipet

Minor Girl Rape in Siddipet : అభంశుభం తెలియని 9వ తరగతి అమ్మాయిని ముగ్గురు వ్యక్తులు ఒకరికి తెలియకుండా మరొకరు అత్యాచారం చేసి గర్భవతిని చేసిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. తల్లి ఫిర్యాదు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - MINOR GIRL RAPE IN SIDDIPET

03:54 PM, 08 Sep 2024 (IST)

వరద బాధితులకు అండగా కదిలొచ్చిన కాంగ్రెస్ నేతలు - 2 నెలల వేతనం విరాళంగా ప్రకటన - Congress Donates to Flood Victims

Congress Donates to Help Flood Victims : రాష్ట్రంలో వరద బాధితుల సహాయార్థం కాంగ్రెస్ విరాళం ప్రకటించింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్‌ ఛైర్మన్లు, ప్రభుత్వ సలహాదారులు అందరూ కలసి తమ 2 నెలల జీతాన్ని వరద బాధితుల సహాయనిధికి అందజేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ సూచనల మేరకు విరాళం ప్రకటించారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - FLOOD DONATIONS IN TELANGANA

03:50 PM, 08 Sep 2024 (IST)

పీసీసీ అధ్యక్షుడి ప్రకటన ఎప్పుడో జరగాల్సింది - ఎందుకు ఆలస్యం అయ్యిందంటే! - PCC President Selection Issue

Role of AICC in selection of PCC President : రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉండడంతో పీసీసీ అధ్యక్షుడి ఎంపిక విషయమై స్వయాన ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీనే ఆశావహుల జాబితాను స్క్రీనింగ్‌ చేసినట్లు తెలుస్తోంది. బీసీకే పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయం తీసుకున్న తరువాత కూడా మహేశ్ కుమార్‌ గౌడ్‌ను రెండు సార్లు దిల్లీ పిలిపించి స్వయంగా రాహుల్​ గాంధీనే మాట్లాడినట్లు సమాచారం. పీసీసీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న ఇద్దరు నాయకులు గట్టి పోటీ ఇస్తుండడంతో ఎంపిక విషయంలో ఆచితూచి ముందుకు వెళ్లినట్లు ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. గత నెలలోనే పీసీసీ అధ్యక్షుడి నియామకం జరగాల్సి ఉండగా తీవ్ర జాప్యం జరిగింది. జాప్యానికి కారణాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - TPCC NEW PRESIDENT

03:45 PM, 08 Sep 2024 (IST)

హైదరాబాద్‌లోని మళ్లీ వర్షం - ప్రధాన ప్రాంతాల్లో దంచి కొడుతున్న వాన - Heavy Rainfall in Hyderabad

Heavy Rain in Hyderabad : హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి మేఘావృత్తమై ఉన్న వాతావరణం ఇప్పుడు వాన పడుతోంది. ప్రధాన ప్రాంతాలైన కోఠీ, అబిడ్స్, బంజారాహిల్స్, అమీర్‌పేట్, సనత్‌నగర్‌, మియాపూర్ చందానగర్, మాదాపూర్‌ గచ్చిబౌలి, రాయదుర్గం, జూబ్లీహిల్స్ వర్షం దంచి కొడుతుంది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - HEAVY RAINFALL IN HYDERABAD

03:26 PM, 08 Sep 2024 (IST)

ప్రత్యేక ఆకర్షణగా బాలాపూర్ గణేశ్- ఈసారి లడ్డూ వేలానికి కొత్త నిబంధనలు అమలు - Balapur Ganesh 2024

Balapur Ganesh 2024 : బాలాపూర్​లో భారీ గణనాథుడు కొలువుదీరాడు. కోరిన వారి కోరికలు తీర్చే విఘ్నేశ్వరుడి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. 9 రోజుల పాటు భక్తులకు దర్శనమివ్వనున్నాడు. పెద్ద సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకుని గణపయ్య ఆశీస్సులు పొండుతున్నారు. బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా వేద పండితులు తొలి పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - BALAPUR GANESH 2024 SPECIALTIES

03:03 PM, 08 Sep 2024 (IST)

"హైడ్రా కీలక నిర్ణయం - ఇప్పటికే నివాసం ఉంటే ఆ ఇళ్లను కూల్చం" - Hydra Clarify On Demolitions

Hydra Clarity On Demolitions : రాష్ట్రంలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌ పరిధిలో ఇప్పటికే నిర్మించిన ఇళ్లలో నివాసం ఉంటే, వాటిని కూల్చమని తెలిపింది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - HYDRA COMMISSIONER RANGANATH

01:07 PM, 08 Sep 2024 (IST)

విపత్తులు వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా ప్రజలను ఆదుకోవాలి : కిషన్‌రెడ్డి - Kishan Reddy Visits Khammam

Kishan Reddy Visits Flood Affected Areas in Khammam : మున్నేరు ముంపుతో అల్లకల్లోమైన ఖమ్మం జిల్లాల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీలు ఈటల రాజేందర్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పర్యటించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి కాలనీల్లో పరిశీలిస్తూ బాధితులతో మాట్లాడారు. అనంతరం వరద బాధితులకు నిత్యావసర వస్తువులు పంపీణీ చేశారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - KISHAN REDDY VISITS KHAMMAM

11:32 AM, 08 Sep 2024 (IST)

రాష్ట్రంలో రాగల 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు! - ఈ జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్‌ హెచ్చరికలు - Heavy Rains In Telangana Today

Heavy Rains In Telangana Today : అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. కుమురం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - HEAVY RAINS IN TELANGANA

11:32 AM, 08 Sep 2024 (IST)

వినాయకుని పండుగ ఎలా జరుపుకోవాలి? పండుగ పరమార్థం ఏంటి? - Debate On Ganesh Chaturthi

Prathidhwani Debate On Ganesh Chaturthi : వినాయకుడి పుట్టిన రోజైన 'భాద్రపద శుద్ధ చవితి' రోజునే 'వినాయక చవితి' పండుగను హిందువులు జరుపుకుంటారు. ఆ రోజునే వినాయకుడు పుట్టాడని గణాధిపత్యం పొందాడని పలు పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. కానీ పండుగను ఎలా జరుపుకోవాలి? ఎలా జరుపుకుంటున్నాము? పండగ పరమార్థం ఏంటి? ఇదే నేటి ప్రతిధ్వని | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - PRATHIDWANI

10:20 AM, 08 Sep 2024 (IST)

హైడ్రా దూకుడు - ఒకే రోజు మూడుచోట్ల అక్రమ నిర్మాణాల కూల్చివేత - hydra demolish illegal assets

HYDRA Collapse Illegal Assets : హైదరాబాద్​లో ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా వారాంతాల్లో దాడులను మరింత ఉద్ధృతం చేస్తోంది. ఇవాళ మూడు చోట్ల కూల్చివేతలు సాగిస్తోంది. మాదాపూర్​లోని సున్నం చెరువు, దుండిగల్​లోని కత్వా చెరువును ఆక్రమించి కట్టిన నిర్మాణాలను కూల్చి వేస్తోంది. సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​లో అక్రమ నిర్మాణాలపైనా కొరడా ఝుళిపిస్తోంది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - HYDRA COLLAPSE ILLEGAL ASSETS

10:03 AM, 08 Sep 2024 (IST)

'ఆరోజు రాత్రి ఏం జరిగింది? ఆ పడవలు ఎవరివి?'- ప్రకాశం బ్యారేజీ కుట్రకోణంపై పోలీసుల దర్యాప్తు - Prakasam Barrage Boat Incident

Collision of Boats in Prakasam Barrage : ఏపీలోని ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. అసలు ఆ పడవలు ఎవరివి ఎందుకు వచ్చాయి? ఎవరైనా కావాలని వదిలేశారా లేక నదీ ప్రవాహానికి కొట్టుకొచ్చాయా ఇలా అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అయితే వాటికి వైఎస్సార్సీపీ రంగులు ఉండటం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలన్న ఇంజినీరింగ్ శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - BOATS COLLISION IN PRAKASAM BARRAGE

09:31 AM, 08 Sep 2024 (IST)

రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నష్టాన్ని మిగిల్చిన భారీ వర్షాలు - క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న అధికారులు - telangana floods heavy damage

Heavy Rains Caused Severe Damage : వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో కురిసిన భారీవర్షాలు తీవ్రనష్టం మిగిల్చాయి. ప్రకృతి విలయంతో సర్వస్వం కోల్పోయిన వారందెరో. ఒకరిది గూడు అయితే మరొకరిది ఆరు గాలం శ్రమించి పండించిన పంట. ఇలా ఒకటా రెండా భారీ వరదతో గంటల వ్యవధిలోనే సర్వస్వం కోల్పోయిన పరిస్థితి. వర్షం తగ్గుముఖం పట్టడంతో ముంపు ప్రాంతాల బాట పట్టారు అధికారులు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ ఎంత నష్టం వాటిల్లిందో ఆరా తీస్తున్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - TELANGANA RAINY FLOODS EFFECT

09:06 AM, 08 Sep 2024 (IST)

రామడుగు మోతె వాగు వంతెన అప్రోచ్‌ రోడ్డుకు మోక్షం - యుద్ధ ప్రాతిపదికన పనులు - New Bridge On Mothe vagu Karimnagar

New Bridge On Mothe vagu In Karimnagar : కరీంనగర్ జిల్లా రామడుగులోని మోతె వాగుపై నిర్మించిన నూతన వంతెన పనులు శరవేగంగా సాగుతున్నాయి. వరదలకు పాత వంతెన కూలిపోవడంతో ప్రయాణికులు జిల్లా కేంద్రానికి చేరేందుకు నానా ఇబ్బందులుపడ్డారు. రైతులకు పరిహారం చెల్లించక నిలిచిపోయిన వంతెన అప్రోచ్‌ పనులు, తిరిగి ప్రారంభం కావడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - MOTHE VAGU BRIDGE ISSUE

08:06 AM, 08 Sep 2024 (IST)

పూర్తిగా నిండిన ఉస్మాన్​, హిమాయత్​ సాగర్​ రిజర్వాయర్లు - గేట్లు ఎత్తివేత - Himayat and Osman Sagar gates Lift

Heavy Flood Water in Musi River : హైదరాబాద్ జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. ఎగువ నుంచి వరద నీరు పొట్టెత్తడంతో పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరువయ్యాయి. రాగల రెండుమూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికలతో జలమండలి అధికారులు హిమాయత్‌సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లు ఒక అడుగు మేర ఎత్తి మూసీలోకి నీటిని విడుదల చేశారు. మూసీలోకి వరద నీరు పోటెత్తడంతో పరివాహక ప్రాంతాల ప్రజలను జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తం చేశాయి. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - HEAVY RAINS IN HYDERABAD

07:17 AM, 08 Sep 2024 (IST)

నేటితో ముగియనున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి పదవీ కాలం - ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ - State Election Commission Candidate

Government To Appoint New State Election Commission : రాష్ట్ర ఎన్నికల కమిషన్ విషయంలో ప్రభుత్వం ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత కమిషనర్ పార్థసారధి పదవీ కాలం నేటితో ముగియనుంది. ఆయనను మరో ఏడాది కొనసాగిస్తారా? లేక కొత్త వారిని నియమిస్తారా? అన్నది వేచి చూడాలి. కొత్త కమిషనర్ నియామకానికి విశ్రాంత ఐఏఎస్ అధికారుల పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్న తరుణంలో ఎస్ఈసీ నియామకం కీలకం కానుంది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - STATE ELECTION COMMISSION

07:10 AM, 08 Sep 2024 (IST)

క్షణక్షణం ఉత్కంఠ : ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు - మరోమారు పొంగిపొర్లనున్న 'మున్నేరు'! - munneru flood again govt alert

Flood Water Again at Munneru : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షంతో మున్నేరుకు వరద ప్రవాహం పెరుగుతుంది. పరీవాహక ప్రాంత వాసులంతా ముందస్తు జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర సర్కార్‌ సూచించింది. మహబూబాబాద్, గార్ల, బయ్యారం తదితర మండలాల్లో కురుస్తున్న భారీ వర్షం కారణంగా ఖమ్మం మున్నేరు పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రులు తుమ్మల, పొంగులేటి అధికారులను ఆదేశించారు. ప్రజలంతా అధికారులకు సహకరించాలని కోరారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - FLOOD WATER AGAIN AT MUNNERU

Last Updated : Sep 8, 2024, 10:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.